breaking news
hig court
-
High Court: విచారణ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
వల్లభనేని వంశీ హెల్త్ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఆదేశాలు
-
కేసీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
-
ఈనెల 23 వరకు జీవో నెం.1 పై హైకోర్టు తాత్కాలిక స్టే
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ రేపటికి వాయిదా
-
హైకోర్టు లో కొనసాగుతున్న ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు విచారణ
-
జూబ్లీహిల్స్ లోని పబ్ ల వ్యవహారం పై హైకోర్టు మరోసారి సీరియస్
-
సిట్ రద్దు.. సీబీఐకి ఎమ్మెల్యే కొనుగోలు కేసు
-
ఢిల్లీ హైకోర్టుకు చేరిన TRS పేరు మార్పు వ్యవహారం
-
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో వాడీ వేడీగా సాగిన వాదనలు
-
కుమార్తె ను చూడడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా : వైఎస్ విజయమ్మ
-
వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
-
పవన్ పై మంత్రి రోజా ఫైర్
-
గన్ షాట్ : రాజకీయ లబ్ది కోసం కోర్టులనే తప్పుదోవ పట్టిస్తారా..?
-
బిగ్ క్వశ్చన్ : ఫేక్ యాత్రకి షాక్..
-
‘కోమటిరెడ్డి’కి గన్మెన్ల తొలగింపు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి గన్మెన్లను తొలగించారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులనుంచి జిల్లా పోలీసులకు మూడు రోజుల కిందటే ఈ ఉత్తర్వులు అందాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల మొదటిరోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఈ సందర్భంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్న టూ ప్లస్ టూ గన్మెన్లను తొలగించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కాగా, మూడు రోజుల కిందట ఇంటెలిజెన్స్ విభాగంనుంచి ఉత్తర్వులు కూడా అందాయని సమాచారం. కాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఈ మేరకు జిల్లా పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. తనను హత్య చేయడానికే గన్మెన్లను తొలగించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గన్మెన్ల తొలగింపు ఉత్తర్వులు జిల్లా పోలీసుశాఖకు చేరడం, వారు నోటీసులు జారీ చేయనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కుట్రదాగి ఉంది కోమటిరెడ్డికి గన్మెన్లను తొలగించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన అనుచరవర్గం ఆరోపిస్తోంది. ఇటీవల కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు మున్సిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్ హత్య జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తనకు ప్రాణభయం ఉందని శ్రీనివాస్ గన్మెన్లను కేటాయిం చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాగా శ్రీనివాస్‌కు ఎలాంటి గన్మన్లను కేటాయించని నేపథ్యంలోనే ఆయన హత్య జరగడం సంచలనం సృష్టించింది. మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ నేతకు గన్మెన్లను ఎలా తొలగిస్తారని ఆయన అనుచర వర్గం ప్రశ్నిస్తోంది. పోలీసులు మంగళవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గన్మెన్లకు తొలగింపునకు సంబంధించి నోటీసులు జారీ చేస్తామని చెబుతున్నా, వాస్తవానికి సోమవారంనుంచే ఆయన గన్మెన్లను తీసేశారని చెబుతున్నారు. ఈ కారణంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏదైనా హాని తలపెడతారేమోనన్న అనుమానాలను ఆయన అనుచర వర్గం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ పరిణామాల అన్నింటి నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకత్వం ప్రభుత్వ చర్యను ఖండిస్తూ ఆందోళనలు చేపట్టే ఆకాశం ఉంది. మరోవైపు కోమటిరెడ్డి శాసనసభ్యత్వం రద్దుకు సంబంధించి మంగళవారం హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. మరోవైపు ప్రభుత్వం తనకు గన్మెన్లను తొలగించడాన్ని కోమటిరెడ్డి సీరియస్‌గానే పరిగణిస్తున్నారని, ప్రభుత్వం తనపై చేస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న యోచనలో ఉన్న ట్టు ఆయన అనుచర నేతలు చెబుతున్నారు. -
హైకోర్టు తీర్పు హర్షణీయం
సాక్షి, సంగారెడ్డి: 123 జీవోను కొట్టివేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళ ఓ ప్రకటనలో తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ సేకరణ ప్రభుత్వం 123 జీవో ప్రకారం చేపట్టిందన్నారు. ప్రభుత్వం నిర్వాసితులు డిమాండ్లను పట్టించుకోకుండా మొండిగా 123 జీవో ప్రకారం భూ సేకరణ ప్రారంభించిందన్నారు. హైకోర్టు సైతం నిర్వాసితులకు నష్టంచేసే 123 జీవోను కొట్టివేసి 2013 చట్టం ప్రకారం భూములు సేకరించాలని చెప్పందన్నారు. ఇకనైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా 2013 చట్టం ప్రకారం భూములు సేకరించి, నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు.