breaking news
Govindan Lakshmanan
-
పతకం పోయినా... 10 లక్షలు వచ్చాయి
న్యూఢిల్లీ: ఏషియాడ్‌లో దురదృష్టం వెంటాడి కాంస్యం కోల్పోయిన భారత అథ్లెట్ గోవిందన్ లక్ష్మణన్‌ను నజరానా వరించింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్... అతడిని నగదు పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ 10 వేల మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచాడు. కానీ మరో అథ్లెట్ నెట్టడంతో అతని అడుగు అనూహ్యంగా ట్రాక్ లైన్‌ను దాటి బయటపడింది. దీంతో అనర్హతకు గురై పతకాన్ని కోల్పోయాడు. మరో అథ్లెట్ తగలడం వల్లే అతను లైన్ దాటాడని భారత్ చేసిన అప్పీల్‌ను నిర్వాహకులు తోసిపుచ్చారు. అయితే పరుగును పూర్తిచేసిన లక్ష్మణన్ కఠోర శ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నజరానాకు ఎంపిక చేసినట్లు రాథోడ్ తెలిపారు. -
‘ట్రాక్’తప్పాడు.. పతకం కోల్పోయాడు!
జకార్తా: ఏషియన్ గేమ్స్ వంటి మెగా టోర్నీల్లో పతకాలు సాధించడమనేది ప్రతీ అథ్లెట్ కల. ఇందుకోసం వారు సంవత్సరాలు పాటు చెమటోడ్చి మరీ సిద్దమవుతారు. ఇక్కడ తృటిలో పతకం చేజారిపోతేనే ఆయా అథ్లెట్ల బాధ అంతా ఇంతా కాదు.. మరి వచ్చిన పతకం చేజారిపోతే.. అది మాటల్లో చెప్పలేని మనోవ్యథగా మిగిలిపోతుంది. తాజా ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ ఇలానే పతకం చేజార్చుకున్నాడు. ఒక చిన్నపొరపాటుతో డిస్ క్వాలిఫై అయి పతకాన్ని కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... ఆదివారం జరిగిన పదివేల మీటర్ల రేసులో భారత స్ప్రింటర్ గోవిందన్ లక్ష్మణన్ ఫైనల్ రేసులో పాల్గొన్నాడు. అయితే ఆ రేసును అర గంటలోపే ముగించి మూడో స్థానంలో నిలిచాడు. ఇక్కడ తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన బెహ్రయిన్ స్ప్రింటర్ చాని హసన్‌తో రేసును పూర్తి చేసే సమయంతో పోల్చితే గోవిందన్ దాదాపు నిమిషం వెనుకబడ్డాడు. దాంతో స్వర్ణం పతకం సాధించే అవకాశాన్ని స్వల్ప తేడాలో కోల్పోయాడని భారత అభిమానులు భావించారు. కనీసం కాంస్య పతకం సాధించాడు కదా అని సరిపెట్టుకున్నారు. కాగా, ఆ పతకం కూడా పోయింది. రేసు పూర్తి చేసే క్రమంలో ‘ట్రాక్’ తప్పడంతో అతనికి వచ్చిన పతకం చేజారిపోయింది.