breaking news
Green Mission
-
‘హరితహారం’ తరహాలో తమిళనాడులో ‘గ్రీన్‌మిషన్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హరితహారం తరహాలోనే తమిళనాడు గ్రీన్ మిషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 33% పచ్చదనం సాధించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర అదనపు ప్రభుత్వ కార్యదర్శి సుప్రియా సాహు తెలిపారు. ‘హరితహారం’కార్యక్రమం అధ్యయనానికి సుప్రియా సాహు నేతృత్వంలో తమిళనాడు అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఇందులోభాగంగా శనివారం అరణ్యభవన్‌లో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ ఎ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. హరితహారం అమలు, ఫలితాలపై పీసీసీఎఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హరితహారం కార్యక్రమాన్ని ఎనిమిదేళ్లుగా అమలు చేస్తూ తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని సాహు కొనియాడారు. నర్సరీల నిర్వహణతో పాటు, పచ్చదనం పెంచిన తీరు బాగుందని, అవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఔటర్ వెంట పచ్చదనం తీర్చిదిద్దిన విధానం బాగుందని అభినందించారు. పర్యటనలో సాహు తీసిన ఫోటోలు, వీడియోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సాçహు వెంట తమిళనాడు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ఆనంద్ ఉన్నారు. క్షేత్ర పర్యటనలో చీఫ్ కన్జర్వేటర్ (సోషల్ ఫారెస్ట్రీ) రామలింగం, రంగారెడ్డి, మేడ్చల్ డీఎఫ్ఓలు జాదవ్ రాహుల్ కిషన్, జానకి రాములు పాల్గొన్నారు. -
రోడ్లతో పాటు పర్యావరణమూ ముఖ్యమే!
గ్రీన్ మిషన్ సలహాదారు ఏకే భట్టాచార్య సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులు పెరగడంవల్ల ట్రాఫిక్‌తో పాటు కర్బన ఉద్గారాలు కూడా పెరుగుతాయని, వాటి ప్రభావాన్ని తగ్గించడమే ‘మిషన్ గ్రీన్ హైవేస్’ లక్ష్యం అని నేషనల్ హైవేస్ అథారిటీ (గ్రీన్ మిషన్) సలహాదారు ఏకే భట్టాచార్య పేర్కొన్నారు. నిర్మాణం పూర్తయిన రోడ్ల వెంట పెద్ద సంఖ్యలో చెట్లను పెంచటం ద్వారా ఈ సమ స్యను పరిష్కరించవచ్చన్నారు. అభివృద్ధి, రోడ్ల నిర్మాణం వల్ల వన్యప్రాణులకు నష్టం కలగకుండా చూడాలన్నారు. పచ్చదనం కోసం తీసుకుంటున్న చర్యల్లో కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. జాతీయ రహదారులు నిర్మించటం ఎంత ప్రధానమో, వాటి వెంట పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తూ పర్యావరణాన్ని రక్షించుకోవటం కూడా అంతే ముఖ్యమ న్నారు. రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపును వీలైనంత తగ్గించి, అవసరమైతే భారీ చెట్లను మరోచోట నాటే ట్రాన్స్ లోకేషన్ పద్ధతిని అనుసరించాలన్నారు. శనివారం అరణ్య భవన్లో పర్యావరణ హిత జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, కేంద్ర సహకారంపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, పచ్చదనం ఆవశ్యకత, రహదారులతో ముడిపడిన అభి వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన రాష్ట్ర అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భట్టాచార్య మాట్లాడుతూ, చెట్ల పెంపకానికి సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. వచ్చే ఎన్ని కల్లో పర్యావరణ పరిరక్షణ కూడా ఒక ప్రధాన అంశం కావాలంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వివిధ రహదారుల వెంట చెట్ల పెంపకం కోసం హైవేస్ అథారిటీ నిధులు విడుదల చేయాలని అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి పి.కె.ఝా, అదనపు ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎమ్.డోబ్రియల్, భట్టాచార్యను కోరారు. ఈ సమావేశంలో నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసర్ విజయ్ శ్రీ వాత్సవ్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారులు మనో రంజన్ భాంజా, మునీంద్ర పాల్గొన్నారు.