breaking news
hostel rooms
-
సీక్రెట్ కెమెరాలపై విద్యార్థినుల ఆందోళన.. సీఎంఆర్ కాలేజీకి పేరెంట్స్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ బాత్ రూమ్‌ల్లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో, టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్ రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్టు విద్యార్థినిలు ఆరోపించారు. రహస్యంగా వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో పని చేసే వంట సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో, వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు.అనంతరం, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విద్యార్థినిల ఆందోళనలతో వారి పేరెంట్స్ కాలేజీ వద్దకు చేరుకుంటున్నారు. ఈ ఘటనపై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో, కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
AP: గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు.. విద్యార్థినిల ఆందోళన
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థినిల వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థే ఇందుకు కారణమని అతడిని చితకబాదారు. ఈ సందర్భంగా రాత్రంతా విద్యార్థులు ధర్నాకు దిగారు.వివరాల ప్రకారం.. గుడివాడ మండలం శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చారు. ఓ విద్యార్థిని సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినిలు.. మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు చర్యలు తీసుకోకపోవడంతో వారంతా ఆందోళనలు చేపట్టారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3:30 గంటల వరకు విద్యార్థినిలు నిరసనల్లో పాల్గొన్నారు. గుడివాడ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లోని అమ్మాయిల హాస్టల్ బాత్రూం లో స్పై కెమెరా లు అమర్చి - వాళ్ల వీడియో లు చిత్రీకరించి - వాటిని బాయ్స్ హాస్టల్ వాళ్లకి అమ్మి డబ్బులు తీసుకుంటున్నారు - ఇప్పటికి 300 వీడియో లు అమ్మినట్టు సమాచారం ఈ మొత్తం ప్రక్రియ ని నాల్గవ సంవంత్సరం… https://t.co/WPuHnUa0Vh pic.twitter.com/xhIuXZQnlh— 𝐀𝗋α𝗏𝗂𐓣ᑯα𝐒αꭑ𝖾𝗍α🚩 (@HarieswarH) August 30, 2024 ఈ ఘటనకు కారణమైన విజయ్ను అక్కడికి తీసుకురావడంతో అతడిపై విద్యార్థినిలు దాడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ.. వాష్‌రూమ్‌లో కెమెరాలు అమర్చి.. వీడియోలు తీశారు. ఆ వీడియోలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనంతరం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విజయ్ను ఆసుపత్రికి తరలించారు. అలాగే, విజయ్ను విచారించిన తర్వాత.. అతడి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక, విద్యార్థినిలకు సంబంధించి దాదాపు 300 వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించినట్టు సమాచారం. 🚨 గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన.లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్‌కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్… pic.twitter.com/3rALM0f5D8— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) August 30, 2024 -
బకాయి.. ఆపై బడాయి
సర్వజనాస్పత్రి క్వార్టర్స్‌లో అనర్హుల 'మకాం' ఏళ్లు గడుస్తున్నా అద్దె చెల్లించని వైనం బయటి వ్యక్తులకూ అద్దెకిస్తున్న తీరు పెండింగ్‌లో రూ.8.50 లక్షల బకాయి నోటీసులు జారీ చేసినా ఫలితం శూన్యం అనంతపురం మెడికల్ : అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌లో అనర్హులు పాగా వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతరులు అందులో ఉంటున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అద్దె బకాయిలు కొండలా పేరుకుపోతున్నా..అధికారులు మాత్రం నిద్రమత్తు వీడడం లేదు. నామమాత్రపు అద్దె ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జీసెస్‌నగర్‌లో గృహ సముదాయాన్ని కట్టించారు. మొత్తం 35 క్వార్టర్స్ ఉన్నాయి. ఒక్కో క్వార్టర్లో కిచెన్, హాల్, బెడ్రూం సౌకర్యం ఉంది. నెలకు అద్దె రూ.1,433 మాత్రమే. నిబంధనల మేరకు ఇక్కడ ఉండాలంటే ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి తప్పనిసరి. క్వార్టర్స్ కావాలనుకున్న ఉద్యోగి తాను ఆస్పత్రిలోని ఫలానా విభాగంలో.. ఫలానా హోదాలో పని చేస్తున్నానని, తనకు క్వార్టర్ కేటాయించాలని దరఖాస్తు చేయాలి. అడ్వాన్స్‌గా రూ.5 వేలు, ఒక ఖాళీ చెక్కు, ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నిబంధనలు అమలు కావడం లేదు. కొందరి నుంచి చెక్కులు, అడ్వాన్స్ తీసుకున్న అధికారులు.. మరికొందరి విషయంలో మాత్రం పట్టించుకోలేదు. రాజకీయ ఒత్తిడితో కొన్ని క్వార్టర్స్ కేటాయించేశారు. తీరా ఇక్కడ తిష్టవేసిన కొందరు ఉద్యోగులు నెలవారీగా అద్దెలు చెల్లించడం లేదు. కట్టండని అడిగే వారూ కరువయ్యారు. కొందరైతే క్వార్టర్ తీసుకుంటున్నప్పటి నుంచి అద్దె చెల్లించిన దాఖలాలు లేవు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి మొత్తం రూ.8.60 లక్షల బకాయి ఉంది. కొందరు తమ పేరు మీద తీసుకుని ఎక్కువ అద్దెకు ఇచ్చుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు నిబంధనల ప్రకారం ఆస్పత్రి ఉన్నతాధికారులు తరచూ క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఎవరికైతే కేటాయించారో వారే ఉంటున్నారా? ఇతరులు ఉంటున్నారా? అన్నది తెలుసుకోవాలి. ఉద్యోగులు కాని వారుంటే ఖాళీ చేయించాలి. అయితే అధికారులు మాత్రం ఇటువైపు చూడడమే మానేశారు. దీంతో కొందరి తీరు 'ఆడింది ఆట'గా మారిపోయింది. గతంలో కొందరు మద్యం సేవించి ఇక్కడ గొడవకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఉద్యోగులు కాకున్నా క్వార్టర్స్‌లో తిష్ట ఆస్పత్రిలోని ఓ విభాగంలో పని చేసిన ఉద్యోగి కొన్నేళ్ల క్రితమే ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత ఆస్పత్రి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీలో పని చేశాడు. నిబంధనల ప్రకారం ఆయనకు క్వార్టర్ కేటాయించకూడదు. కానీ ఉన్నతాధికారుల అండతో ఇప్పటికీ అతను అక్కడే నివాసం ఉంటున్నాడు. సుమారు రెండేళ్లుగా అద్దె బకాయి ఉన్నాడు. మరో ఉద్యోగి తన పేరు మీద క్వార్టర్ తీసుకుని తన బంధువులకు ఇచ్చాడు. వీరు ఏకంగా ఐదేళ్ల నుంచి అద్దె చెల్లించలేదు. ఇలాంటి వారు ఐదారు మంది వరకు ఉన్నారు. అద్దె బకాయిలపై గత నెలలో అధికారులు నోటీసులు జారీ చేశారు. 20 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని పేర్కొనగా గడువు కూడా ముగిసింది. అయినా ఫలితం లేదు. క్వార్టర్స్ వారీగా బకాయి వివరాలు (ఏడాదికి పైగా బకాయి ఉన్నవి) క్వార్టర్ నంబర్ అద్దె బకాయి మొత్తం బీ–2, జీ4 రూ.85,980 బీ–2, ఎఫ్8 రూ.85,980 బీ–2, ఎఫ్4 రూ.61,619 బీ–2, ఎస్1 రూ.67,351 బీ–2, ఎస్6 రూ.54,454 బీ–1, ఎస్8 రూ.51,588 బీ–2, జీ7 రూ.48,722 బీ–2, ఎస్4 రూ.32,959 బీ–1, ఎఫ్8 రూ.34,392 బీ–1, ఎఫ్5 రూ.31,526 బీ–2, ఎస్3 రూ.28,660 బీ–2, ఎఫ్1 రూ.27,227 బీ–2, జీ5 రూ.25,794 బీ–2, ఎఫ్2 రూ.24,361 బీ–1, ఎఫ్2 రూ.24,361 బీ–2, ఎస్5 రూ.22,928 ఖాళీ చేయిస్తాం కొన్నాళ్లుగా క్వార్టర్స్ అంశంపై కసరత్తు చేస్తున్నాం. ఉద్యోగులు కాని వాళ్లుంటే ఖాళీ చేయిస్తాం. బకాయిల వసూళ్ల విషయమై మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌కు ఇప్పటికే లేఖ రాశాం. గతంలో ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు నిబంధనల ప్రకారం ముందుకెళ్తా. -డాక్టర్ జగన్నాథ్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్