breaking news
Heroines Remuneration
-
రెమ్యునరేషన్లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా?
హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో చాలా వ్యత్యాసం ఉటుందన్న విషయం అందరికి తెలిసిందే. హీరోలతో పోల్చితే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది. స్టార్ హీరోయిన్లకి సైతం ఓ మామూలు హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ ఇవ్వరనేది పచ్చి నిజం. కానీ ఇప్పడు వారు రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. కాగా సినిమా సినిమాకు మన హీరోయిన్లు క్రేజ్ పెరిగిపోతోంది. లేడి ఒరియంటెడ్ పాత్రలకు సైతం సై అంటూ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో వారి రెమ్మునరేషన్ పెంచుకుంటూ పోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండ వారి పారితోషికం ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పాత్రను బట్టి ఆ సినిమా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇలా కోట్ల నుంచి లక్షల వరకు పారితోషికంగా అందుకుంటున్న సౌత్ హీరోయిన్లు ఎవరూ, ఎవరెంత డిమాండ్ చేస్తున్నారు. వారి రెమ్మునరేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. నయనతార: ఒక్కో సినిమాకు ఇప్పటికీ రూ.4 కోట్ల వరకు తీసుకుంటుంది నయన్. ఇప్పటికీ అదే రేంజ్ మెయింటేన్ చేస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్లో కథానాయికగా చేస్తున్న నయన్ ఈ మూవీకి భారీగానే డిమాండ్ చేసిందని వినికిడి. పూజా హెగ్డే: వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ ప్రస్తుతం ఇండస్ట్రీలో లక్కీ లెగ్ అనిపించుకుంటుంది. దీంతో ఆమెను హీరోయిన్గా మాత్రమే కాకుండా... ఇతర చిత్రాల ఈవెంట్స్‌కు కూడా ముఖ్య అతిథిగా స్వాగతం ఇస్తున్నారు. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని పాటిస్లూ పూజ రెమ్యునరేషన్‌ను కూడా భారీగా డిమాండ్ చేస్తుందట. ఇప్పుడు ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల మధ్యలో అడుగుతుందని, ఇక మూవీ ఈవెంట్స్‌కు లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్లు సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సమంత: పెళ్లైన తర్వాత కూడా సమంతతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. విడాకుల తర్వాత వరస సినిమాలకు సైన్ చేస్తుంది. ఈ మధ్యే యశోద సినిమాకు 3 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అనుష్క శెట్టి: అరుంధతి మూవీ రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న స్వీటీ.. ప్రస్తుతం రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. ఇటిటీవల కమిటైన యూవీ క్రియేషన్స్ సినిమాకు కూడా భారీగానే తీసుకుంటున్నట్లు సమాచారం. రష్మిక మందన్న: ఒక్కో సినిమాకు ఇప్పుడు 2.25 కోట్ల నుంచి రూ. 3 కోట్లవరకు తీసుకుంటుంది రష్మిక. హిందీలో అయితే అంతకంటే ఎక్కువగానే అందుకుంటుందని అంచనా. కీర్తి సురేశ్: సినిమాల విజయాలు, వైఫల్యాలతో సంబంధం లేకుండ కీర్తి ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందట. సాయి పల్లవి: సైలెంట్‌గా సంచలనాలు సృష్టించడంలో సాయి పల్లవి తర్వాతే ఎవరైనా. ఈ ముద్దుగుమ్మ కూడా ఒక్కో సినిమాకు సుమారు రూ. 1.50 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు అందుకుంటుంది. కాజల్ అగర్వాల్: ఎంతమంది కొత్తవాళ్లు వచ్చిన కాజల్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి కాజల్ రూ. 3 కోట్ల నుంచి రూ. 2 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటుంది. తమన్నా: ఒకప్పుడు కోట్లలో పారితోషికం తీసుకునే తమన్నా.. కాస్తా తన క్రేజ్ తగ్గడంతో రూ. కోటి నుంచి కోటిన్నరకుపైగా డిమాండ్ చేస్తుందట. స్పెషల్ సాంగ్ అరకోటి నుంచి కోటి వరకు అందుకుంటుంది. టీవీ షోలకు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్ చేస్తూ ముందుకు సాగుతోంది ఈ మిల్కీ బ్యూటీ. రాశీ ఖన్నా: జై లవకుశ వంటి సినిమాలలో నటించిన తర్వాత కూడా రాశీ ఖన్నా రేంజ్ పెరగలేదు. దీంతో ఇప్పుడు సినిమాకు రూ. 60 లక్షల వరకు తీసుకుంటున్నట్లు అంచనా. రకుల్ ప్రీత్ సింగ్: మొన్నటి వరకు కోటికి తగ్గని రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు సినిమాకు 70 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఏ హీరోయిన్ పారితోషికం ఎంత?
పాటల్లేని సినిమాలు చూడగలం.. ఫైట్లు లేని సినిమాలూ పసందుగానే ఉంటాయి. మాటల్లేని సినిమాలు కూడా మనసును దోచేస్తాయి. కానీ, మగువ లేని సినిమాను చూడగలమా? ప్చ్... సినిమాకో కళ రావాలంటే కథానాయిక ఉండాల్సిందే. లేకపోతే వెండితెర వెలవెలబోతుంది. రెండున్నర గంటల సినిమాలో కథానాయిక కనిపించేది కాసేపే అయినా... ఆ కొద్దిసేపు మెరుపులు ప్రేక్షకుల మనసును ఆనందపరుస్తాయి. అది గ్రహించే క్రేజీ తారలు భారీ ఎత్తున పారితోషికం డిమాండ్ చేస్తుంటారు. ఎంత పాపులార్టీ ఉంటే అంత ‘క్యాష్’ దండుకోవచ్చన్నమాట. అలా, ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలుతున్న ఓ పదిమంది చక్కనమ్మల చుక్కలనంటే పారితోషికం కబుర్లు... ఇవాళ్టి ‘బాలీవుడ్’ స్పెషల్... దడదడలాడిస్తున్న దీపికా..! ఈ దక్షిణాది భామ కథానాయికగా రంగప్రవేశం చేసింది ముందు కన్నడ రంగంలోనే! ‘ఐశ్వర్య’ అనే చిత్రం ద్వారా ఆమె తొలిసారి వెండితెరపై మెరిశారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో ‘ఓం శాంతి ఓం’లో అవకాశం వచ్చింది. హిందీ సినీ మార్కెట్ పెద్దది కావడం, ఏకంగా షారుక్ ఖాన్ సరసన నటించే అవకాశం రావడంతో దీపిక కూడా చటుక్కున గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ చిత్రం బంపర్ హిట్ కావడంతో బాలీవుడ్ అగ్ర దర్శక-నిర్మాతల దృష్టి ఈ సొట్టబుగ్గల సుందరిపై పడింది. అంతే... అవకాశాల మీద అవకాశాలు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. జయాపజయాల మిశ్రమంగా కెరీర్ సాగుతున్న నేపథ్యంలో గత ఏడాది దీపిక కెరీర్ మంచి మలుపు తీసుకుంది. రేస్ 2, ఏ జవానీ హై దివానీ, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, గోలియోంకీ రాస్లీల-రామ్‌లీల... ఇలా 2013లో నాలుగు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు దీపిక. ఆ విజయాలు దీపిక క్రేజ్‌ను అమాంతం పెంచేశాయ్. దీపిక కూడా తన పారితోషికాన్ని పెంచేశారు. ఇప్పుడామె డిమాండ్ చేస్తున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా 8 నుంచి 9 కోట్ల రూపాయలు. కల్యాణమైనా కరీనా క్రేజ్ తగ్గలేదు! థర్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న తారలకూ, పెళ్లయిన తారలకూ క్రేజ్ తగ్గుతుందా? తగ్గుతుందనే కొంతమంది భావిస్తారు. కానీ, కరీనా కపూర్ లాంటి కొంతమంది తారలు అది అబద్ధం అని నిరూపిస్తారు. సైఫ్ అలీఖాన్‌తో కరీనా పెళ్లయ్యి, ఈ అక్టోబర్‌కి రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో కరీనాకు సినిమాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. దానికి కారణం ఆమె మంచి నటి కావడమే. జయాపజయాలకు అతీతంగా కరీనా కెరీర్ సాగుతోంది. ‘జబ్ వియ్ మెట్’తో కరీనా కెరీర్ మంచి మలుపు తీసుకుంటే, ‘3 ఇడియట్స్, గోల్మాల్ 3, బాడీగార్డ్’ ఆమె పారితోషికం పెరగడానికి కారణంగా నిలిచిన చిత్రాలు. ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న పారితోషికం 8 నుంచి 8.5 కోట్ల రూపాయలు. ఫుల్ ఫామ్‌లో ప్రియాంక! మాజీ ప్రపంచ సుందరి ప్రియాంకా చోప్రా.. కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు.. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల్లో కూడా బ్రహ్మాండంగా ఒదిగిపోతారు. ‘ఫ్యాషన్’ చిత్రంలో ఎంత గ్లామరస్‌గా కనిపించారో... ‘బర్ఫీ’ చిత్రంలో మానసిక వికలాంగురాలి పాత్రలో అంత డీ-గ్లామరస్‌గా కనిపించారు. ఇక, ‘మేరీ కోమ్’ చిత్రంలో బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్లా ఒదిగిపోవడానికి ఆమె చేసిన కసరత్తులను ప్రేక్షకులు కొనియాడారు. అసలు సిసలైన క్రీడాకారిణిగా అగుపించడానికి సౌకుమార్యాన్ని కోల్పోయి.. కండలు పెంచారామె. ఆ తర్వాత తదుపరి చిత్రం ‘దిల్ ధడక్నే దో’ కోసం పాత శరీరాకృతి తెచ్చుకున్నారు. ఇంతగా కష్టపడతారు కాబట్టే, ప్రియాంక కెరీర్ ఇంత వైభవంగా సాగుతోంది. ఇంత మంచి ఫామ్‌లో ఉన్నారు కాబట్టే, దాదాపు 7 నుంచి 8 కోట్లు పారితోషికం పుచ్చుకోవడానికి ప్రియాంక వెనకాడటం లేదు. క్రేజీ కైఫ్! ‘ఇక ఎప్పటికీ గ్లామర్ డాల్ మాత్రమే... కత్రినా కైఫ్‌లో మంచి నటి లేదు’ అని కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో ఈ బ్యూటీకి పలు విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శలు తట్టుకుని నిలబడి, ‘కత్రినాలో మంచి నటి ఉంది’ అని అందరితో అనిపించుకోగలిగారామె. ‘అజబ్ ప్రేమ్‌కీ గజబ్ కహానీ’, ‘రాజ్‌నీతి’, ‘జిందగీ న మిలేగీ దొబారా’, ‘అగ్నిపథ్’ వంటి చిత్రాల్లో కత్రినా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే, ‘షీలా కీ జవానీ..’ పాట కత్రినాలో మంచి డాన్సింగ్ స్టార్ ఉందని నిరూపించింది. వీటికి తోడు యూత్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉండటంతో ఈ విదేశీ భామ బాలీవుడ్లో బాగానే స్థిరపడగలిగారు. అందుకు తగ్గట్లే తన క్రేజ్‌ను క్యాష్ చేసుకునే దిశలో కత్రినా 6 నుంచి 6.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఐష్... భేష్..! ప్రపంచ సుందరి అనే కిరీటం ఐశ్వర్యారాయ్ కీర్తి, ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ పాపులారిటీని అప్పనంగా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఐశ్వర్యారాయ్‌కి రెడ్ కార్పెట్ వేసి మరీ సినిమాల్లోకి ఆహ్వానించారు. కెరీర్ ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా ఆ తర్వాత ‘హమ్ దిల్ దే చుకే సనమ్, తాళ్, దేవ్‌దాస్, ధూమ్ 2, జోధా అక్బర్’ వంటి చిత్రాలు ఆమెలోని నటిని నిరూపించడంతో పాటు కెరీర్‌ను సక్సెస్ బాటలో నడిపించాయి. అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్నాక కూడా ఐష్ బిజీ బిజీగానే సినిమాలు చేశారు. తల్లయ్యాక మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఐష్ వెండితెరపై కనిపించి, మూడేళ్లవుతోంది. అభిమానులు ఆమె రీ-ఎంట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐష్‌కి కూడా సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం ‘జాజ్బా’ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. వచ్చే జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమవుతుంది. ఇంతకీ, ఐష్ డిమాండ్ చేస్తున్న పారితోషికం ఆరు కోట్ల రూపాయలట. ప్రపంచ సుందరికి అంత తక్కువా అనుకోవద్దు. ఐష్ వయసు 41. ఆ వయసులో ఉన్న తార ఇంత తీసుకోవడం... చిన్న విషయమా ఏమిటీ! యువనాయికల పారితోషికం కోటి పైనే! ఇంకా బాలీవుడ్‌ని ఏలుతున్న సీనియర్ తారల్లో విద్యాబాలన్ 3 కోట్ల వరకు తీసుకుంటుండగా, బిపాసా బసు 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. యువ కథానాయికల్లో సోనాక్షీ సిన్హా 3 నుంచి 4 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారనీ, అనుష్క శర్మ, సోనమ్ కపూర్లు 2 కోట్ల వరకూ తీసుకుంటున్నారనీ సమాచారం. క్రేజీ యువ తారలు ఆలియా భట్, పరిణితీ చోప్రాల పారితోషికం కూడా 2 కోట్ల వరకూ ఉందట! మొత్తానికి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సంగతి బాలీవుడ్ కథానాయకులు బాగానే పాటిస్తున్నట్లున్నారు కదూ! డి.జి. భవాని