breaking news
godawari water
-
75శాతం డిపెండబులిటీకి ఒప్పుకోం
- జాతీయ జల అభివృద్ధి సంస్థకు స్పష్టం చేసిన సర్కారు - గోదావరిలో 50శాతం, అంత కంటే తక్కువ డిపెండబులిటీ పరిగణనలోకి తీసుకోవాలంటూ లేఖ సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిలో 75 శాతం డిపెండబులిటీ ఆధారంగా నీటి లెక్కలను పరిగణించి, మిగులు జలాలను గుర్తిస్తామన్న జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఆ నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. గోదావరిలో 50 శాతం డిపెండబులిటీ లేక అంతకంటే తక్కువ డిపెండబులిటీతో నీటి లెక్కలు తీసుకుని మిగులు జలాలను గుర్తించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు శుక్రవారం ఎన్‌డబ్ల్యూడీఏకు లేఖ రాశారు. నదుల అనుసంధానానికి సంబంధించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలపైనా లేఖలో అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో ఉన్న కృష్ణా, గోదావరి నదుల్లో ట్రిబ్యునల్ల కేటాయింపుల మేరకు నీటి వినియోగం ఉందని.. ఎక్కడా మిగులు జలాలు లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ గోదావరిలో 50 శాతం డిపెండబులిటీ లెక్కల ఆధారంగా మిగులు జలాలు ఏవైనా ఉంటే వాటితో నదుల అనుసంధాన ప్రక్రియ చేపడితే అభ్యంతరం లేదని పేర్కొన్నారు. -
‘గోదావరి’తో గొంతు తడుపుతాం
కొండపాక: గోదావరి జలాలను త్వరలోనే జిల్లాకు సరఫరా చేసి మెతుకుసీమ వాసులు దశాబ్దాల కల నెరవేరుస్తామని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా మెదక్ జిల్లాలోని చెరువులకు నీరందించనున్నట్లు ఆయన వెల్లడించారు. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో తపాసుపల్లి రిజర్వాయర్ నుండి నీరు వచ్చే ప్రతిపాదిత కాల్వ స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, సమైక్య పాలకుల కుట్రలతో ఇన్నాళ్లు ఈ ప్రాంతానికి గోదారి నీళ్లు దక్కలేదన్నారు. స్వరాష్ట్రంలో మన నీళ్లు మనకు దక్కనున్నాయన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నుండి కొండపాక మండలంలోని 11 గ్రామాల పరిధిలోని 16 చెరువులకు నీరందించడానికి పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని గ్రామాలకు సుజలస్రవంతి పథకం ద్వారా గోదావరి జలాలు అందించడానికి ప్రతిపాదించామని తెలిపారు. గజ్వేల్‌కు తాగునీటి కోసం సీఎం కేసీఆర్ రూ. 30 కోట్లు మంజూరు చేశారనీ, అయితే స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు ఈ పథకాన్ని కొండపాక వరకూ విస్తరించడానికి ఇంజనీరింగ్ అధికారులతో సర్వే పనులు జరిపిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు, డీసీసీబీ వైస్‌చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ భూంరెడ్డి, ఎంపీపీ అనంతుల పద్మ, జెడ్పీటీసీ సభ్యురాలు చిట్టి మాధురి, సర్పంచ్ పసుల సరిత, నేతలు సాయిబాబా, నరేందర్, పోల్కంపల్లి యాదగిరి పాల్గొన్నారు. రిజర్వాయర్‌ను సందర్శించిన మంత్రులు వెలికట్ట గ్రామ శివారులో రాజీవ్హ్రదారి పక్కన నిర్మించిన సుజలస్రవంతి పథకం క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లు ప్రారంభించారు. సుజల స్రవంతి గోదావరి నీటి రిజర్వాయర్, పంపుహౌస్‌లను వారు మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, డాక్టర్ మౌలానా అబుల్‌కలాం ఆజాద్ సుజల స్రవంతి పథకం ద్వారా హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపు 2015 జూన్ మాసంలో ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో ఐజీ అనురాగ్‌శర్మ, జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.