breaking news
HS Brahma
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 'నోటా'
హైదరాబాద్: మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారానే ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ మాజీ కార్యదర్శి హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు, అసెంబ్లీ సిబ్బందికి అధికారులు శనివారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమలో హెచ్ఎస్ బ్రహ్మ పాల్గొన్నారు. సరైన కోటా ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తామని ఆయన తెలపారు. ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా సుదుపాయం కూడా ఉన్నట్టు తెలిపారు. జూన్ 1 వతేది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు. -
'ఆగస్ట్ 15 కల్లా ఆధార్‌తో అనుసంధానం పూర్తి'
హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసే ప్రక్రియను భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మార్చి 1 నుంచి అనుసంధాన ప్రక్రియ ప్రారంభించి ఆగస్ట్ 15 కల్లా పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్ ఓట్లను నిర్మూలించవచ్చని ఆయన అన్నారు. ఇప్పటివరకు దేశంలో 74 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉందని ఆయన తెలిపారు. -
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా హెచ్ఎస్ బ్రహ్మ
క్రీడలు వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన డివిలియర్స్ దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. జొహన్నెస్‌బర్గ్‌లో జనవరి 18న వెస్టిండీస్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో వన్డేలో డివిలియర్స్ 31 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 16 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఈ వన్డేలో మొత్తం 44 బంతుల్లో 149 పరుగులు చేశాడు. గతంలో న్యూజిలాండ్ క్రికెటర్ కోరె అండర్సన్ వెస్టిండీస్‌పై 36 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు ఉంది. పంకజ్‌కు జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌ను పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. జనవరి 17న కోల్‌కతాలోని బెంగాల్ రోయింగ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ధ్రువ్ సిత్వాలాను అద్వానీ ఓడించాడు. ఇది పంకజ్‌కు ఏడో జాతీయ బిలియర్డ్స్ టైటిల్. అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, మాడ్రిడ్ క్లబ్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా నిలిచి 2014 బలాన్ డియోర్ అవార్డుకు ఎంపికయ్యాడు. సానియా జోడీకి ఏపియా ఇంటర్నేషనల్ డబుల్స్ టైటిల్ ఏపియా ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను సానియా జోడీ గెలుచుకుంది. జనవరి 16న సిడ్నీలో జరిగిన ఫైనల్లో అబిగైల్ స్పియర్స్-రకెల్ కోప్స్ జోన్స్ జోడీపై సానియామీర్జా, అమెరికాకు చెందిన బెథానీ మాటెక్ జోడీ విజయం సాధించింది. సానియా కెరీర్లో ఇది 23వ టైటిల్. సౌమ్యజిత్, మౌమాదాస్లకు జాతీయ టేబుల్ టెన్నిస్ టైటిళ్లు జాతీయ టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌమ్యజిత్ ఘోష్ గెలుచుకున్నాడు. పుదుచ్చేరిలో జనవరి 17న జరిగిన ఫైనల్లో జి.సాథియన్ను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మౌమాదాస్ గెలుచుకుంది. చరిత్ర సృష్టించిన సంధూ భారత గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ భారత ఫుట్‌బాల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. 79 ఏళ్ల తర్వాత తొలి అంచె యూరోపియన్ క్లబ్లో ఆడిన భారత ఆటగాడిగా తను రికార్డులకెక్కాడు. 2014 ఆగస్టులో సంధూ.. నార్వేయన్ టిప్పెలిగేన్ క్లబ్లో ఆడే స్టాబేక్ ఎఫ్‌సీ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటీవల ఫోలో ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 ఏళ్ల సంధూ తొలిసారిగా బరిలోకి దిగాడు. రాష్ట్రీయం తెలుగు రాష్ట్రాల్లో 6.54 కోట్ల ఓటర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 6.54 కోట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 3,70,82,855 కాగా వీరిలో మహిళా ఓటర్లు 1,86,64,912, పురుషులు 1,84,14,685 మంది. మూడో వర్గం వారు 3,258 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2,83,15,120. వీరిలో పురుషులు 1,44,72,054, మహిళలు 1,38,40,115, మూడో వర్గం వారు 2,351 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణలో ఉమ్మడి ఏపీకి పురస్కారం 2014 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యున్నత ప్రతిభను చూపిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సం ఘాన్ని అత్యుత్తమ రాష్ట్రంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలుచేయడంతో పాటు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు ప్రకటించింది. ఈ అవార్డును జాతీయ ఓటర్ల దినోత్సవమైన జనవరి 25న అందజేస్తారు. విశాఖపట్నంలో ఐఐఎంకు శంకుస్థాపన: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)కు విశాఖపట్నం సమీపంలోని గంభీరం గ్రామంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ జనవరి 17న శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు ఐఐఎంలలో తొలిగా విశాఖలోనే శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు హామీ ఇచ్చిన 11 సంస్థల్లో ఇది మొదటిది. ఐఐఎం బెంగళూరు.. విశాఖపట్నం ఐఐఎంకు మెంటార్ ఇన్స్టిట్యూషన్గా ఉంటుంది.తెలంగాణకు పెట్రోలియం ఉత్పత్తుల పరిరక్షణ పురస్కారం: పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో అత్యుత్తమ పరిరక్షణ ప్రమాణాల్ని పాటించిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పురస్కారాన్ని ప్రకటించింది. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో పాటించాల్సిన ప్రమాణాలు, ముందస్తు రక్షణ చర్యలపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించినందుకు పెట్రోలియం ఉత్పత్తుల పరిరక్షణ-2014 పురస్కారాన్ని ఇస్తున్నట్లు వెల్లడించింది. స్మార్ట్ విలేజ్/వార్డు, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రారంభం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 18న స్మార్ట్ విలేజ్/వార్డు; స్మార్ట్ ఏపీ కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని వేలివెన్ను గ్రామంలో ప్రారంభించారు. గ్రామాలు, వార్డుల్లో నెలకొన్న సమస్యల్ని అధిగమించేందుకు ‘ప్రగతి కోసం ప్రజా ఉద్యమం’ నినాదంతో స్మార్ట్ ఏపీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీనికింద స్వచ్ఛమైన నీటి సరఫరా, ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం, అందరికీ విద్య, మహిళా సాధికారత ఇలా వివిధ కార్యక్రమాలపై దృష్టిసారించి రాష్ట్రాన్ని స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతారు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌గా సాయిబాబు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్‌గా గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వై.శ్రీనివాస శేషసాయిబాబు నియమితులయ్యారు. ప్రతిభా రాజీవ్ పురస్కారాల పేరు మార్పు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే‘ప్రతిభా రాజీవ్ పురస్కారాల’పేరు మారింది. ‘తెలుగు ఆత్మగౌరవ పురస్కారాలు’గా వాటి పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎన్వీ రమణారెడ్డి జనవరి19న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు అసోచామ్ అవార్డు ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ‘అసోచామ్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో మూడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఏడు లక్షల మందికి శిక్షణ ఇవ్వడంతో ఈ అవార్డుకు ఎంపికైంది. అవార్డులు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు- 2015 72వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను కాలిఫోర్నియాలో జనవరి 12న ప్రదానం చేశారు. వివరాలు.. ఉత్తమ చిత్రం (డ్రామా): బాయ్ హుడ్ ఉత్తమ చిత్రం (మ్యూజికల్/కామెడీ): ద గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ ఉత్తమ దర్శకుడు: రిచర్డ్ లింక్లేటర్ (బాయ్ హుడ్) ఉత్తమ విదేశీ చిత్రం: లెవియాథన్ (రష్యా) ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్ మెయెనీ (చిత్రం: ద థియరీ ఆఫ్ ఎవిరీథింగ్) ఉత్తమ నటి (డ్రామా): జులియినే మోరె (చిత్రం: స్టిల్ అలైస్) ఉత్తమ నటుడు (మ్యూజికల్/కామెడీ): మైఖల్ కీటన్ (బర్డ్ మెన్) ఉత్తమ నటి (మ్యూజికల్/కామెడీ): అమీ ఆడమ్స్ (బిగ్ ఐస్) ఇస్రోకు స్పేస్ పయనీర్ -2015 అవార్డు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ స్పేస్ పయనీర్- 2015 అవార్డును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఇవ్వనున్నట్లు జనవరి 13న ప్రకటించింది. ఇస్రో అంగారక యాత్ర మంగళ్యాన్ చేపట్టిన బృందానికి ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపింది. జమ్మూకాశ్మీర్‌కు ఈ- గవర్నెన్స్ అవార్డు 2014-15 సంవత్సరానికి ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డు జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి లభించింది. జిల్లా స్థాయిలో సమర్థవంతంగా సేవలు అందించినందుకు బహుమతిని అందజేస్తున్నట్లు జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డును ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిపాలనా సంస్కరణల విభాగం అందజేస్తుంది. అంతర్జాతీయం అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2014 నాసా, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ చేపట్టిన రెండు వేర్వేరు అధ్యయనాల ప్రకారం 1880 మొదలు భూమిపై నమోదైన అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2014 గుర్తింపు పొందింది. ఈ నివేదిక జనవరి 16న విడుదలైంది. ప్రపంచ టాప్-50లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రపంచంలో మార్కెట్ విలువ ఆధారంగా రెల్‌బ్యాంక్స్ టాప్-50 జాబితాను (2014కు) రూపొందించింది. ఇందులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 40.58 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో 45వ స్థానంలో నిలిచింది. టాప్-50లోని ఏకైక భారతీయ బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన వెల్స్‌ఫార్గో నంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకుంది. వార్తల్లో వ్యక్తులు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా హెచ్ఎస్ బ్రహ్మ భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్‌గా హరిశంకర్ బ్రహ్మ జనవరి 16న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన వీఎస్ సంపత్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో బ్రహ్మ నియమితులయ్యారు. ఈ హోదాలో కొనసాగేందుకు గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు. ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు ఉంటారు. గవర్నర్ ఆఫ్ ద ఇయర్‌గా రఘురామ్ రాజన్ భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్‌కు గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. లండన్ కు చెందిన ఫైనాన్షియల్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డును జనవరి 12న ప్రకటించింది. బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్.కె.సిన్హా బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా హిందూ మతానికి చెందిన జస్టిస్ సురేందర్ కుమార్ సిన్హా (64) జనవరి 13న ప్రమాణ స్వీకారం చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న బంగ్లాదేశ్‌లో అత్యున్నత న్యాయమూర్తి హోదా హిందూ మత వ్యక్తికి లభించడం ఇదే తొలిసారి. కేంద్ర సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్‌గా పహ్లాజ్ నిహలానీ కేంద్ర సెన్సార్ బోర్డు కొత్త చైర్‌పర్సన్‌గా చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ జనవరి 19న నియమితులయ్యారు. లీలా శాంసన్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో నిహలానీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. తొమ్మిది మంది కొత్త సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. వీరిలో తెలుగు నటి జీవిత ఉన్నారు. బీఎస్ఎన్ఎల్ కొత్త చైర్మన్‌గా శ్రీవాస్తవ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా జనవరి 16న అనుపమ్ శ్రీవాస్తవ బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు లేదా 60 ఏళ్ల వయసు వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. శ్రీవాస్తవ 1981 బ్యాచ్ ఇండియన్ టెలికం సర్వీస్ (ఐటీఎస్) అధికారి. జాతీయం వైమానిక దళంలో తేజస్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్ వైమానికదళంలో చేరింది. జనవరి 17న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ లోహ విహంగాన్ని అందించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా.. తేజస్ పత్రాల్ని పారికర్ నుంచి అందుకున్నారు. తేజస్ గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాల్ని, గగనతలం నుంచి నేలమీదున్న లక్ష్యాల్ని, గగనతలం నుంచి సముద్రం మీదున్న లక్ష్యాల్ని ఛేదించగలదు. భారత్ వృద్ధి రేటు 2016లో 6.3 శాతం భారత్ వృద్ధి రేటు 2016లో 6.3 శాతంగా ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనావేసింది. ఈ ఏడాది వృద్ధి 5.9 శాతమని, 2014లో 5.4 శాతమని అంచనాల్లో పేర్కొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, కీలక సంస్కరణల ప్రకటన, అమలు వంటి అంశాలు భారత్ ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2015’ అనే పేరుతో విడుదలైన నివేదికలో తెలిపింది. -
సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్న హెచ్ ఎస్ బ్రహ్మ
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా హెచ్.ఎస్. బ్రహ్మ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో ఏప్రిల్ 18వ తేదీ వరకు కొనసాగనున్నారు. అసోం రాష్ట్రానికి చెందిన బ్రహ్మ 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న విఎస్ సంపత్ గురువారం పదవి విమరణ చేశారు. దాంతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా హెచ్ ఎస్ బ్రహ్మను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. సంపత్ కూడా 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారే. ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టిన రెండో వ్యక్తి హెచ్ ఎస్ బ్రహ్మ. గతంలో అదే ప్రాంతానికి చెందిన జెఎం లింగ్డో పదవిని చేపట్టిన విషయం విదితమే. -
సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్న బ్రహ్మ
-
కోత్త సీఈసీగా హెచ్ ఎస్ బ్రహ్మ
ప్రధాన ఎన్నికల కమిషనర్ గా వి.ఎస్. సంపత్ స్థానంలో హరిశంకర్ బ్రహ్మ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. సంపత్ పదవీకాలం గురువారంతో ముగియనుంది. కాగా, హెచ్ఎస్ బ్రహ్మ 1975 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ పదవిని చేపట్టిన వారిలో జేఎం.లింగ్డో తర్వాత బ్రహ్మ రెండో వ్యక్తి అవుతారు. అలాగే, బోడో జాతికి చెందినవారిలో ఈ పదవి చేపట్టిన మొదటివారు అవుతారు. ప్రస్తుత సీఈసీ వీఎస్ సంపత్ పదవీకాలం గురువాంతో ముగియనుండటంతో బ్రహ్మ ఈ పదవి చేపట్టనున్నారు. -
జనసేన పార్టీ నమోదు కాలేదు: బ్రహ్మ
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటుడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయతలపెట్టిన పార్టీ ‘జనసేన’కు ప్రస్తుత ఎన్నికల బరిలో చోటు లభించేలా లేదు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు విడుదలవడం, ఎన్నికలకు అతితక్కువ వ్యవధి ఉండడం, పార్టీ కోసం దరఖాస్తు చేసుకుని రెండు రోజులే కావడం చూస్తుంటే తక్షణం పార్టీ ఏర్పాటు సాధ్యం కాదని తెలుస్తోంది. అయితే స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులపై పోటీచేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది. దీనిపై గురువారం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మను మీడియా సంప్రదించినప్పుడు దీనిపై స్పష్టత ఇచ్చారు. ‘జనసేన పేరుతో మార్చి 10న ఒక దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తులో పవన్‌కల్యాణ్‌ను అధ్యక్షుడిగా పేర్కొన్నారు. జనసేన పార్టీతో పోటీ చేస్తామని ఉంది. రెండు రోజులే అయింది ఆ లెటర్ వచ్చి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో అది కష్టం. నోటిఫై చేయాలి. పబ్లిక్ హియరింగ్ కావాలి. ఈ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఆరేడు నెలలు పడుతుంది. ఈ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. దానిలోపే రిజిస్ట్రేషన్ చేయడం అనేది కష్టం..’’ అని తెలిపారు. రిజిస్ట్రేషన్ జరగకుండా ఆ పార్టీ ఎన్నికలలోకి వెళ్లవచ్చా? అన్న ప్రశ్నకు బదులుగా ‘పార్టీ పేరు మీద వెళ్లకూడదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా పార్టీ ఎలా పెడతారు? రిజిస్ట్రేషన్ తప్పకుండా ఉండాలి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. పార్టీ పేరును ఉపయోగించుకోవచ్చా? అన్న ప్రశ్నకు బదులుగా ‘రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటిస్తే.. వేరే పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. రిజిస్ట్రేషన్ లేకుండా అసలు ప్రకటించకూడదు. పబ్లిక్‌గా వాడుకోకూడదు..’ అని స్పష్టం చేశారు. -
అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం ప్రభుత్వానిదే
కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోనిదే ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలని టీ కాంగ్రెస్ నేతలు ఇటీవల జీవోఎంను కలిసి విజ్ఞప్తి చేయడం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు అదనంగా 34 స్థానాలను పెంచాలని టీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల పెంపు విషయమై శనివారం తనను కలిసిన ఓ మీడియా చానల్‌తో బ్రహ్మ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 294 అసెంబ్లీ స్థానాలున్నాయని, సీట్లను పెంచాల్సి వస్తే ఆంధ్ర, తెలంగాణలో.. రెండు చోట్లా పెంచాలి కదా అని అన్నారు. అయితే సీట్లు పెంచుతారా? లేదా? అనేది ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. ఒక ప్రాంతంలో సీట్లను పెంచడం సాధ్యమేనా? అన్న ప్రశ్నకు.. సీట్ల పెంపుపై కేంద్రం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని, కేబినెట్ నిర్ణయం తర్వాత చేసుకోవచ్చని ఆయన బదులిచ్చారు. రాష్ట్ర విభజన జరుగుతుందా? లేదా? అనేది తాను సరిగ్గా చెప్పలేనన్నారు. ఇందుకు చాలా ప్రక్రియ... సమయం కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.