breaking news
Government reforms
-
సంస్కరణలు ఆదుకుంటాయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల అజెండా వాణిజ్య పరమైన అవాంతరాల కారణంగా ఏర్పడే ప్రతికూలతల నుంచి రక్షణనిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఆటుపోట్లు, షాక్‌ల పట్ల అప్రమత్తంగా ఉన్నట్టు తెలిపింది. కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు అనంతరం చేపట్టిన మూడో సంస్కరణ జీఎస్టీ శ్లాబుల క్రమబదీ్ధకరణగా పేర్కొంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని, దేశ వృద్ధి అవకాశాలు మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. బలమైన వృద్ధి రేటు, స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వం, ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలతో భారత సావరీన్ క్రెడిట్ రేటింగ్‌ను మూడు రేటింగ్ ఏజెన్సీలు అప్‌గ్రేడ్ చేయడాన్ని ప్రస్తావించింది. ఇటీవల హెచ్1–బి వీసాలపై అమెరికా విధించిన లక్ష డాలర్ల ఫీజును ప్రస్తావిస్తూ.. భవిష్యత్తు రెమిటెన్స్‌లు (స్వదేశానికి నిధుల బదిలీ), వాణిజ్య మిగులుపై దీని ప్రభావం ఏ మేరకో పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు ప్రభావితం కాని సేవల రంగాన్ని సైతం వాణిజ్య అనిశ్చితులు ప్రభావితం చేస్తాయనడానికి హెచ్–1బి వీసాపై విధించిన ఫీజును నిదర్శనంగా పేర్కొంది. ఇప్పటికైతే ఈ రిస్‌్కలను ఎదుర్కోగలమన్న దృక్పథంతో ఉన్నట్టు తెలిపింది. టారిఫ్ అనిశ్చితులతో ఉపాధికి రిస్క్ వృద్ధి వేగాన్ని కొనసాగించేందుకు నియంత్రణపరమైన సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధి అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్రాలు సైతం తమ పరిధిలో నియంత్రణలను తొలగించినట్టయితే దేశ ఆర్థిక వ్యవస్థను అధిక వృద్ధి పథంలో నడిపించొచ్చని అభిప్రాయపడింది. ‘‘టారిఫ్ పరమైన అనిశ్చితులు కొనసాగితే, ఎగుమతుల రంగాలపై ప్రభావం పడుతుంది. అది దేశీ ఉపాధి అవకాశాలను, ఆదాయం, వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. కొత్త మార్కెట్లకు మనకు తగిన అవకాశాలు కలి్పంచేందుకు, ఎగుమతుల వృద్ధికి కొంత సమయం పడుతుంది’’అని వివరించింది. -
‘బోగస్’పై సీరియస్
ముకరంపుర: సర్కారు సొమ్మును కాజేస్తున్న అక్రమార్కుల ఆటలు కట్టించి.. అర్హులకే సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం బోగస్ రేషన్ కార్డులు, పింఛన్ల ప్రక్షాళన చేపడుతోంది. ఇరవై రోజులుగా రెండింటిని ప్రాధాన్యాంశాలుగా ఎంచుకుని ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 16,116 రేషన్‌కార్డులను బోగస్‌గా గుర్తించిన అధికారులు వాటిని రద్దు చేశారు. ఆధార్‌తో లింకు.. రేషన్‌కార్డులను ఆధార్ కార్డుతో లింకుపెట్టి బోగస్ చిట్టాను సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో డీలర్లను అప్రమత్తం చేసి ఒత్తిడి పెంచుతున్నారు. మండలాల వారీగా డీలర్లు ఎవరెన్ని కార్డులు అప్పగించారు? వాటిలో ఎన్ని యూనిట్లు రద్దయ్యాయి? అని ప్రతి రోజు పక్కాగా సమాచారం సేకరిస్తున్నారు. శుక్రవారం వరకు 16,116 బోగస్ కార్డులను రద్దు చేశారు. వీటిని రేషన్ డీలర్లతో పాటు లబ్ధిదారులు స్వచ్ఛందంగా తెచ్చి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తద్వారా 1,33,889 యూనిట్లు తొలిగిపోయినట్లు లెక్క తేల్చారు. కార్డుల గుర్తింపునకు డీలర్లు ముందుకు రాకున్నా బినామీలు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్‌బాక్స్‌లో వేస్తున్నారు. డబుల్ కార్డులు ఉన్న 1,808 మంది తమంతట తాము సరెండర్ చేశారు. రేషన్‌డీలర్లు 14,308 కార్డులను అప్పగించినట్లు డీఎస్వో చంద్రప్రకాష్ పేర్కొన్నారు. అత్యధికంగా పెద్దపల్లి డివిజన్లో 4,987 కార్డులను సరెండర్ చేశారు. కరీంనగర్ డివిజన్లో 4,836, జగిత్యాలలో 3,334, సిరిసిల్లలో 2,408, మంథనిలో 1,661 బోగస్ కార్డులు అధికారులకు అప్పగించారు. బోగస్ పింఛన్లు.. పింఛన్ల పంపిణీలోనూ ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతున్నట్లు గుర్తించిన సర్కారు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1,78,914 మంది వృద్ధులు, 94,567 మంది వితంతువులు, 64,855 మంది వికలాంగులు, 11,668 మంది చేనేత, 6,033 మంది గీతకార్మికులు, 40,846 మందికి అభయహస్తం పింఛన్లు ఉన్నాయి. మే వరకు 3,94,699 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరి లో అనర్హులను గుర్తించేందుకు అధికారులు బయోమెట్రిక్ విధానం ద్వారా చేతివేళ్ల గుర్తులు, ఫొటోలు, ఆధార్ కార్డుతో అనుసంధానం తప్పనిసరి చేశారు. ఇవి సమర్పించని 27,056 మందికి జూన్‌లో అధికారులు నిలిపివేశారు. జూన్ నెలాఖరు వరకు 21,250 మంది ఎన్రోల్ చేసుకోవడంతో వారికి ఆగస్టు నుంచి పింఛన్లు అందనున్నాయి. మిగిలిన 5,806 మంది లబ్ధిదారులు స్పందించడం లేదు. వీరిలో చేతులు లేనివారు కొందరు ఉండడంతో వారు ఏం చేయాలో తెలియక సర్కారు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. మిగిలినవి బోగస్ పింఛన్లుగా భావిస్తున్నారు.