breaking news
Google Android OS
-
గూగుల్ కొత్త ఫీచర్.. కొట్టేసిన ఫోన్ పనిచేయదు!
ఫోన్ల చోరీకి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. చోరీకి గురైన ఫోన్లను దాదాపు నిరుపయోగంగా మార్చే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్ 16తో ముఖ్యమైన యాంటీ-థెఫ్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ అప్డేట్లో మెరుగైన భద్రతా సాధనాలు ఉంటాయి. ఇవి "ఓనర్ అనుమతి లేకుండా రీసెట్ చేసిన ఫోన్లు పనిచేయకుండా అవుతాయి" అని ఆండ్రాయిడ్ పరికరాల సమాచారాన్ని తెలిపే ‘ఆండ్రాయిడ్ పోలీస్’ అనే వెబ్సైట్ నివేదిక తెలిపింది.గూగుల్ ఇటీవల 'ది ఆండ్రాయిడ్ షో: ఐ/ఓ ఎడిషన్' సందర్భంగా ఈ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రాథమికంగా ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ (ఎఫ్ఆర్పీ) ను పెంచుతుంది. ఇది చోరీకి గురైన ఫోన్లను నిరుపయోగంగా చేయడానికి రూపొందించిన భద్రతా ఫీచర్. గూగుల్ ఆండ్రాయిడ్ 15 లో ఎఫ్ఆర్పీకి అనేక మెరుగుదలలు చేసింది. తదుపరి ఆండ్రాయిడ్ అప్డేట్ దీనిని మరింత బలోపేతం చేస్తుంది.ఈ కొత్త ఫీచర్ గురించి గూగుల్ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ, గూగుల్ ప్రణాళికలను తెలియజేసే ఒక స్క్రీన్ షాట్ ను ఆండ్రాయిడ్ పోలీస్ పబ్లిష్ చేసింది. ఈ స్క్రీన్ షాట్ ఫోన్ స్క్రీన్ పై ఫ్యాక్టరీ రీసెట్ వార్నింగ్ ఫ్లాషింగ్ ను చూపిస్తోంది. ఫోన్‌ను దొంగిలించినవారు ఒకవేళ సెటప్ విజార్డ్ ను చేయకపోతే రీసెట్ చేయకుండా ముందుకెళ్లలేరు. అంటే యూజర్ ఫోన్‌ను రీసెట్ చేసి మునుపటి లాక్ స్క్రీన్ లాక్ లేదా గూగుల్ ఖాతా క్రెడెన్షియల్స్‌ను నమోదు చేసే వరకు ఫోన్ పనిచేయదు. ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం.. కొత్త ఫీచర్ ఈ సంవత్సరం చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
హువాయ్ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్, ఆల్ట్రా ఆక్టా ఫ్యాబ్లెట్లు
బార్సిలోనా: హువాయ్ కంపెనీ స్మార్ట్‌వాచ్, ఫ్యాబ్లెట్, బ్లూటూత్ హెడ్సెట్లు వంటి పలు రకాల కంపెనీ ఉత్పత్తులను స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న స్మార్ట్‌వాచ్ విభాగంలో అగ్రస్థానాన్ని చేరుకోవటమే తమ లక్ష్యమని హువాయ్ కన్సూమర్ బీజీ సీఈఓ రిచర్డ్ యు ఈ సందర్భంగా అన్నారు. హువాయ్ స్మార్ట్‌వాచ్- ఇది గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ మీద నడిచే తొలి స్మార్ట్‌వాచ్. ఈ ‘హువాయ్ వాచ్ ’ క్లాసిక్, బిజినెస్, స్పోర్టీ మోడళ్లలో లభించనుంది. 1.4 అంగుళాల తెరను (వాటర్ ప్రూప్) కలిగి ఉన్న ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్ 4.3, అంతకన్నా ఎక్కువ ఓఎస్ పైన నడిచే స్మార్ట్ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ వాచ్ మైక్రోఫోన్, హెల్త్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటర్ సెన్సార్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. టాల్క్‌బాండ్ ఎన్1 హెడ్‌ఫోన్- ఇది స్టీరియో అండ్ బ్లూటూత్ హెడ్సెట్, 4జీబీ ఎంపీ3 మెమరీ సామర్థ్యం ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర రూ.8,200. టాల్క్‌బాండ్ బీ2 స్మార్ట్‌వాచ్- ఇది డూయెల్ మైక్రోఫోన్, నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, 6 యాక్సిస్ సెన్సార్లు వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. ధర రూ.11,700.