breaking news
the Himalayas
-
మహావతార్ బాబా
యోగి కథ బాబా పేరుతో రజనీకాంత్ సినిమా తీసింది ఈ బాబా గురించే. ఈయన ఇంకా బతికి ఉన్నాడని హిమాలయాల్లోనే ఉన్నాడని నమ్మేవారు చాలామంది ఉన్నారు. యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చిన మహావతార్ బాబా తమిళనాడులోని పారంగిపేట్టయ్‌లో క్రీస్తుశకం 203 నవంబర్ 30న జన్మించారు. పాశ్చాత్యదేశాలలో యోగ విద్యకు ప్రాచుర్యం కల్పించిన పరమహంస యోగానంద సహా పలువురు యోగా గురువులు మహావతార్ శిష్య పరంపరలోని వారే. మహావతార్ బాబా అసలు పేరు ఏమిటో చాలాకాలం వరకు ఎవరికీ తెలియదు. అయితే, మహావతార్‌బాబాకు ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగరాజన్ అని మార్షల్ గోవిందన్ (యోగాచార్య ఎం.గోవిందన్ సచ్చిదానంద) తన పుస్తకంలో రాశారు. ‘బాబాజీ అండ్ ది 18 సిద్ధ క్రియా యోగ ట్రెడిషన్’ పేరిట రాసిన ఆ పుస్తకంలో మహావతార్ బాబా జీవిత విశేషాలను వెలుగులోకి తెచ్చారు. భోగర్‌నాథర్ శిష్యుడిగా యోగసాధన ప్రారంభించిన మహావతార్ బాబా, తర్వాతి కాలంలో సిద్ధ అగస్త్య వద్ద క్రియాయోగ శిక్షణ పొందారు. బదరీనాథ్ చేరుకుని, అక్కడ క్రియాయోగ సాధన ద్వారా మహావతార్ బాబా సిద్ధి పొందారని ప్రతీతి. అయితే, క్రీస్తుశకం మూడో శతాబ్దికి చెందిన మహావతార్ బాబాను 1861-1966 మధ్య కాలంలో కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూసినట్లు యోగా గురువు శ్యామాచరణ లాహిరి, ఆయన శిష్యులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అలహాబాద్‌లో 1894లో జరిగిన కుంభమేళాలో మహావతార్ బాబాను ప్రత్యక్షంగా కలుసుకున్నట్లు లాహిరి శిష్యుడైన యుక్తేశ్వర గిరి తన పుస్తకం ‘కైవల్య దర్శనం’లో రాశారు. -
బ్రహ్మకమలం విరబూసింది
సంవత్సరానికి ఒకేసారి పూసే బ్రహ్మకమలం హిందూపూర్ లోని ఓ ఇంట్లో విరబూసింది. అనంతపురం జిల్లా హిందూపురంలోని డీబీ కాలనీలోని ద్వారకానాథ్ రెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మ కమలం మొక్కను తెచ్చి పెంచుతున్నారు. ఈ క్రమంలో శనివారం బ్రమ్మ కమలం పువ్వు వికసించింది. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. హిమాలయాల్లో దొరికే.. ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని భావిస్తారు.