ధర్మపురిలో ఘనంగా గోదావరి మహాహారతి
కరీంనగర్: ధర్మపురిలో ఘనంగా గోదావరి మహాహారతి నిర్వహించారు. బీజేపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన మహాహారతిలో వాసుదేవానంద సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్ కూడా అయిన మురళీధర్ రావు మాట్లాడుతూ గ్రామీణ పేదరికాన్ని తొలగించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా గోదావరి హారతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గోదావరి పవిత్రతను కాపాడటం, జీవనదిగా ఉంచుకోవడం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. గోదావరి తీరాన వెలసిన దేవాలయాలను స్నానఘట్టాలను పునరుద్ధరిస్తామన్నారు.
**