breaking news
gurudwara site
-
ఆ గురుద్వారా అలాగే ఉండనివ్వండి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో ఉన్న గురుద్వారా స్థలం తమదేనని, దాన్ని తమకు అప్పగించాలని కోరుతూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్కడ చాలా ఏళ్లుగా గురుద్వారా ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉండనివ్వండి అని తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ స్థలం మీదేనని మీరు భావిస్తే ఆ అభిప్రాయం మానుకోండి అని సూచించింది. షాదారా గురుద్వారా స్థలం ‘మసీదు తకియా బబ్బర్ షా’కు చెందుతుందని పేర్కొంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు 2010 సెపె్టంబర్లో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆ స్థలంలో గురుద్వారా చాలా ఏళ్లుగా ఉందని మీరే చెబుతున్నారు కాబట్టి దాన్ని అలాగే కొనసాగనివ్వాలని పిటిషనర్‌కు స్పష్టంచేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలియజేసింది. ఆ స్థలంలో 1947 నుంచి గురుద్వారా ఉన్నట్లు ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా ఓ సాక్షి చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. -
సిక్కుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత
గురుద్వారా స్థలంపై ఆధిపత్యం కోసం రెండు సిక్కు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ అమృతసర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నాటు తుపాకులతో కాల్పులు జరుపుకోవడంతో ఓ బాలుడు సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమృతసర్ ప్రాంతంలో ఉన్న ఓ గురుద్వారా స్థలం మీద ఆధిపత్యం కోసం చాలా కాలంగా రెండు సిక్కు గ్రూపుల మధ్య వివాదం నడుస్తోంది. శుక్రవారం నాడు సిక్కులు సంప్రదాయబద్ధంగా జరుపుకొనే ఆయుధాల ప్రదర్శన సమయంలో ఘర్షణ మొదలైంది. తొలుత సంప్రదాయం ప్రకారమే రెండు వర్గాలకు చెందిన పలువురు సిక్కులు ప్రదర్శన ప్రారంభించారు. అంతలోనే గొడవ మొదలైంది. దాంతో రెండు వర్గాలవారు ఒకరిపై ఒకరు నాటు తుపాకులతో కాల్పులు జరుపుకొన్నారు. దీంతో ఒక బాలుడు సహా ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంలో రెండు సిక్కు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రస్తుతానికి ఉద్రిక్తత సడలింది.