breaking news
high croud
-
భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు
హైదరాబాద్: కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో వేకువజాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాల్లో భక్తులు దీపోత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం, ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆరాధ్యదైవం శివుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాశీచింతల దేవాలయానికి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పంచారామాలు భక్త జనసందోహంతో సందడి వాతావరణం నెలకొంది. ఇంద్రకీలాద్రి: విజయవాడలోని కృష్ణానది తీరం భక్తులతో నిండిపోయింది. అన్ని ఘాట్లలో తెల్లవారుజామున 2 గంటల నుంచే వేల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పాత శివాలయం, విజయేశ్వరాలయం, ఇంద్రకీలాద్రిపై కొలువైన మల్లేశ్వరస్వామి వార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేస్తున్నారు. -
పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు
తాండూరు: రంగారెడ్డి జిల్లాలో కల్తీకల్లు పంజా విసురుతుంది. గత రెండు రోజులుగా తాండూరు జిల్లా ఆస్పత్రిలో 50 మంది వరకు కల్తీకల్లు బాధితులు ఆస్పత్రి పాలయ్యారు. మల్రెడ్డిపల్లికి చెందిన పార్వతమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మంగళవారం హైదరాబాద్కు తరలించారు. బాధితుల పిచ్చి చేష్టలు, అరుపులతో జిల్లా ఆస్పత్రిలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. బాధితులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మత్తుపదార్థాలు లేని కల్లు సేవించడం వల్లే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు తెలిపారు. కాగా, రాజేంద్రనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథ్ జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కల్తీ కల్లు బాధితుల్లో సోమవారం ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.