breaking news
Halwa preparation program
-
హల్వాదే హవా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో రెండు వారాలుగా ఎటు చూసినా భారతీయతే ఉట్టిపడుతోంది. తన కుశాగ్రబుద్ధి, మానసిక స్థైర్యం, పైలట్ నైపుణ్యాలతో ఇప్పటికే యాగ్జియం–4 మిషన్‌లోని సహచరులను అబ్బురపరిచిన భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్కెపె్టన్ శుభాంశు శుక్లా తాజాగా భారతీయ రుచులతో వారితో పాటు ఐఎస్ఎస్లోని మిగతా సహచరుల మనసు కూడా దోచుకున్నారు! తనతో పాటు ఐఎస్ఎస్లోకి వెంట తీసుకెళ్లిన క్యారెట్ హల్వాను వారితో పంచుకున్నారు. రెండు వారాలుగా ఊపిరి సలపని పనులతో తలమునకలుగా ఉన్న వ్యోమగాములంతా శుక్రవారం ఆటవిడుపుగా, సరదా సరదాగా గడిపారు. చివరగా భోజనంలోకి నచ్చిన రుచులను తనివితీరా ఆస్వాదించారు. రొయ్యల వేపు డు స్టార్టర్‌తో మొ దలుపెట్టి చవులూరించే చికెన్ వంటకాల దాకా పలురకాలను ఆరగించా రు. చివర్లో శుభాంశు వడ్డించిన క్యారె ట్ హల్వా, పెసరప ప్పు హల్వా విందుకే హైలైట్‌గా నిలిచా యి. ఇంతటి రుచి ఇంతకు ముందెన్న డూ ఎరగమంటూ సహచరులంతా ఆయన్ను మెచ్చుకున్నారు. హల్వాను జీవితంలో మర్చిపోలేనని వ్యోమగామి జానీ కిమ్ చెప్పుకొచ్చారు. రుచిలో తేడా రాకుండా దీర్ఘకాలం పాటు నిల్వ ఉండేలా ఆ మిఠాయిలను ఇస్రో, డీఆర్డీవో శుభాంశు కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశాయి. శుభాంశును అలా కాపాడుకున్నాం: ఇస్రో చీఫ్ రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అంతరిక్షంలో అడుగుపెట్టిన, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి ప్రవేశించిన తొలి భారతీయునిగా శుభాంశు పేరు కొద్ది వారాలుగా దేశమంతటా మార్మోగిపోతోంది. యువతతో పాటు దేశంలోని బాల బాలికలంతా ఆయనను ఓ హీరోగా, తమ స్ఫూర్తిప్రదాతగా చూస్తున్నారు. ఇస్రో అప్రమత్తంగా వ్యవహరించబట్టి సరిపోయింది గానీ, లేదంటే ఇన్ని ఘనతలకు కారణమైన యాగ్జియం అంతరిక్ష యాత్ర ఆరంభమైన కాసేపటికే విషాదాంతమయ్యేదే! ఒళ్లు గగుర్పొడిచే ఈ వాస్తవాన్ని స్వయానా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ బయట పెట్టారు. జూన్ ప్రథమార్ధంలో యాత్ర పలుమార్లు వాయిదా పడటం తెలిసిందే. ఆ క్రమంలో జూన్ 11 నాటి ప్రయోగాన్ని ఒక్క రోజు ముందు ఇస్రో పట్టుబట్టి ఆపించింది. ‘‘ఫాల్కన్–9 రాకెట్ తాలూకు బూస్టర్‌లో లీకేజీలను, పలు పగుళ్లను ఇస్రో బృందం జూన్ 10 సాయంత్రం గమనించింది. అప్పటికప్పుడు చర్చించి ప్రయోగాన్ని ఆపాలని నా సారథ్యంలోని ఇస్రో బృందం నిర్ణయం తీసుకుంది. లేదంటే యాగ్జియం–4 ప్రయోగం విషాదాంతం అయ్యేదేమో! అలాకాకుండా చూడటం ద్వారా మన శుభాంశును, యాగ్జి యం మిషన్‌ను కాపాడుకున్నాం’’అని తాజా గా ఓ కార్యక్రమంలో ఇస్రో చీఫ్ వివరించారు. ‘‘మేం మరీ అతిగా స్పందిస్తున్నామని స్పేస్ ఎక్స్ బృందం తొలుత నిందించింది. అయినా మేం పట్టుబట్టి ప్రయోగాన్ని నిలిపేయించాం. ఫాల్కన్ రాకెట్లో పగుళ్లను మర్నాడు స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు ధ్రువీకరించారు’’అని తెలిపారు. నాసా, ఇస్రో సంయుక్త ప్రాజె క్టైన యాగ్జియం–4 జూన్ 26న విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లడం తెలిసిందే.కుటుంబంతో శుభాంశు మాటామంతి శుభాంశు శుక్రవారం లఖ్‌నవూలోని తన కుటుంబసభ్యులతో మాట్లాడారు. తను ప్రయోగాలన్నీ దిగి్వజయంగా పూర్తి చేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆయన తల్లిదండ్రులు ఆశా, శంభూదళాళ్ శుక్లా ఆకాంక్షించారు. ‘‘ఐఎస్ఎస్లో తను ఎక్కడ పని చేసే దీ, రోజంతా ఎలా గడిపేదీ శుభాంశు మాకు పూసగుచ్చినట్టు చూపించాడు. అంతరిక్షం నుంచి భూమిని చూసేందుకు రెండు కళ్లూ చాలవట! తన విధులను పూర్తిగా ఆస్వాది స్తుండటం మాకెంతో సంతోషాన్నిస్తోంది’’అని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బడ్జెట్ ‘హల్వా’ రెడీ..!
సాంప్రదాయ హల్వా తయారీ కార్యక్రమంతో బడ్జెట్ పత్రాల ముద్రణ షురూ న్యూఢిల్లీ: పార్లమెంటులో ఈ నెల 28న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టనున్న 2015-16 బడ్జెట్ పత్రాల ముద్రణా ప్రక్రియ ప్రారంభమైంది. సాంప్రదాయబద్దంగా ‘హల్వా’ తయారీ, రుచుల ఆస్వాదనతో ఇక్కడి నార్త్ బ్లాక్ కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సహా, ఆర్థిక మంత్రిత్వశాఖ సిబ్బంది మొత్తం ఈ సందర్భంగా హల్వా రుచిచూస్తూ సందడి సందడిగా గడిపారు. ఈ కార్యక్రమం అనంతరం బడ్జెట్ తయారీ, ప్రింటింగ్ ప్రక్రియతో ప్రత్యక్షంగా సంబంధమున్న అధికారులు, వారికి సహాయ సహకారాలు అందించే సిబ్బంది అంతా నార్త్‌బ్లాక్ కార్యాలయానికే పరిమితమైపోతారు. లోక్‌సభలో ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేంతవరకూ వారి కుటుంబాలతో సైతం వారు ఎటువంటి సంబంధాలనూ నెరపరు. ఫోనులోకానీ, ఈ-మెయిల్ లాంటి మరేదైనా కమ్యూనికేషన్ రూపంలో కానీ వారి ఆప్తులను సైతం సంప్రదించడానికి వీలుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే బాహ్య ప్రపంచంతో వారికి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. ఆర్థిక శాఖలో అత్యున్నత స్థాయిలో ఉండే చాలా కొద్దిమంది అధికారులకు మాత్రమే వారి ఇళ్లకు వెళ్లడానికి వీలుంటుంది. గురువారంనాడు నార్త్‌బ్లాక్‌లో హల్వా రుచి చూసిన వారిలో ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, ఆర్థిక కార్యదర్శి రాజీవ్ మహర్షి, రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత్ దాస్, జాయింట్ సెక్రటరీ (బడ్జెట్) రజిత్ భార్గవ తదితర సీనియర్ అధికారులు ఉన్నారు. రహస్యం.. అంతా రహస్యం! ⇒ ఎంతో పకడ్బందీగా తయారయ్యే ఈ బడ్జెట్ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్ తయారీ ప్రక్రియ చాలా రహస్యంగా ఉంటుంది. ⇒ ‘వీవీఐపీ’ స్థాయిలో భద్రత ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక రూపాల్లో అత్యాధునిక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ⇒ ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్ కింద ఉండే బడ్జెట్ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్ చేసేందుకు ప్రత్యేక ఎక్స్ఛేంజీని సైతం ఏర్పాటు చేస్తారు. ⇒ అంతేకాక మొబైల్ ఆపరేటర్ల సమన్వయంతో ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి కాల్‌ను ట్యాప్ చేస్తారు. ఆర్థికశాఖ కార్యాలయం, వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటుచేస్తారు. ⇒ ఇక ఈ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పెద్ద ఎక్స్‌రే స్కానర్‌ను ఏర్పాటుచేసి, దానిని కంప్యూటర్‌తో అనుసంధానిస్తారు. ఈ పరికరాల వల్ల ఏ చిన్న వస్తువు తీసుకువెళ్తున్నా ఇట్టే తెలిసిపోతుంది. ⇒ నార్త్‌బ్లాక్ అడుగుభాగంలో ఉండే ప్రత్యేకమైన ముద్రణాలయంలో బడ్జెట్‌ను ముద్రిస్తారు. అలాగే బడ్జెట్‌ను ముద్రించే సమయంలో ఆర్థికశాఖ కార్యదర్శి... ప్రధానితోను, ఆర్థిక మంత్రితోను సమన్వయం చేస్తూ సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ⇒ ముద్రణా పరిసరాల్లో అనునిత్యం ఐబీ అధికారులు, ఢిల్లీ పోలీసులు కునుకులేకుండా కాపలాకాస్తుంటారు. ⇒ మధ్య మధ్యలో సెక్యూరిటీని పరీక్షించేందుకు ‘మాక్ డ్రిల్’ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ డ్రిల్‌లో ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని గనుక సమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై తీవ్ర స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయి. ⇒ ఇక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు.