breaking news
highest run partnership
-
సెంచరీలతో చెలరేగిన ఆఫ్గన్ ఓపెనర్లు.. ప్రపంచ రికార్డు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్(125 బంతుల్లో 145 పరుగులు, 13 ఫోర్లు, 8 సిక్సర్లు), ఇబ్రహీం జర్దన్(119 బంతుల్లో 100 పరుగులు, 9 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరి ధాటికి అఫ్గానిస్తాన్ 400 పరుగులు దాటుతుందని అనిపించింది. కానీ స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔట్ కావడం.. తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. వీరి తర్వాత మహ్మద్ నబీ చివర్లో 15 బంతుల్లో 25 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, హసన్ ముహ్మద్, షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. ఎబాదత్ హొసెన్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తడబడుతోంది. ప్రస్తుతం 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 25 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. ఇక అఫ్గానిస్తాన్ ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడమే కాకుండా ప్రపంచ రికార్డుతో మెరిశారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దన్‌లు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 256 పరుగులు జోడించారు. అఫ్గాన్ వన్డే చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకముందు 2010లో స్కాట్లాండ్పై కరీమ్ సాదిక్, మహ్మద్ షెహజాద్‌లు రెండో వికెట్‌కు 218* పరుగులు జోడించి రెండో స్థానంలో ఉన్నారు.2010లోనే షార్జా వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షెహజాద్, నూర్ అలీ జర్దన్‌లు రెండో వికెట్‌కు 205 పరుగులు జోడించి మూడో స్థానంలో ఉన్నారు. ► ఇక ఓవరాల్‌గా అఫ్గాన్ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో పరిశీలిస్తే 256 పరుగుల భాగస్వామ్యం రెండో అత్యధికంగా ఉంది. ఇక మొదటి స్థానంలో అస్గర్ అప్గన్, హస్మతుల్లా షాహిది జోడి ఉంది. ఈ జోడి 2021లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో నాలుగో వికెట్‌కు 307 పరుగులు జోడించారు. ► ఇక వన్డే క్రికెట్లో బంగ్లాదేశ్‌పై ఏ జట్టుకైనా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకముందు 2022లో టీమిండియా నుంచి కోహ్లి, ఇషాన్ కిషన్ల జోడి రెండో వికెట్‌కు 290 పరుగులు జోడించి తొలి స్థానంలో ఉన్నారు. The moment @RGurbaz_21 reached his 4th ODI hundred! 🤩#AfghanAtalan | #BANvAFG2023 | #XBull pic.twitter.com/0AmNoEtGol — Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023 When @IZadran18 brought up his 4th ODI hundred! 🤩#AfghanAtalan | #BANvAFG2023 | #XBull pic.twitter.com/Lv1eV610cg — Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023 చదవండి: విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి -
అయ్యర్, అశ్విన్‌ల ఖాతాలో ప్రపంచ రికార్డు
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విజయంలో శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్‌లది కీలకపాత్ర. 74 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన టీమిండియాను ఈ ఇద్దరు 71 పరుగుల భాగస్వామ్యంతో గెలిపించారు. ఈ నేపథ్యంలోనే టెస్టు క్రికెట్లో అయ్యర్, అశ్విన్‌లు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఎనిమిదో వికెట్‌కు 71 పరుగులు జోడించిన అయ్యర్, అశ్విన్‌లు టీమిండియా తరపున ఒక టెస్టులో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో లాలా అమర్‌సింగ్- లాల్ సింగ్ జోడి ఉంది. 1932లో ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో ఈ జోడి ఎనిమిదో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. టీమిండియాకు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇక మూడోస్థానంలో కపిల్ దేవ్-లక్ష్మణ్ శివరామకృష్ణన్ జోడి ఉంది. 1985లో శ్రీలంకతో టెస్టులో ఈ జోడి ఎనిమిదో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. A crucial 71-run stand to win the Test 🤝 R Ashwin and Shreyas Iyer stamped their authority with the bat in Mirpur 👏 #BANvIND — ESPNcricinfo (@ESPNcricinfo) December 25, 2022 చదవండి: భయపెట్టిన బంగ్లా బౌలర్‌ను ఉతికారేసిన అశ్విన్ -
ట్రిఫుల్, డబుల్ సెంచరీలతో రికార్డు బద్దలు
ముంబై: మహారాష్ట్ర క్రికెటర్లు స్వప్నిల్ గుగాలే, అంకిత్ బావ్నే సరికొత్త రికార్డు సృష్టించారు. రంజీ క్రికెట్ లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసి పాత రికార్డులను చెరివేశారు. ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో స్వప్నిల్, అంకిత్ కలిసి 594 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. రంజీ క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. స్వప్నిల్ ట్రిఫుల్, అంకిత్ డబుల్ సెంచరీలతో పరుగుల వరద పారించారు. 41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన మహారాష్ట్ర వీరిద్దరి విజృంభణతో భారీ స్కోరు చేసింది. స్వప్నిల్(351; 521 బంతుల్లో 37 ఫోర్లు, 5 సిక్సర్లు), అంకిత్(258; 500 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరిద్దరీని అవుట్ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు విఫలయత్నం చేశారు. 635/2 స్కోరు వద్ద మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.