breaking news
history sheet
-
నేరాలకు పాల్పడే వారిపై కన్నేయండి : ఎస్పీ
విజయనగరం టౌన్: వరుస నేరాలకు పాల్పడే వారిని గుర్తించి, వారిపై హిస్టరీ షీట్లు తప్పనిసరిగా తెరిచి, నిరంతర నిఘాను ఉంచాలని ఎస్పీ జి.పాలరాజు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలుమార్లు నేరాలకు పాల్పడే వారికి స్టేషన్ బెయిల్‌ను మంజూరు చేయవద్దన్నారు. వారిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపైన, బెల్టుషాపులు ద్వారా మద్యం విక్రయాలు చేపట్టే వారిపైనా, నిషేధిత ఖైనీ, గుట్కాలు విక్రయదారులు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, మద్యం సేవించి బహిరంగ ప్రాంతంలో వీరంగం చేసే వారిపైనా, గంజాయి అక్రమ రవాణాదారులపైనా దాడులు ఉధృతం చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందే సాంకేతికత జిల్లా పోలీసు శాఖకు త్వరలో అందుబాటులో తీసుకురానున్నట్లు, ఈ పరిజ్ఞానంతో కేసుల మిస్టరీని చేధించవచ్చన్నారు. అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరశురామ్, బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీలు టి.త్రినాథ్, గురుమూర్తి, సీసీఎస్ డీఎస్పీ ఎఎస్.చక్రవర్తి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు, మహిళా పీఎస్ డీఎస్పీ కుమారస్వామి, డీటీసీ డీఎస్పీ సిహెచ్‌వి.ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ ఎ.హనుమంతు, స్పెషల్ బ్రాంచ్ సీఐ బివిజె.రాజు, డీసీఆర్బీ సీఐ రఘు శ్రీనివాస్, లీగల్ అడ్వయిజర్ జానకి రామరావు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
'ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇదంతా'
హైదరాబాద్: భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు. కొంతమంది పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు. కర్నూలు ఎస్పీకి కనీస విచక్షణ లేదా అని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండా ఎమ్మెల్యేపై రౌడీషీట్ తెరుస్తారా అని నిలదీశారు. ఏ సందర్భంలో రౌడీషీట్ తెరుస్తారో చదువుకున్నారా అని ప్రశ్నించారు. కొంత మంది పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మైసూరారెడ్డి ఆరోపించారు.