గోస్పోర్ట్స్ ఫౌండేషన్ లో చేరిన గోపిచంద్, ద్రావిడ్!
ముంబై: భారత బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, షూటర్ అభినవ్ బింద్రాలు గోస్పోర్ట్స్ ఫౌండేషన్ లో చేరారు. బాడ్మింటన్ క్రీడ అభివృద్ధికి గోస్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలను గోపిచంద్ పర్యవేక్షించనున్నారు. టాలెంట్ ను గుర్తించడం, బాడ్మింటన్ క్రీడకు ప్రోత్సాహం అందించడం, కోచ్ లకు శిక్షణ, యువ అథ్లెట్లకు శిక్షణ శిబిరాలను నిర్వహించడం లాంటి కార్యక్రమాలను గోస్పోర్స్ ఫౌండేషన్ చేపడుతోంది.
దేశవ్యాప్తంగా 9-13 వయస్సు ఉన్న ప్రతిభ గల అథ్లెట్స్ ను గుర్తించి వారికి శిక్షణను అందించేందుకు గోస్పోర్ట్స్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. గోస్పోర్ట్స్ సంస్థకు సేవలందించడానికి గోపిచంద్ తీసుకున్న నిర్ణయంపై సంస్థ నిర్వాహకులు నందన్ కామత్ స్వాగతించారు.