breaking news
govt pension
-
దుబాయ్లో ఉన్నా పింఛను..!
గోపాలపురం : అర్హత ఉన్న వారు పింఛను అందుకోవాలంటే సవాలక్ష నిబంధనలు. వేలిముద్రలు మాసేవరకూ మిషన్పై నొక్కిస్తారు.. కాళ్లరిగేలా తిప్పిస్తారు.. నువ్వే ఆ మనిషివని గ్యారేంటి ఏంటంటూ ఆకార్డు ఈ కార్డులు చూపించమంటారు.. కానీ, ఒకామె దుబాయ్ వెళ్లిపోయి నాలుగు నెలలైనా ఆమెకు పింఛను ఆగలేదు. మనిషి ఇక్కడ లేకపోయినా ఆమె పేరిట మూడు నెలల పింఛను పంపిణీ చేసేశారు. ఎలా, అంటే.... మాత్రం తెల్లమొఖాలు. ఈ విచిత్ర ఘటన మండలంలోని వాదాలకుంట గ్రామంలో చోటు చేసుకుంది. మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2015-16కు సంబంధించి బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బహిరంగ విచారణ చేపట్టారు. ఈ విచారణలో పై విషయం వెలుగుచూసి అంతా అవాక్కయ్యారు. దీంతో ఆ పింఛను సొమ్ము రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇది ఇలా ఉండగా ఉపాధి నిధులు రూ.23, 237 దుర్వినియోగమైనట్టు ప్రిసైడింగ్ అధికారి అప్పారావు వెల్లడించారు. -
పింఛన్ రాలేదని వృద్ధురాలు మృతి
-
పింఛన్ రాలేదని వృద్ధురాలు మృతి
విజయవాడ: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. నగర కార్పొరేషన్ ఎదుట వృద్ధురాలు పిల్లా లక్ష్మీ గుండెపోటుతో మృతి చెందింది. ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న పెన్షన్ జాబితాలో తన పేరు లేదని అధికారులు చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. దాంతో ఇంటికి తిరిగి వెళ్తు కార్పొరేషన్ గేటు వద్ద కుప్పకూలి మరణించింది. దాంతో ఆమె మృతదేహంతో కార్పొరేషన్ ఎదుట పలు రాజకీయ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ క్రమంలో రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత రెండేళ్లుగా పిల్లా లక్ష్మీ పెన్షన్ తీసుకుంటుంది. అయితే పెన్షన్ ఇక రాదన్న విషయం తెలుసుకుని ఆమె తీవ్ర వేదనకు గురై మరణించింది.