breaking news
husband funeral
-
తలకొరివి పెట్టిన భార్య
కామారెడ్డి టౌన్: అనారోగ్యంతో కన్నుమూసిన భర్తకు అతని భార్య తలకొరివి పెట్టింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లికి చెందిన నాగల్ల రమేశ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 20న గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స కోసం రూ.8 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. పేద కుటుంబానికి చెందిన రమేశ్ దుస్థితిపై ‘సాక్షి’ప్రచురించిన కథనానికి పలువురు స్పందించి ఆర్థిక సాయం అందించారు. కానీ అప్పటికే శస్త్రచికిత్స ఆలస్యం కావడంతో రమేశ్ శనివారం మరణించాడు. సంతానం ఇద్దరూ కూతుళ్లే కావడంతో భార్య శ్యామలే ఆదివారం దేవునిపల్లిలో భర్త చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. -
భర్త అంత్యక్రియల కోసం పిల్లల్ని తాకట్టు పెట్టింది
చంపువా: పేదరికం ముందు తల్లిప్రేమ చిన్నబోయింది. కుటుంబానికి అండగా ఉన్న పెద్ద దిక్కు అనుకోకుండా మృతి చెందడంతో అతని అంత్యక్రియలకు అయిన అప్పులు చెల్లించడానికి వేరే దారి లేక తన ఇద్దరు పిల్లలను ఓ తల్లి తాకట్టుపెట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఒడీషాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చంపువా ప్రాంతంలోని గందూలి గ్రామానికి చెందిన రోజు కూలి రైబా.. అనారోగ్యంతో రిపబ్లిక్ డే రోజున మృతి చెందాడు. అప్పటి వరకు కూడబెట్టిన కొద్దిపాటి డబ్బు కూడా రైబా ఆసుపత్రి ఖర్చులకే కరిగిపోవడంతో భార్య సావిత్రికి అతని అంత్యక్రియలను నిర్వహించడానికి చేతిలో చిల్లిగవ్వ మిగలలేదు. తెలిసిన వారిని సహాయం కోసం అర్ధించినా అందరూ మొహం చాటేశారు. దీంతో తన ఇద్దరు పిల్లలు ముఖేశ్(13), సుఖేష్(11) లను పొరుగువారి వద్ద రూ. 5000 లకు తాకట్టుపెట్టిన సావిత్రి భర్త అంత్య క్రియలు నిర్వహించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రాంతీయ అభివృద్ధి అధికారి ఎస్ నాయక్ బుధవారం ఆ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఇద్దరు పిల్లలను తాకట్టు నుండి విడిపించారు. వారికి విద్యా సౌకర్యాలను అందించనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. కాగా సావిత్రికి మరో ముగ్గురు పిల్లలు ఆకాశ్(9), చిల్లరి(8), బర్షా(4) ఉన్నారు. -
భర్త దహనక్రియలను అడ్డుకున్న మొదటిభార్య