breaking news
gouru venkata reddy
-
ముసుగేసి..మాటు వేసి
-
వైఎస్ఆర్సీపీదే విజయం
అందరి మద్దతు వైఎస్ఆర్సీపీకే- గౌరు వెంకట రెడ్డి కర్నూలు: తెలుగుదేశం నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా స్థానిక సంస్థల ప్రజాప్రతినిదులు వైఎస్ఆర్సీపీకే సంపూర్ణ మద్దతు తెలిపారని, 150 ఓట్ల మెజార్టీతో తాను ఎమ్మెల్సీగా గెలవబోతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని బట్టి చూస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు తనకు మొదటి ప్రాధాన్యం ఓటు వేసినట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. స్థానిక సంస్థల ప్రతినిధులెవరూ వెళ్లలేదన్నారు. వారందరూ తనకే మద్దతు తెలిపారని చెప్పారు. తగిన బలం లేకపోయినా బరిలోకి దిగిన తెలుగుదేశం అభ్యర్థి చిత్తుగా ఓడిపోతున్నారని తెలిపారు. మూడేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడంతో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు తనకు మద్దతు ప్రకటించారని తెలిపారు. అభివృద్థి పథకాలే గెలిపిస్తాయి: శిల్పా తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తాయని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీల జీతాలు పెంచాలని మండలిలో వాదించినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ఓట్లు ఒక్కటి కూడా క్రాస్ అయ్యే అవకాశం లేదని తెలిపారు. -
ఏపీలో 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్
నెల్లూరు, కర్నూలు, కడప : ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. వైఎస్ఆర్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్ఆర్జిల్లా 841మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కడప, జమ్మలమడుగు, రాజంపేటలో పోలింగ్ జరుగుతోంది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...జమ్మలమడుగులో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఆయన పులివెందుల చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తొలిసారిగా డ్రోన్ కెమెరాలతో పోలింగ్ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 4వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కడప పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నెల్లూరు: ఈ ఎన్నికల్లో 852మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. నెల్లూరు, నాయుడుపేట, ఆత్మకూరు, గూడురు, కావలిలో పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనం విజయ్‌కుమార్ బరిలో ఉన్నారు. కర్నూలు: జిల్లాలో 1083 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో పోలింగ్ జరుగుతుంది. గౌరు వెంకటరెడ్డి...వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేసున్న విషయం విదితమే. -
అన్నివర్గాలకు సమన్యాయం
ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీలో అన్ని వర్గాలకు సమన్యాయం లభిస్తోందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక సోమప్ప మెమోరియల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీకి చెందిన మాచాని రఘునాథ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాచాని వెంకటేషప్ప, మాజీ కౌన్సిలర్ యు.ఎం.శ్రీనివాసులుబాబు, కేఎస్పీ శివన్న, వీజీఆర్ కొండయ్యతో పాటు దాదాపు 1000 మంది అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. వీరికి గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. అందులో భాగంగానే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బీసీ కులానికి చెందిన బుట్టా రేణుకను ప్రకటించారన్నారు. జిల్లాలోని దశాబ్దాలుగా ఆధిపత్యం కొనసాగిస్తూ అభివృద్ధిని విస్మరించిన కోట్ల, కేఈ కుటుంబాలకు వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను గెలిపించడం ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. రెండుసార్లు అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మూడోసారి జగన్ ప్రభంజనంలో అధికారం దక్కదనే ఉద్దేశంతోనే విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారన్నారు. విభజనతో సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని తెలిసీ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీలు డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రాష్ర్టం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక మాట్లాడుతూ సామాజిక, వ్యాపార, బంధుత్వ పరంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. జిల్లాలో ఎంజీ కుటుంబానికి ఉన్న పేరు, ప్రతిష్టలు రానున్న ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా తనకు దోహదపడతాయన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానన్నారు. ఆదోని, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలో బలమైన సామాజికవర్గానికి దీటుగా బీసీ మహిళ రేణుకను బరిలో నిలుపుతున్నందున.. ఆ వర్గాలు ఈమె గెలుపును ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. ఒక్క ఆదోని రెవెన్యూ డివిజన్ నుంచే రేణుకమ్మకు లక్షకు పైగా మెజార్టీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబులు సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఎంజీ కుటుంబ వారసుడు మాచాని రఘునాథ్ బృందం వైఎస్ఆర్సీపీలో చేరడం శుభ పరిణామమన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు అభివృద్ధిలో మాచాని కుటుంబం సేవలు చిరస్మరణీయమన్నారు. తాను మొదటి నుండి ఎంజీ కుటుంబానికి అండగా నిలుస్తూ ఆ వర్గీయులను రాజకీయంగా ప్రోత్సహించానన్నారు. పార్టీలో చేరిన మాచాని రఘునాథ్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేనేతలతో పాటు బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన బాటలోనే బీసీలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా చేనేత మహిళకు అవకాశం కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, మంత్రాలయం మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూధన్, పారిశ్రామికవేత్త బుట్టా నీలకంఠ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్య, నాయకులు రమాకాంత్‌రెడ్డి, బసిరెడ్డి, సంపత్‌కుమార్‌గౌడ్, మాచాని ఆదిశేషులు, మాచాని శివకుమార్, హాజీ నద్దిముల్లా, రాజన్న, గోవిందు, నసిరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.