breaking news
goddess necklace
-
దుర్గమ్మకు కనక పుష్యరాగ హారం విరాళం
సాక్షి, విజయవాడ : విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రూపంలో భక్తులను దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో కనకదుర్గ అమ్మవారి అలంకరణకు వాడే ఏడువారాల నగల్లో మరో మణి హారం వచ్చి చేరింది. ఎన్నారై భక్తుడు తాతినేని శ్రీనివాస్ 40 లక్షల రూపాయలు విలువైన కనకపుష్యరాగ హారాన్ని దుర్గమాతకు సమర్పించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. ఈ హారాన్ని ప్రతి గురువారం అమ్మవారికి అలంకరించనున్నట్లు వెల్లడించారు. కనకపుష్యరాగాలు అన్ని ఒకే సైజు కోసం సింగపూర్ నుంచి తెప్పించామన్నారు. చదవండి: గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం అలాగే గత 6 నెలల నుంచి అమ్మవారికి 7 వారాల నగలు అలంకరిస్తున్నామని, భక్తులు ఎవరైనా అమ్మవారికి 7 వారాల నగలు సమర్పించాలనుకుంటారో వారు దేవస్థానంలో సంప్రదించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారై భక్తుడు తాతినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను విజయవాడ స్థానికుడిని అని, కానీ వృత్తి రీత్యా అట్లాంటాలో ఉంటున్నట్లు తెలిపారు. తమ కుమారుడు మొదటి జీతంతో అమ్మవారికి హారం అమ్మవారికి ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి హారం చేపించి ఇవ్వడం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే అమ్మవారికి అలంకరించే ఏడు వారాల నగలు.. ► సోమవారం- ముత్యాలు ► మంగళవారం- పగడలు ► బుధవారం- పచ్చల ► గురువారం- కనకపుష్యరాగాలు ► శుక్రవారం-డైమండ్ ► శనివారం-నిలాలు ► ఆదివారం-కెంపులు -
అమ్మవారి గర్భగుడిలో లక్ష్మీహారం ప్రత్యక్షం
చిత్తూరు జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల క్రితం మాయమైన లక్ష్మీ హారం శుక్రవారం ఆలయ గర్భగుడిలో లభ్యమైంది. దాంతో అటు ఆలయ అధికారులు ఇటు అర్చకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే లక్ష్మీ హారం లభ్యం కావడంపై ఆలయ అర్చకులు భిన్న కథనాలు వెల్లడిస్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించే లక్ష్మీహారం మంగళవారం మాయమైంది. ఆ విషయాన్ని గ్రహించిన అర్చకులు గోప్యంగా ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రూ.10 లక్షల విలువైన ఆమ్మవారి హారం కనిపించకపోవడంతో ఆలయ ఉన్నతాధికారులు అగమేఘాలపై స్పందించారు. ఆలయ సిబ్బంది చేత అంతటా వెతికించారు. అయిన హారం జాడ తెలియలేదు. ఇంతలో అమ్మవారి హారం మాయమైన విషయం మీడియాకు పొక్కింది. దీంతో మీడియా లక్ష్మీ హారం అదృశ్యంపై పలు కథనాలు వెలువరించింది... శుక్రవారం ఉదయం అమ్మవారి ఆలయం గర్బగుడిలో లక్ష్మీ హారం ప్రత్యక్షమైంది. లక్ష్మీ హారం అదృశ్యంపై ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అయితే గర్బగుడిలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కొసమెరుపు.