breaking news
heard
-
ఫేస్ బుక్ లో ఆకట్టుకున్న ఘటన!
చాలామందికి నిద్రపోయే ముందు ఓ చిన్నపాటి భయం కలుగుతుంది. నిద్రించే సమయంలో ఇంట్లో ఏం జరుగుతుందోనని, ఉదయం నిద్ర లేచే వరకూ ఎలా ఉంటామోనని భయపడుతుంటారు. కొందరు ఎటువంటి భయం కలగకుండా, మంచి నిద్ర పట్టడంతోపాటు, శుభోదయం కావాలని కోరుతూ దేవుణ్ణి ప్రార్థిస్తారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయికి నిజంగానే నిద్రలో ఓ భయంకర అనుభవం ఎదురైందట. మంచి నిద్రలో ఉండగా వినిపించిన శబ్దానికి కళ్ళు తెరచి చూడగా జీవితంలో మరచిపోలేని దృశ్యం కనిపించిందట. దాంతో ఆమె తన అనుభవాలతో కూడిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ కు చెందిన ట్రినా హిబ్బర్డ్.. భయంకర శబ్దం విని, నిద్రలో ఉలిక్కిపడి లేచిందట. తాను ఊహించినట్లుగానే తనకు సమీపంలో ఓ 66 పౌండ్ల బరువు, 16 అడుగుల పొడవు ఉన్న పైథాన్ కనిపించడంతో పై ప్రాణాలు పైకే పోయాయట. ఆ కొండచిలువ తన మంచంమీదినుంచీ టోపీలు పెట్టుకునే షల్ఫ్ మీదుగా ఏకంగా గోడలకు తగిలించిన ఫోటో ఫ్రేములను చుట్టుకుంటూ, ఇంటి పై కప్పుకు చేరిందట. నాలుగేళ్ళక్రితం 2012 లో కూడ ఆమె ఈ పైథాన్ ను చూసిందట. ఇదంతా చూస్తే ఇదేదో దాని స్వంత ప్రాపర్టీలాగా ఉందని, ఇంతకు ముందు కూడా నీటికోసం పూల్ లోకి దిగుతుండగా ఆ పైథాన్ ను చూశానని ఆమె తన ఫేస్ బుక్ కామెంట్ లో రాసింది. అయితే అప్పట్లో దూరంగా చూసి పెద్దగా పట్టించుకోని ట్రినా.. ఇటీవలి ఘటన తర్వాత మాత్రం మరోసారి దానికి ఛాన్స్ ఇవ్వకోడదనుకుంది. అందుకే పాములు పట్టే మాంటీ అనే వ్యక్తిని పిలిచి పట్టించేసిందట. -
పఠాన్కోట్ లో మళ్ళీ పేలుడు కలకలం
పంజాబ్: పఠాన్కోట్ భారత వైమానిక స్థావరం బయట మంగళవారం మరోసారి భారీ పేలుడు శబ్దం వినిపించింది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూండగానే మళ్లీ పెద్ద ఎత్తున పేలుడు వినిపించడం కలకలం రేపింది. దీంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగివున్నారనే దానిపై మరింత ఆందోళన నెలకొంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు అసలు భారత సైనిక దుస్తుల్లో పఠాన్-కోట్ ఎయిర్-బేస్ వరకు ఎలా రాగలిగారు? లోపలి మ్యాప్ మొత్తం వాళ్ల వద్దకు ఎలా వచ్చింది? లోపల ఉన్నవారే ఎవరైనా ఉగ్రవాదులకు ఉప్పందించారా లాంటి అంశాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ భారీ ఎత్తున పేలుడు శబ్దం రావడంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగి వున్నరానే దానిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. గత మూడు రోజులుగా కూంబింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.