breaking news
Health examinations
-
జోరుగా ఇంటింటి సర్వే
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ద్వారా పౌరులకు ఆరోగ్య పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే 28.87 లక్షల మంది పౌరులకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ఆ ఇంట్లో వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రారంభించారు. కేవలం నాలుగు రోజుల్లోనే అంటే ఈ నెల 19వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 37,81,418 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఇందులో గ్రామాల్లో 18.28 లక్షల ఇళ్లు, పట్టణాల్లో 19.28 లక్షల ఇళ్లలో సర్వేను పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే, ఆరోగ్య పరీక్షల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. సర్వేను రోజు వారీగా పర్యవేక్షించడం ద్వారా మొత్తం కుటుంబాల్లో సర్వే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పౌరులకు ఆరోగ్య పరీక్షల తీరును రోజువారీ పర్యవేక్షించాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్న నేపథ్యంలో స్పెషలిస్ట్ డాక్టర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎస్ దిశా నిర్దేశం చేసిన అంశాలు ఇలా ఉన్నాయి. ఏర్పాట్లు బాగుండాలి ♦ ఆరోగ్య శిబిరాల వద్ద ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా అనే విషయాలను నిర్దారించుకోవడానికి ఈ నెల 25న మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఇంటింటి సర్వేపై వలంటీర్లు ఈ నెల 27వ తేదీన రెండవసారి సందర్శించేలా చర్యలు తీసుకోవాలి. ♦ ఇంటింటి సర్వే నాణ్యతతో నిర్వహించడంపై పర్యవేక్షణకు తగిన సిబ్బందిని నియమించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో పీహెచ్సీ పరిధిలో నలుగురు పర్యవేక్షణ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. మూడు, నాలుగు విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు ఒక్కో పర్యవేక్షకున్ని, పట్టణ పరిధిలో నాలుగైదు పీహెచ్‌సీలకు ఒక పర్యవేక్షకుడిని నియమించాలి. ఇందుకోసం మల్టీపర్పస్ హెల్త్ సూపర్ వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ అసిస్టెంట్లను వినియోగించుకోవాలి. ♦ఈ నెల 30న ఆరోగ్య శిబిరాల్లో అవసరమైన చికిత్సలు, మందులు అందించేందుకు అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలి. ఆరోగ్య శిబిరాల్లో 162 రకాల మందులు, 18 శస్త్రచికిత్స వినియోగ వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్స్ అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య శిబిరాలకు పీహెచ్‌సీలోని ఇద్దరు డాక్టర్లు, ఫ్యామిలీ డాక్టర్, ఇతర సిబ్బందితో పాటు స్పెషలిస్ట్ డాక్టర్లు హాజరు కానున్నారు. -
కొద్దిసేపు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారాలను భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(57)కు శుక్రవారం కొద్దిసేపు బదిలీ చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వడమే ఇందుకు కారణం. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా బైడెన్ రికార్డుకెక్కారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 79వ పడిలోకి ప్రవేశించారు. వాషింగ్టన్ శివారులోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో చేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు స్పృహలో లేనిపక్షంలో ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. బైడెన్‌కు శుక్రవారం మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆయన కొంతసేపు స్పృహలో లేరు. ఈ సమయంలో కమలా హ్యారిస్ వైట్‌హౌస్ వెస్ట్‌వింగ్‌లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు. అణ్వాయుధాల నియంత్రిత వ్యవస్థలతో కూడిన బాక్సు కూడా ఆమె సొంతమైనట్లు తెలుస్తోంది. పరీక్షల అనంతరం బైడెన్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాలన్నీ మళ్లీ ఆయనకే సంక్రమించాయి. 2002, 2007లో అప్పటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఇలాగే కలనోస్కోపీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు సందర్భాల్లో తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షుడు డిక్ చెనీకి బదిలీ చేశారు. -
ఏటా సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలోని 3.60 కోట్ల జనాభాకు ఏటా సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వమే నిర్వహించే దిశగా ముఖ్యమంత్రి యోచిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లమద్ది గ్రామంలో బుధవారం ఆయన రైతుబీమా బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తాము చేసిన అభివృద్ధి విపక్ష పార్టీల నేతలకు కనబడటం లేదని, అందుకే వారు సైతం కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. రైతులకు భవిష్యత్తుపై నమ్మకం, జీవితానికి ధీమా కల్పించడానికే రైతుబీమా పథకం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. పైసలిచ్చినా పనులెందుకు కావట్లేదని స్థానిక ప్రజాప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని, పనిచేయడం స్థానిక నాయకుల బాధ్యతని చెప్పారు. మొదటిసారిగా తెర్లమద్ది నుంచే తాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. -
కామెర్లకు పసరు మందు వాడకండి!
కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 56 ఏళ్లు. ఇటీవల అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించాం. ఎలాంటి సమస్యలూ లేవు అని డాక్టర్ చెప్పారు. వారం క్రితం నిద్రలో ఉన్నప్పుడు తనకు ఆయాసం వచ్చిందని నాన్న చెబుతున్నారు. ఇదేమైనా గుండెపోటుకు దారితీస్తుందా? - వజీర్ అహ్మద్, గుంటూరు సాధారణంగా స్థూలకాయుల్లోనూ, శారీరక శ్రమ లేనివారిలోనూ, ఆస్తమా ఉన్నా, రక్తహీనత ఉన్నా ఆయాసం వస్తుంది. మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ నాన్నగారికి శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆయాసం కనిపిస్తుంది తప్ప అది గుండెజబ్బుకు సూచన కాకపోవచ్చు. ఇక గుండెకు రక్తసరఫరా తగ్గడం, గుండె కవాటాల్లో జబ్బు కారణంగా కొందరికి ఆయాసం వస్తుంది. శ్వాస సమస్యలన్నింటినీ గుండెజబ్బుగా అనుమానించకూడదు. ఆయాసంతో పాటు గుండె బరువుగా ఉండటం, చెమటలు పట్టడం, ఛాతీలో మంట, నడవలేకపోవడం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు నొప్పి ఎక్కువ కావడం, పనిచేయడం ఆపగానే నొప్పి తీవ్రత తగ్గడం, ఛాతీలో మొదలైన నొప్పి రెండు చేతులు, దవడలకు లేదా వెన్ను భాగానికి పాకడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలిదశలోనే గుర్తిస్తే కొద్దిపాటి మందులు, జాగ్రత్తలతోనే గుండెజబ్బును అరికట్టవచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలు కనిపించగానే సత్వరం చేయాల్సినవి... తొలిగంట అమూల్యం కాబట్టి కుటుంబ సభ్యులు అతి త్వరగా ఆసుపత్రికి తరలించాలి. ఈజీటీ, టూ డి ఎకో వంటి పరీక్షలు చేయించాల్సి, తర్వాత జబ్బు ఉన్నట్లు తేలితే దాని తీవ్రతను బట్టి చికిత్సలు చేయించాల్సిన అసవరం ఉంది. ఒకవేళ జబ్బు తీవ్రత తక్కువగా ఉంటే (అంటే గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో 50 శాతం కంటే తక్కువ బ్లాక్స్ ఉంటే) అవసరాన్ని బట్టి స్టాటిన్స్ వంటి మందుల ద్వారా సమస్య జటిలం కాకుండా నివారించవచ్చు. ఈ అడ్డంకులు (బ్లాక్స్) 50 నుంచి 70 శాతం మాత్రమే ఉంటే బార్డర్‌లైన్ ఉన్నాయని అర్థం. ఒకవేళ 90 శాతం కంటే ఎక్కువ బ్లాక్స్ ఉంటే తప్పనిసరిగా స్టెంట్స్ వేయాల్సి ఉంటుంది. చికిత్సతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటూ వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ, పొగతాగడం వంటి దురలవాట్లు మానేస్తే మంచిది. దీంతో పాటు హైబీపీ, షుగర్ వ్యాధులు ఉంటే వాటిని నియంత్రించుకోవాలి. డాక్టర్ ఎన్. కృష్ణారెడ్డి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజీ, కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్ కౌన్సెలింగ్ నేను తరచు జ్వరంతో బాధపడుతున్నాను. కడుపుపై భాగంలో కొద్దిపాటి నొప్పి కూడా ఉంటోంది. ఇటీవల కామెర్లు వస్తే పసరు మందు తీసుకున్నాను. అయినా తరచు కడుపునొప్పితో పాటు జ్వరం వస్తూనే ఉంది. మా డాక్టర్ గారిని అడిగితే తగ్గే వరకూ పసరు తీసుకొమ్మని అంటున్నారు. - యాదగిరి రెడ్డి, నల్లగొండ మీ లక్షణాలను బట్టి మీరు హెపటైటిస్-సి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పసరుమందు వాడకండి. మీ ఇన్ఫెక్షన్ పసరుతో తగ్గదు. హెపటైటిస్-సి వైరస్ కారణంగా ఈ కాలేయ వ్యాధి వస్తుంటుంది. వైరస్ సోకిన రక్తమార్పిడి లేదా ఇంజెక్షన్ సూదుల వల్ల, వ్యాధి సోకిన గర్భవతుల్లో తల్లి నుంచి బిడ్డకు, దంపతుల్లో ఒకరికి ఉంటే మరొకరికి ఇది సోకడం మామూలే. నిర్ధారణ: ఈ వ్యాధి నిర్ధారణ కోసం మొదట హెపటైటిస్-సి యాంటీబాడీ టెస్ట్ అనే రక్తపరీక్ష చేస్తారు. ఆ తర్వాత వ్యాధి తీవ్రత (వైరల్ లోడ్) తెలుసుకునేందుకు హెచ్‌సీవీ ఆర్ఎన్ఏ పరీక్ష చేస్తారు. వీటితో పాటు జీనోటైప్ పరీక్షల వల్ల రోగికి చికిత్స అందించాల్సిన వ్యవధి, దానికి రోగి ప్రతిస్పందించే తీరుతెన్నులు తెలుస్తాయి. ఇందులోనే కొన్ని ‘జీనోటైప్స్’కు చెందిన వ్యాధుల్లో కాలేయం నుంచి ముక్క తీసి పరీక్షించాల్సి ఉంటుంది. వ్యాధి మరింత ముదరకుండా ఉన్నవారికి చికిత్స బాగానే పనిచేస్తుంది. ఒకవేళ వ్యాధి బాగా ముదిరితే కనిపించే దుష్ర్పభావాలు... అంటే రక్తస్రావం, పొట్టలో నీరు చేరడం (అసైటిస్), వ్యాధి మెదడుకు చేరడం వంటివి కనిపిస్తే మాత్రం అది కాలేయ క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ వ్యాధి సోకిన వారు ఎంత త్వరగా పరీక్షలు చేయించుకొని, దానికి అనుగుణం చికిత్స చేయించుకుంటే అంత మంచిది. డాక్టర్ పి.బాలచంద్ర మీనన్ సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28. నాకు రుతుక్రమం సరిగా రావట్లేదని డాక్టర్ని సంప్రదిస్తే, వారు స్కాన్ తీయించి, పీసీఓడీగా నిర్ధారించారు. వివాహమై ఐదేళ్లు గడిచినా ఈ సమస్య వల్ల సంతానం కలగడం లేదు. ఎన్నో హాస్పిటళ్ల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించడం లేదు. నా ఈ సమస్యకి హోమియో చికిత్స ద్వారా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - డి. బాలమణి, రాజమండ్రి మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, అధిక మానసిక ఒత్తిడి వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. అందులో ఒకటైన పీసీఓడీ సమస్య ఒకటి. ఇది వివాహిత మహిళలలో సంతానలేమికి దారితీస్తుంది. ఇమెచ్యూర్ ఫాలికిల్ (అపరిపక్వమైన అండం) గర్భాశయానికి ఇరువైపులా ఉన్న అండాశయాలపై నీటి బుడగల వలె ఉండటాన్ని పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటారు. సాధారణ రుతుచక్రం ఉన్న మహిళలలో నెలసరి అయిన 11-14 రోజుల మధ్యలో రెండు అండాశయాలలో ఒక అండాశయం నుంచి అండం విడుదలై ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కానీ ఈ పీసీఓడీ సమస్య ఉన్న మహిళలలో అండం విడుదల కాకుండా అపరిపక్వత చెంది అండాశయపు గోడలపై నీటిబుడగల వలె ఉండిపోతాయి. ఇలా రెండు ఆండాశయాలపై కనిపిస్తే దీనిని ైబె లేటరల్ పీసీఓడీ అంటారు. కారణాలు: ఎఫ్.ఎస్.హెచ్, ఈస్ట్రోజన్, టెసోస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహారపు నియమాలు పాటించకపోవడం, పిండి, కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వంశపారంపర్యత వంటి అంశాలు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు: నెలసరి రాకపోవడం, నెలసరి సరిగా వచ్చినా, అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం, నెలసరిలో 4-5 రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువరోజుల పాటు కొనసాగడం, నెలసరి ఆగి ఆడి రావడం, రెండు రుతుచక్రాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, బరువు పెరగడం, కొంతమందిలో బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి కూడా గమనించవచ్చు. జుట్టు రాలడం, ముఖం, వీపుపై మొటిమలు రావడం, మెడచుట్టూ, మోచేతి భాగాలలో చర్మం మందంగా, నల్లగా మారడం, ముఖంపైన, ఛాతీపైన మగవారి మాదిరిగా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు గమనించవచ్చు. దుష్ఫలితాలు: ఇన్ఫెర్టిలిటీ, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిస్. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో సంతానలేమికి అందించే కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా రోగి మానసిక మరియు శారీరక తత్వాన్ని బట్టి హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేసి ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా సంతానలేమి, ఇతర కాంప్లికేషన్లు ఉన్నా వాటిని తప్పక తగ్గించవచ్చు. మీరు వెంటనే హోమియోవైద్యనిపుణులను సంప్రదించగలరు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్