breaking news
Hang Seng Index
-
మిరే అసెట్ హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్
మిరే అసెట్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా రెండు ఫండ్స్‌ను ప్రకటించింది. ఒకటి హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ కాగా మరొకటి హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్). మొదటిదానిలో పెట్టుబడులకు నవంబర్ 29, రెండో దానికి డిసెంబర్ 1 ఆఖరు తేదీ. ఈటీఎఫ్‌కు సిద్ధార్థ శ్రీవాస్తవ, ఎఫ్వోఎఫ్కు ఏక్తా గాలా ఫండ్ మేనేజర్లుగా ఉంటారు. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. హాంకాంగ్ స్టాక్ ఎక్సే్చంజీలో లిస్టయిన 30 చైనా టాప్ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి. -
4 రోజుల లాభాలకు బ్రేక్
వరుస లాభాలకు బ్రేక్ పడింది. టెలికం షేర్లతోపాటు ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు నీరసించడంతో మార్కెట్లు నాలుగు రోజుల తరువాత మళ్లీ వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 42 పాయింట్లు నష్టపోయి 20,334 వద్ద ముగిసింది. తొలుత లాభాలతో మొదలైనప్పటికీ రోజు మొత్తం పలుమార్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. ఇక నిఫ్టీ కూడా 10 పాయింట్లు క్షీణించి 6,053 వద్ద నిలిచింది. ఎఫ్ఐఐల వెనకడుగు శుక్రవారం రూ. 267 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 455 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 295 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. స్పెక్ట్రమ్ వేలం ధర పెరుగుతున్న నేపథ్యంలో టెలికం షేర్లలో ఒత్తిడి కనిపించింది. ఐడియా 8.5% పతనంకాగా, ఆర్‌కామ్ 4%, భారతీ 3% చొప్పున క్షీణించాయి. ఇతర దిగ్గజాలలో టీసీఎస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ 2-1% మధ్య నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, మారుతీ, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ 2-1% మధ్య లాభపడ్డాయి. అమన్ రిసార్ట్స్ విక్రయ వార్తలతో డీఎల్ఎఫ్ 3% పుంజుకుంది.