breaking news
gold shirt
-
‘బంగారు’ బాబు
-
‘బంగారు’ బాబు
సాక్షి, హైదరాబాద్: ఒళ్లంతా బంగారంతో.. నడిచొచ్చే నగల దుకాణంలా కనిపిస్తున్న ఈయన పేరు పంకజ్ పరేఖ్. మహారాష్ట్రలోని యోలో పట్టణానికి చెందిన వ్యాపారవేత్త. అక్క డి వారంతా ఈయనను ‘గోల్డ్‌మన్’ అంటుంటారు. పేరుకు తగ్గట్టే ఈయన ఒంటి నిండా బంగారమే. కళ్లజోడు నుంచి ఒంటికి వేసుకొనే చొక్కా వరకు అంతా ‘స్వర్ణ’ తాపడమే. పంక జ్ వేసుకున్న షర్టు నాలుగు కేజీల బంగారంతో తయారైంది. కళ్లకు పెట్టుకున్న అద్దాలు 30 గ్రాముల బంగారంతో రూపొందింది. మెడకు నెక్లెస్‌లు, చేతి వేళ్లకు ఉంగరాలతో సహా పంకజ్ తన ఒంటినిండా ఏడు కేజీల 30 గ్రాముల బంగారం దింపేశారు. వీటి విలువ సుమారుగా రూ.3 కోట్లు ఉంటుందట. గురువారం ఈ ‘బంగారు’ బాబు ను చూసే ‘గోల్డెన్’ చాన్స్ హైదరాబాద్‌కు దక్కింది. హిమాయత్‌నగర్‌లోని సోదరుడు ప్రదీప్ పరేఖ్ గృహప్రవేశానికి పంకజ్ వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు బంగారం అంటే ఎంతో ఇష్టమని, అందుకే ఇలా ఒళ్లంతా బంగారు ఆభరణాలను వేసుకున్నట్లు చెప్పారు. త్వరలో పుత్తడి ప్యాంట్ కూడా కుట్టించుకొని గిన్నిస్ బుక్‌లో స్థానం కోసం దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. -
నిలువెల్లా బంగారమే..
హిమాయత్‌నగర్(హైదరాబాద్): సాధారణంగా వేళ్లకు ఉంగరాలు, చేతికి బ్రాస్లెట్, మెడలో గొలుసు...సహజంగా పసిడి ప్రియులకు ఉండే ఆభరణాలు. అయితే ముంబైకి చెందిన ఓ వ్యాపారి ఏకంగా నాలుగు కేజీల బంగారంతో ఏకంగా చొక్కానే కుట్టించి పసిడిపై తనకున్న మమకారాన్ని చెప్పకనే చెప్పాడు. అంతే కాదు... మరో రెండు నెలల్లో పుత్తడి ప్యాంట్ కుట్టించుకొనేందుకు ముచ్చట పడుతున్న విషయాన్ని బైటపెట్టాడు. నాలుగు కేజీల చొక్కాతోపాటు మూడు కేజీల బరువున్న బంగారు బూట్లు, పలు నగలు నగలు ఆయన ఒంటిపై ఉండటం గమనార్హం. ఆయన పేరు పంకజ్ పరేఖ్, వస్త్రవ్యాపారి అయిన అతడు ముంబైలో శివసేన నాయకుడు. సోదరుడు ప్రదీప్ పరేఖ్ గృహప్రవేశం కోసం హైదరాబాద్ వచ్చిన అతడు బుధవారం రాత్రి హిమాయత్‌నగర్‌లో సందడి చేశాడు. ధరలకు భయపడి జనం వస్త్ర సన్యాసమే చేస్తున్న ఈరోజుల్లో బంగారంతోనే చొక్కా కుట్టించుకున్న పంకజ్ పరేఖ్ జనాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే పోలీసులు మాత్రం ఆందోళనకు గరయ్యే పరిస్థితి నెలకొంది. కాగా, తనకు చిన్నతనం నుంచే బంగారమంటే మహాపిచ్చి అని పంకజ్ తెలిపారు. ప్యాంట్కూడా రెండు నెలల్లో అందుబాటులోకి వస్తే గిన్నీస్ బుక్‌లో స్థానం కోసం దరఖాస్తు చేయనున్నట్లు సెలవిచ్చారు. ఇతనికి రక్షణగా నలుగురు గార్డులు అనుక్షణం వెన్నంటి ఉంటారు.