breaking news
Horticulture Course
-
హార్టీకల్చర్ కోర్సులో ప్రవేశాలకు కౌన్సెలింగ్
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని 11 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు హార్టీసెట్–2023లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీఎస్సీ హార్టీకల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో జరిగిన ఈ కౌన్సెలింగ్‌కు 300 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ టి.జానకీరామ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యాన విద్యకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. వర్సిటీ పరిధిలోని నాలుగు ప్రభుత్వ ఉద్యాన కళాశాలలు, ప్రైవేటు యాజమాన్యంలోని నాలుగు అనుబంధ ఉద్యాన కళాశాలల్లో హార్టీసెట్ ద్వారా బీఎస్సీ హార్టీకల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి మొత్తం 92 సీట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యాన కళాశాలల్లో 52 సీట్లు, ప్రైవేటు ఉద్యాన కళాశాలల్లో 40 సీట్లకు ఈ కౌన్సెలింగ్ జరిగింది. -
వ్యవసాయ అనుబంధ కోర్సులు.. ఉపాధి వేదికలు
బీఎస్సీ (ఆనర్స్)-హార్టికల్చర్ ప్రపంచీకరణ ఫలితంగా మన దేశంలో ఉత్పత్తై ఫలసాయానికి విదేశాల్లో విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తున్నాయి. సాగు విధానాల్లోనూ ఆధునికత సంతరించుకోవడంతో.. సీజన్‌తో సంబంధం లేకుండా హార్టికల్చర్ ఏడాది పొడవునా ఉత్పత్తులను నమోదు చేస్తోంది. అయితే నిర్దిష్ట ప్రమాణాల మేరకు ఫలసాయం రావాలంటే దానికి సంబంధించిన సాంకేతిక మెలకువలు తెలిసిన అభ్యర్థులు కావాలి. అలాంటి మెలకువలను బోధించే లక్ష్యంతో ప్రారంభించిన కోర్సు.. హార్టికల్చర్ సైన్స్. మొత్తం నాలుగు కాలేజీల్లో బీఎస్సీ (ఆనర్స్)-హార్టికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది. వివరాలు.. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్-వెంకటరామన్నగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా). కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్-రాజేంద్రనగర్, హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్-మోజెర్ల (మహబూబ్‌నగర్ జిల్లా) కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్- అనంతరాజు పేట (వైఎస్ఆర్ కడప జిల్లా). కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు. అందుబాటులోని సీట్ల సంఖ్య: 210. అవకాశాలు: హార్టికల్చర్ సైన్స్‌లో నైపుణ్యం సాధించిన వారు వ్యవసాయ క్షేత్రాల్లో సూపర్వైజర్లు, ఫార్మ్ మేనేజర్లు, ఎస్టేట్ మేనేజర్లుగా కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రారంభంలోనే నెలకు కనీసం రూ.10వేల వేతనం సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో.. హార్టికల్చర్ శాఖలో అసిస్టెంట్లు, ఆఫీసర్లు, డైరక్టర్ల హోదా పొందొచ్చు. దీంతోపాటు.. స్వయం ఉపాధి మార్గాలు కూడా ఎన్నో. అర్హత కలిగిన అభ్యర్థులు సొంతగా నర్సరీలు, ఫార్మ్ సెంటర్లను నెలకొల్పవచ్చు. శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని కోర్సులు బీవీఎస్సీ అండ్ ఏహెచ్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్).. మెడిసిన్‌కు ప్రత్యామ్నాయంగా డాక్టర్ కలను తీర్చే కోర్సు. దీంతో ఈ కోర్సును అత్యధిక మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు. ఐదు కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. వివరాలు: కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ - తిరుపతి. సీట్లు: 60 ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ - గన్నవరం.సీట్లు: 60 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-హైదరాబాద్. సీట్లు: 60 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-ప్రొద్దుటూరు. సీట్లు: 30 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-కోరుట్ల. సీట్లు: 30 కోర్సు కాల వ్యవధి: ఐదేళ్లు బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో 18 అంశాల్లో బోధన ఉంటుంది. ఎంబీబీఎస్ మాదిరిగానే అనాటమీ, ఫిజియూలజీ, గైనకాలజీ, జెనెటిక్స్ తదితర అంశాలను చదవాలి. ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కేవలం జంతు సంరక్షణనే కాకుండా...పౌల్ట్రీ, బ్రీడ్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లోనూ విద్యార్థులకు శిక్షణనిస్తారు. అవకాశాలు: మన దేశంలో వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు అవకాశాల పరంగా కొదవలేదని చెప్పొచ్చు. కేవలం క్లినికల్ విభాగంలోనే కాకుండా పరిశోధన, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫార్మాస్యుటికల్ వంటి రంగాల్లో పుష్కలమైన అవకాశాలను దక్కించుకోవచ్చు. వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరు పశు సంవర్థక శాఖలో, వెటర్నరీ హాస్పిటల్స్, జూ పార్క్స్‌లో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు ఆర్మీలో కూడా అవకాశాలు ఉంటాయి. ఏటా ఆర్మీ కెప్టెన్ హోదాలో వెటర్నరీ డాక్టర్లను షార్ట్ సర్వీస్ కమిషన్ పద్ధతిలో నియమించుకుంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. నూతన ఔషధాల పరిశోధన కోసం ఫార్మాస్యూటికల్ సంస్థలు ఆర్ అండ్ డీ విభాగంలో వెటర్నరీ డాక్టర్లను నియమించుకుంటున్నాయి. సొంత క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా కూడా ఆదాయం పొందొచ్చు. ప్రభుత్వ సర్వీసులో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో వెటర్నరీ సర్జన్‌గా నెలకు రూ. 45 వేల వేతనం లభిస్తుంది. ఐసీఏఆర్ వంటి ఇన్స్టిట్యూట్లలో శాస్త్రవేత్తగా ఎంపికైతే నెలకు రూ. 50 వేల వేతనంతో కెరీర్ ప్రారంభమవుతుంది. ప్రైవేట్ రంగంలో నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనంగా అందుకోవచ్చు. బీఎఫ్ఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ). కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్-ముతుకూరు (నెల్లూరు జిల్లా)లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇందులో సీట్ల సంఖ్య: 30.ఈ కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు. సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తారు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లుంటాయి. కోర్సు-అవకాశాలు: మత్స్య నిర్వహణ, సంబంధిత అంశాలపై ఈ కోర్సులో అవగాహన కల్పిస్తారు. ఈ క్రమంలో చేపల పెంపకం, పోషణ, వాటికి వచ్చే వ్యాధులు, జన్యుశాస్త్రం, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ప్రాసెసింగ్, మేనేజ్మెంట్ తదితర అంశాలను బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని సంబంధిత విభాగాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. ప్రైవేట్ రంగంలో సీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ యూనిట్స్, ఆక్వా ఫీడ్ ప్లాంట్స్, ఫిషింగ్ గీయర్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, పరిశోధన సంస్థల్లో వివిధ హోదాలను అందుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా స్థిరపడొచ్చు. ఉన్నత విద్యా విషయానికొస్తే.. బ్యాచిలర్ తర్వాత పీజీ (ఎంఎఫ్ఎస్సీ) కోర్సు చేయవచ్చు. నోటిఫికేషన్ సమాచారం అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ) ప్రవేశం: ఎంసెట్-2014 (మెడికల్ స్ట్రీమ్) ర్యాంక్ ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా. వయసు: 17-22 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు-25 ఏళ్లు, పీహెచ్ విద్యార్థులకు-27 ఏళ్లు) దరఖాస్తు: వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 10, 2014. వివరాలకు: www.angrau.ac.in కౌన్సెలింగ్‌కు అవసరమైన సర్టిఫికెట్లు ఇంటర్మీడియెట్ మార్కుల మెమో ఎంసెట్-2014 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఎస్ఎస్సీ/తత్సమాన సర్టిఫికెట్ సంబంధిత విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రం ఆరు నుంచి 12వ తరగతి వరకు ధ్రువీకరించిన స్టడీ సర్టిఫికెట్లు రెసిడెన్స్ సర్టిఫికెట్ (అవసరమైతే) ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ, చివర చదివిన తరగతికి సంబంధించింది)