breaking news
gurukalam
-
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు
సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న 1791 మంది పార్ట్ టైమ్ టీచర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. టీచర్లతో పాటుగా వ్యాయామ ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలను కూడా పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఇటీలు, హెల్త్ సూపర్ వైజర్లు వేతనాలను పెంచాలంటూ ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నాగార్జున వివరించారు. గతంలో జూనియర్ లెక్చరర్ల (జేఎల్)వేతనం రూ.18 వేలు ఉండగా దీనిని రూ.24,150 లకు పెంచామని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (పీజీటీ) వేతనం రూ.16,100 ఉండగా దీన్ని కూడా రూ.24,150కు పెంచామని తెలిపారు. ట్రైన్డ్ గ్యాడ్యుయేట్ టీచర్ల( టీజీటీ) వేతనం రూ.14,800 ఉండగా దీన్ని రూ.19,350కు పెంచడం జరిగిందన్నారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయుల (పీఇటీ) వేతనం రూ.10,900 ఉండగా దీనిని రూ.16,350కు, హైల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్ ల వేతనం రూ.12,900 ఉండగా దానిని రూ.19,350లకు పెంచడం జరిగిందని నాగార్జున వివరించారు. ఈ పెంపుదలతో 1791 మంది పార్ట్ టైమ్ టీచర్లతో పాటుగా ఇతర సిబ్బందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసామన్నారు. 2019 తర్వాత పార్ట్ టైమ్ టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాలను పెంచడం ఇదే ప్రథమం అని మంత్రి చెప్పారు. కాగా తమ కష్టాలను గుర్తించి తమ వేతనాలను పెంచినందుకు గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగుల జేఏసీ నేతలు,టీచర్లు శుక్రవారం మంత్రి మేరుగు నాగార్జునను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగానే మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగానే జేఏసీ ఛైర్మెన్ నాగభూషణం మాట్లాడుతూ, తాము కోరిన వెంటనే బీజీ సమావేశంలో ఈ అంశాన్ని చేర్చి తమకు మంత్రి తమకు న్యాయం చేసారని చెప్పారు. బీసీ వెల్ఫేర్ టీచర్లతో సమానంగా పీజీటీలు, టీజీటీల వేతనాలను పెంచే విషయాన్ని కూడా పరిశీలించాలని మంత్రి నాగార్జునను కోరారు. -
విద్యార్థుల భవిష్యత్‌కు బాట
డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): గురుకుల విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటోంది. గురుకులాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి బలోపేతానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గతేడాది నుంచి టీఆర్ఈఐఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ (మహత్మా జ్యోతిబా పూలే) గురుకులాల్లోని ఐదో తరగతి సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో టీజీ గురుకుల్ సెట్ –2018 ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ విధానం ద్వారా ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుకు తుదిగడువు ఈనెల 16. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులు. రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థి ప్రతిభ, రిజిర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారు. అర్హులు వీరే.. - ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2018 సెప్టెంబర్ 1 నాటికి 9 నుంచి 11 సం వత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. - ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2018 సెప్టెంబర్ 1 నాటికి 9 నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి - దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లి, తండ్రి లేదా సంరక్షకుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. - 2017–18 విద్యా సంవత్సరంలో నిరవధికంగా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తగరతి చదువుతూ ఉండాలి. దరఖాస్తు చేసే విధానం.. - నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉన్న గురుకుల పాఠశాలల్లో సీట్ల కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు http:/ tgcet. cgg. gov. in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ప్రాథమిక వివరాలు (అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, ఏ జిల్లాకు చెందిన వారు, ఆధార్‌కార్డు నంబరు) నమోదు చేసి రూ.50లు నెట్ బ్యాంకింగ్/క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు ద్వారా చెల్లించాలి. - తర్వా త ఒక రిఫరెన్స్ ఐడీ నంబరు, దర ఖాస్తు ఫారం కనిపిస్తుంది. ఆ ఫారంలో పూర్తి వివరాలు నింపాలి. - ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు మార్చి 16. - దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి కుల, ఆదా య, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రా లు (ఒరిజినల్) పొంది ఉం డాలి. ప్రవేశ సమయానికి అభ్యర్థి ఒరిజినల్స్ కలిగి ఉండకపోతే ఎంపిక రద్దు చేస్తారు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశ విధానం - గురుకులాల్లో ప్రవేశం కల్పించేందుకు పాత ఉమ్మడి జిల్లా ఒక యూ నిట్‌గా విద్యార్థుల ఎంపిక విధానం ఉంటుంది. - విద్యార్థి ప్రతిభ, రిజర్వేషన్ ప్రాతిపదికన నల్లగొండ జిల్లా సర్వేల్లోని రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పాఠశాలలో ప్రవేశం పొందడానికి తెలంగాణలోని 31 జిల్లాల వారు అర్హులు. - ఆయా జిల్లాల్లోని మత్య్సకార కుటుంబాలకు చెందిన విద్యార్థులు కౌడిపల్లి (మెదక్ జిల్లా) పాఠశాలలో ప్రవేశానికి అర్హులు. - ఏప్రిల్ 8న గురుకుల సెట్ నిర్వహణ - ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లిషు, మెంటల్ ఎబిలిటి, పరిసరాల విజ్ఞానం లో నాలుగో తరగతి స్థాయిలో రెండు గంటల వ్యవధిలో 100 మార్కు లకు అబ్జెక్టివ్ టైపులో ఉంటుంది. - తెలుగు–20, ఇంగ్లిషు –25, గణితం– 25, మెంటల్ ఎబిలిటి–05, పరిసరాల విజ్ఞానం–25 మార్కులుంటాయి. - ఓఎంఆర్ షీట్లో జవాబు లు గుర్తించాల్సి ఉంటుంది. - పరీక్ష ప్రశ్నా పత్రము తెలుగు, ఇంగ్గిషు, ఉర్దూ మీడియంలో ఉంటుంది. గురుకులాల ప్రత్యేకతలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో ఉన్న 21 ( 7బాలురు, 14 బాలికలు) గురుకులాల్లో సమర్థులు, సుధీర్ఘ అనుభవం ఉన్న ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. విద్యార్థులపై 24 గంటల పర్యవేక్షణ. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు హౌజ్ మాస్టర్/ హౌజ్ పేరెంట్ వ్యవస్థ. ఐఐటీ, ఎంసెట్, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ. ఎంబీబీఎస్, సెంట్రల్ యూనివర్సిటీలు, నల్సార్, టిస్, ఇప్లూ, అజీమ్ ప్రేమ్‌జీ వంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ప్రవేశాలు కోసం శిక్షణ పాఠ్యాంశాలలో పాటు సహ పాఠ్యాంశాలు, క్రీడలు, శారీరక, మానసిక ఆరో గ్యం కోసం యోగా లో ప్రత్యేక శిక్షణ ఎర్న్ వైల్ లెర్న్ నానుడిని నిజం చేస్తూ పాఠ్యాంశాలను బోధిస్తూ వేతనం, పారితోషికం, ప్రోత్సాహకం అందిస్తారు. (సూపర్ స్టూడెంట్స్, గ్రీన్ గురుస్). ఉమ్మడి జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి 7 బాలుర గురుకుల పాఠశాలలు, 14 బాలికల గురుకుల పాఠశాలలుండగా, బాలుర గురుకులాల్లో 80 చొప్పున మొత్తం 560, బాలికల గురుకులాల్లో 80 చొప్పున 1120 సీట్లు భర్తీ చేస్తారు. ఒక్కో పాఠశాలల్లో 5వ తరగతి సీట్ల సంఖ్య 80. అలాగే మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి 6 బాలురు గురుకుల పాఠశాలలు, 4 బాలికల గురుకుల పాఠశాలలున్నాయి. క్రమశిక్షణతో కూడిన విద్య విద్యా ర్థులకు తొమ్మిదో తరగతి నుంచే సివిల్ సర్వీసెస్ ఫౌడేషన్ ద్వారా ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. ఇక్కడి శిక్షణతో అజీమ్ ప్రేమ్‌జీ, టీఐఐఎస్, ఇప్లూ, టాటా సోషల్ సైన్సెస్ యూనివర్సిటీ, ఐఐటీ, జేఈఈ, మాగ్నెట్ కళాశాలల్లో చేరేందుకు చక్కటి అవకాశం ఉంటుంది. – సి.సింధు, రీజనల్ కో ఆర్డినేటర్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ మంచి భవిష్యత్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తారు. గురుకులాల్లో ఇస్తున్న శిక్షణతో ఉన్నత విద్యాసంస్థల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. –గోపిచంద్రాథోడ్, ఎంజేపీటీబీసీ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కన్వీనర్ -
గురుకులంలో కీచకపర్వం
ఆత్మకూరు రూరల్ : తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని(14)తో రెండేళ్లుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. ఈ సంఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు,నానమ్మ, తాతయ్యలు సీపీఎం కార్యాలయంలో బుధవారం విలేకరులతో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. చిట్టమూరు మండలం మల్లాం గ్రామానికి చెందిన జువ్వలపాటి వెంకటకృష్ణయ్య కుమార్తె ఆత్మకూరు గురుకుల పాఠశాలలో నాలుగేళ్ల క్రితం ఆరో తరగతిలో చేరింది. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక ఆదివారం రాత్రి తండ్రికి ఫోన్ చేసింది. ప్రిన్సిపాల్ జి.మురళీధర్ రెండేళ్లుగా తనను వేధిస్తున్న విషయం ఏడుస్తూ తెలిపింది. సోమవారం తాను వస్తానని, భయపడవద్దని వెంకటకృష్ణయ్య ధైర్యం చెప్పాడు. ఈ నేపథ్యంలో గురుకులానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులు అర్ధరాత్రి ప్రాంతంలో కారులో మల్లాం గ్రామానికి చేరుకుని మీ కుమార్తె అన్నం తిననని మారాం చేస్తోందని, వచ్చి సముదాయించాలని చెప్పారు. దీంతో వెంకటకృష్ణయ్య తన భార్యతో కలిసి హుటాహుటిన అదే కారులో సోమవారం ఉదయానికి పాఠశాలకు చేరుకున్నారు. వారిని చూడగానే బాలిక కుమార్తె ఏడుస్తూ రెండేళ్లుగా పాఠశాల ప్రిన్సిపాల్ తనను అసభ్యకరంగా వేధిస్తున్నాడని, ఇపుడు మరీ మితిమీరి పోయాడని వివరించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన తల్లిదండ్రులు శాంతమ్మ, పోలేరయ్యలను పాఠశాలకు పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లేందుకు అందరూ ఉద్యుక్తులయ్యామని వెంకటకృష్ణయ్య తెలిపారు. ఇంతలో నలుగురు ఉపాధ్యాయులు వచ్చి జ్వరం కారణంగా సెలవు కావాలంటూ బాలికతో బలవంతంగా చీటీ రాయించుకుని, తమవెంట పంపారని పేర్కొన్నారు. రెండు రోజులు ఆత్మకూరులోనే ఉన్న తాము చివరకు సీపీఎం నాయకుల సహకారంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజకసంఘం అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య విలేకరులతో మాట్లాడుతూ బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలన్నారు. ప్రిన్సిపాల్ మురళీధర్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోని పక్షంలో తీవ్రస్థాయిలో పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ విషయమై ఆత్మకూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మురళీధర్ వివరణ కోసం ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.