breaking news
horoscope stories
-
Daily Horoscope: ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు.. ధనవ్యయం..
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, వైశాఖ మాసం, తిథి: పౌర్ణమి సా 5.29 వరకు, తదుపరి పాడ్యమి, నక్షత్రం: మూల ఉ.11.38 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.10.07 నుండి 11.38 తిరిగి, రా. 8.43 నుండి 10.14 వరకు, దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.23 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.57 వరకు, అమృతఘడియలు: తె.5.49 నుండి 7.20 వరకు (తెల్లవారితే మంగళవారం), గురుపౌర్ణమి, వ్యాసపౌర్ణమి; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.33, సూర్యాస్తమయం: 6.35. మేషం: ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వృషభం: కొత్తగా రుణాలు యత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. దైవదర్శనాలు. మిథునం: శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలమవుతాయి. కర్కాటకం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. సింహం: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య: కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. తుల: సన్నిహితులు దగ్గరవుతారు. కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు. కళాకారులకు సత్కారాలు. వృశ్చికం: ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ధనవ్యయం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు. ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహ, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. మకరం: అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు. కుంభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. మీనం: కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. శుభవార్తలు వింటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.. -
నైతిక జీవనానికి అద్దం పట్టిన జాతక కథలు
సంబోధిని పొందకముందు బుద్ధుని పూర్వజన్మల గురించి తెలిపే 547 కథలే జాతక కథలు. బుద్ధుని ప్రామాణిక బోధలైన పాలీ భాషలోనున్న త్రిపిటకాల్లోని సుత్తపిటకంలోని ఖుద్ధక నికాయంలో జాతక కథల గ్రంథం ఒకటి. మానవుల ప్రవర్తనలోని వైఫల్యాలను సరిదిద్దడానికి, ఆ తప్పుల్ని సరిచేసుకోడానికి మరోకథను చెప్పి, తద్వారా ఆ తప్పుని చూపించటమే జాతక కథల ముఖ్యోద్దేశం. ప్రతి జాతక కథ, దానిని చెప్పవలసి వచ్చిన సందర్భాన్ని సూచిస్తూ మొదలై, మధ్యలో బోధిసత్వుని పూర్వజన్మ కథను కలిగి వుంటుంది. పరంపరగా సంప్రాప్తమైన లక్షణాలతో, సంకీర్ణమైన కారణ–కార్యసూత్రం జీవరాశిలో ఏ విధంగా పనిచేస్తుందో చెప్పటమే కథావస్తువుగా సాగుతుంది జాతక కథ. మానవులు, ప్రాణుల మధ్య ఎలాంటి భేదభావాన్ని చూపక, ప్రాణిక ఏకతను చాటుతూ, బుద్ధుడు బోధించిన అనిచ్చ(అనిత్య), దుక్క(దుఃఖ), అనత్త(అనాత్మ) అనే మూడు అక్షణాలు, పది శీల లక్షణాలు, నాలుగు ఆర్యసత్యాలతో కలిపి, నైతిక బోధ ప్రధానాంశంగా సాగుతాయి జాతక కథలు. బుద్ధుడు చెప్పిన దశపారమితలు సాధిస్తే ఆ వ్యక్తి ఉత్తముడవుతాడు. దానం, శీలం, ప్రజ్ఞ, ఓర్పు, సత్యం ఇలాంటి పది గుణాలే దశపారమితలు. ఈ గుణాల్ని ఎలా రూపొందించు కోవాలి, ఎలా కాపాడు కోవాలి, ఎలా పెంపొందించు కోవాలో ఈ కథలు తెలుపుతాయి. నైతికతని కథల ద్వారా ముఖ్యంగా జంతువుల్ని, పక్షుల్ని, పాముల్ని పాత్రలుగా చేసి కథలుగా మలచడం ప్రపంచ సాహిత్యంలోనే తొలి ప్రయోగం. పంచతంత్ర కథలు, ఈసప్ కథలు, కథాసరిత్సాగరం, జొసాఫెట్ కథలు... పర్షియా, అరేబియా, గ్రీకు, రోమన్ల కథా రచనలూ, కొన్ని షేక్స్పియర్ రచనలూ ఈ జాతక కథల ప్రభావానికి లోనైనవే. ప్రపంచ బాలసాహిత్యానికి పునాదిరాళ్ళు ఈ జాతక కథలు. భిక్ఖు ధమ్మరక్ఖిత సంపాదకత్వంలో ప్రముఖ బౌద్ధ రచయితలు బొర్రా గోవర్ధన్, బిక్ఖు ధమ్మరక్ఖిత ఈ గ్రం«థాన్ని పాలీ మూలం నుంచి సులభ వ్యావహారికంలో ఆసక్తికరంగా తెలుగులోకి అనువదించారు. జాతక కథలకు ఆచార్య బుద్ధఘోషుడు రాసిన ముందుమాటను భిక్ఖు ధమ్మరక్ఖిత తెనిగించారు. సద్ధర్మం చిరస్థాయిగా వుండటానికి బుద్ధుడు చెప్పినట్లు, పదాలు, వాక్యాలు సరైన క్రమంలో వుంటే వాటి అర్థాన్ని కూడా చక్కగా గ్రహించవచ్చు అన్న రెండు సూచనలను అనుసరించి అనువదించిన రచయితలు బౌద్ధ ధమ్మాన్ని, సాహిత్యాన్ని ఔపోసన పట్టిన దీక్షాపరులు. ఒక సాధకుడు ఎరుకలో సంకల్పించి, నైతిక ధార్మిక పురోగతిని సాధించి, సంసారంలోని ఇబ్బందులను అధిగమించి ప్రశాంతమైన, ఎల్లలు లేనటువంటి బుద్ధత్వాన్ని పొందే పరిణామాన్ని ఈ గ్రంథం చక్కటి కథన శైలిలో వివరించింది. ఈ గ్రంథంలో జాతక వ్యాఖ్యానంలో మొదటిదైన దూరే నిదాన కథతో ప్రారంభమై, అపణ్ణకవ, శీల, కురుఙ్జ, కులావక, అత్థకామ, ఆసీస, ఇత్థి, వరుణ, పపాయుహ్హ, లిత్త, పరోసత, హంచి, కుసనాళి, అసమ్పదాన, కకణ్ణక అనే 15 వర్గాలలో, వర్గానికి 10 చొప్పున మొత్తం 150 కథలున్నాయి. భగవాన్ బుద్ధుడు జేతవనంలో వున్నప్పుడు అనాధపిండక శ్రేష్టికి మిత్రులైన 500 మంది తైర్థిక శ్రావకులకు చెప్పిన అపణ్ణక జాతకం ఈ గ్రంథంలో మొదటి జాతక కథ కాగా, బుద్ధుడు నాలందాలోని వేళువనంలో వున్నప్పుడు దుర్మతి అయిన దేవదత్తుని ఆదరించిన రాజు అజాతశత్రు గురించి చెప్పిన సజ్జీవ జాతక కథ, చివరి జాతక కథ. 2004లోనే బౌద్ధధర్మ పరిరక్షణ, ప్రచారాలకు పూనుకున్న (మునుపటి ఆనంద బుద్ధవిహార) మహాబోధి బుద్ధవిహార, బౌద్ధధమ్మ ఉపాసకులు చెన్నూరు ఆంజనేయరెడ్డి, సంబటూరి వీరనారాయణరెడ్డి అనుసంధానకర్తలుగా చేపట్టిన తెలుగు త్రిపిటక జాతక కథలు మొదటి భాగాన్ని వెలువరించింది. బౌద్ధ అభిమానులే కాక, నౌతిక వర్తనాన్ని అభిలషించే ప్రతి పాఠకుడూ సేకరించి, దాచుకోవలసిన గ్రంథం ఇది. - డా||ఈమని శివనాగిరెడ్డి 9848598446