breaking news
grama jyothy programe
-
జిల్లాను ‘ఆదర్శజ్యోతి’గా నిలపాలి
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : గ్రామజ్యోతి పథకం అమలులో జిల్లాను రాష్ర్టంలోనే ఆదర్శంగా నిలుపుదామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం హన్మకొండలో టీఆర్ఎస్ శ్రేణులకు గ్రామజ్యోతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల సమగ్రాభివృద్ధికే టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని చేపట్టిందని, గంగదేవిపల్లిని స్ఫూర్తితో ముం దుకు సాగాలన్నారు. గ్రామసభలో ప్రాధాన్య త క్రమంలో ప్రణాళికలు రూపొందించాల న్నారు. అవకాశాలు రాలేదనే నిరుత్సాహం తో పార్టీ శ్రేణులు గ్రామజ్యోతికి దూరంగా ఉండొద్దని సూచించారు. మాజీ ఉప ముఖ్యమం త్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల విమర్శలు అర్థం లేనివన్నారు. పత్రికల్లో వచ్చిన ఆరోపణల ఆధారంగా, ప్రభుత్వం పారదర్శకంగా ఉంద ని చెప్పడానికే తనను మంత్రి వర్గం నుంచి తొలగించారన్నారు. అవినీతి జరిగిందని కాదన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రావణ మాసం పదవుల పందేరం మాసమన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి,ఎమ్మెల్యేలు దా స్యం వినయభాస్కర్, ఆరూరి రమేష్, శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యా నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, మొలుగూరి భిక్షపతి, సుధాకర్‌రావు, రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ శ్రేణుల అసమ్మతి హన్మకొండ: ఏడాదిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు తమ అసమ్మతిని వ్యక్తం చేశాయి. గ్రామజ్యోతి పథకంపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు శనివారం ఏర్పాటు చేసిన సదస్సు.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లేక బోసిపోయింది. ఈ సదస్సులో ఖాళీ కుర్చీలు కనపడడం, హాల్ బోసిపోయి ఉండటంతో ఉప ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసినపుడు నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేయవద్దని, ఎంతటి ప్రాధాన్యత పనులున్నా వదులుకొని పార్టీ సమావేశాలకు పాల్గొనాలని సూచించారు. టీఆర్ఎస్ శ్రేణులు మోటివేటర్లుగా పని చేయాల్సి ఉండగా సదస్సుకు హాజరు కాకపోవడటం మంచిది కాదని అన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ కార్యక్తలు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు ఈ దిశగా ఆలోచించాలన్నారు. ఎంతో ప్రాధాన్యతాంశంగా తీసుకొని ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరు కాలేదు. చల్లా ధర్మారెడ్డి గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి సమావేశంలో పాల్గొని ఆలస్యంగా వచ్చారు. -
గ్రామానికి సర్పంచే సీఎం
తాండూరు రూరల్ : ప్రతి గ్రామ సర్పంచ్‌కు ముఖ్యమంత్రి వలే అన్ని అధికారాలు ఉంటాయని వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆలుగు వర్షిణి అన్నారు. బుధవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలోని ఠాగూర్‌హాల్లో ఆయా గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మహిళ సంఘాల సభ్యులకు ‘గ్రామజ్యోతి’పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ‘మన ఊరు-మన ప్రణాళిక’ ఆధారంగాగే ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి నాలుగేళ్ల ప్రణాళిక రూపొంది స్తామన్నారు. రూ.కోటి నుంచి రూ.నాలుగు కోట్ల వరకు నిధులు మంజూరు చేసి అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి గ్రామస్తులతో కమిటీ వేస్తామన్నారు. గ్రామజ్యోతిలో గ్రామస్తులు అడిగిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామంలో ఉన్న అనాథలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. వివిధ శాఖల నుంచి గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయన్నారు. గ్రామాభివృద్ధి చెందాలంటే సర్పంచ్ కీలకమన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయురాలిలా.. తాండూరు మండలంలోనిప్రజాప్రతినిధులు, అధికారులకు సబ్‌కలెక్టర్ ఆలుగు వర్షిణి గ్రామజ్యోతి కార్యక్రమంపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అంశాలపై క్షుణ్ణంగా వివరించారు. తరగతి గదిలో విద్యార్థులకు బోధించే టీచర్లా వ్యవహరించారు. ప్రతి విషయం బోర్డుపై రాసి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, ఎంపీపీ లక్ష్మమ్మ, తహసీల్దార్ గోవింద్రావు, ఎంపీడీఓ జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
'అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి'
హైదరాబాద్: ప్రభుత్వ పథకాలను గ్రామాలతో అనుసంధానం చేసి ఫలితాలు రాబట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఆయన సూచించారు. ఆగస్టు 15న గ్రామజ్యోతి పథకాన్ని ఆయన ప్రకటించనున్నారు. ఆగస్టు 17 నుంచి 24 వరకు తెలంగాణ వ్యాప్తంగా గ్రామజ్యోతి వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో కేసీఆర్ పర్యటిస్తారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తేనే ఫలితాలు వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పంచాయతీలు పన్నులు వసూలు చేయడమే కాకుండా ఇతర ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని సూచించారు.