'అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి' | TS Govt to launch 'Grama Jyothi' for all-round development of Villages | Sakshi
Sakshi News home page

'అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి'

Jul 30 2015 8:17 PM | Updated on Aug 30 2019 8:24 PM

'అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి' - Sakshi

'అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి'

ప్రభుత్వ పథకాలను గ్రామాలతో అనుసంధానం చేసి ఫలితాలు రాబట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్: ప్రభుత్వ పథకాలను గ్రామాలతో అనుసంధానం చేసి ఫలితాలు రాబట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఆయన సూచించారు. ఆగస్టు 15న గ్రామజ్యోతి పథకాన్ని ఆయన ప్రకటించనున్నారు. ఆగస్టు 17 నుంచి 24 వరకు తెలంగాణ వ్యాప్తంగా గ్రామజ్యోతి వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో కేసీఆర్ పర్యటిస్తారు.

గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తేనే ఫలితాలు వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పంచాయతీలు పన్నులు వసూలు చేయడమే కాకుండా ఇతర ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement