breaking news
hamdard India
-
హనీ సంస్థ ప్రచారకర్తగా అదితిరావు హైదరీ
న్యూఢిల్లీ: హమ్దర్ద్ హనీ తన ప్రచాకర్తగా సినీ నటి అదితిరావు హైదరీని నియమించుకుంది. ఈ సందర్భంగా ‘ద నో కాంప్రమైజ్ హనీ’ పేరుతో ఒక టీవీ ప్రచార వీడియో విడుదల చేసింది. నాణ్యత, స్వచ్ఛతల మేలికలయిక హమ్దర్ద్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనుండటం సంతోషం కలిగిస్తోందని అదితిరావు అన్నారు. ఆరోగ్యకర జీవన శైలి కోరుకునే ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఈ తేనె భాగం కావాలన్నారు. అదితిరావుతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై హమ్దర్ద్ సీఈవో హమీద్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. -
ఈ ఏడాదిలో 10 హమ్దర్ద్ వెల్నెస్ సెంటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో యునానీకి సంబంధించి ఈ సంవత్సరం పది వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు హమ్దర్ద్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఆఫీసర్ మన్సూర్ అలీ వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో 4, పాట్నాలో ఒకటి ఉన్నట్లు చెప్పారాయన. గురువారం హైదరాబాద్‌లో మరో వెల్నెస్ సెంటర్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు సుమారు రూ. 40-50 లక్షల దాకా వెచ్చిస్తున్నట్లు మన్సూర్ చెప్పారు. లైఫ్ స్టయిల్ మార్పులు, ఇతరత్రా కారణాలతోనూ వచ్చే ఆరోగ్య సమస్యలకు అందుబాటు ధరలో యునానీ చికిత్స అందించే ఉద్దేశంతో ఈ వెల్నెస్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ టర్నోవరు రూ.600 కోట్ల పైనే ఉండగా.. ఎగుమతుల వాటా 4-5%గా ఉంటోందన్నారు. 3 తయారీ ప్లాంట్లు, 500 పైగా ఉత్పత్తులు ఉండగా.. ఆదాయాల్లో 20% వృద్ధి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రూహ్ అఫ్జా, సాఫీ, సింకారా వంటి ఉత్పత్తులను హమ్దర్ద్ విక్రయిస్తోంది.