breaking news
goa fc
-
భారత్‌లో రొనాల్డో ఆట!
చెన్నై: అంతా అనుకున్నట్లు జరిగితే... పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆటను భారత అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్సీ) చాంపియన్స్ లీగ్–2లో భాగంగా రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నాసర్ జట్టుతో గోవా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తలపడాల్సి ఉంది. దీంతో ఆ మ్యాచ్‌లో పాల్గొనేందుకు పోర్చుగల్ స్టార్ భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అయితే అల్ నాసర్ క్లబ్‌తో కాంట్రాక్ట్ ప్రకారం విదేశీ వేదికలపై జరిగే మ్యాచ్‌ల్లో రొనాల్డో పాల్గొనే అంశంలో కొన్ని సడలింపులు ఉన్నాయి. మరి రొనాల్డో గోవా ఎఫ్‌సీతో మ్యాచ్ కోసం భారత్‌కు వస్తాడా లేదా అనేది త్వరలోనే తేలనుంది. ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్2కు సంబంధించిన ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి గోవా ఎఫ్‌సీతో పాటు మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు పాల్గొననుంది. వచ్చే నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పాల్గొననుండగా... వాటిని ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉన్నాయి. గ్రూప్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించనున్నాయి. గత సీజన్లో లీగ్ షీల్డ్ దక్కించుకోవడం ద్వారా మోహన్ బగాన్ జట్టు నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించగా... ‘సూపర్ కప్’ గెలవడం ద్వారా గోవా ఎఫ్‌సీ ముందంజ వేసింది. ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్‌లో గోవా జట్టు పాల్గొనడం ఇది రెండోసారి. 2021లోనూ గోవా జట్టు ఈ టోర్నీలో ఆడింది. సెపె్టంబర్ 16న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్... వచ్చే ఏడాది మే 16న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. లీగ్‌లో భాగంగా... ఇంటాబయట మ్యాచ్‌లు జరగడం పరిపాటి కావడంతో గోవా ఎఫ్‌సీతో తలపడేందుకు అల్ నాసర్ తరఫున రొనాల్డో భారత్‌కు వస్తాడనే వార్తలు వ్యాపించాయి. గ్రూప్ ‘సి’లో ఫూలద్ మొబారకేశ్ సెపాహన్ ఎస్సీ (ఇరాన్), అల్ హుసేన్ (జోర్డాన్), అహల్ ఎఫ్‌సీ (తుర్క్మెనిస్తాన్)తో కలిసి మోహన్ బగాన్ పోటీ పడనుంది. గ్రూప్ ‘డి’లో గోవా ఎఫ్‌సీతో పాటు అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా), అల్ జవ్రా ఎస్సీ (ఇరాక్), ఇస్తిక్లోల్ ఎఫ్‌సీ (తజకిస్తాన్) ఉన్నాయి. -
గోవా ఘన విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) 12వ విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో గోవా జట్టు 2–0 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. గోవా జట్టు తరఫున ఇకెర్ గుర్రొటెనె (46వ నిమిషంలో), మొహమ్మద్ యాసిర్ (73వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. హోయ్్చలో గోవా జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై 6 షాట్లు ఆడగా... కేరళ బ్లాస్టర్స్ ఒక్కటేసారి గోల్ పోస్ట్‌పైకి గురిచూసినా అది లక్ష్యాన్ని చేరలేదు. తాజా సీజన్లో ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడిన గోవా జట్టు 12 విజయాలు, 3 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 42 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్ 21 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 11 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు సాధించి 10వ స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు 3–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. ఈస్ట్ బెంగాల్ తరఫున దిమిత్రోస్ (15వ నిమిషంలో), మహేశ్ సింగ్ (47వ నిమిషంలో), లాల్చుంగుంగా (54వ నిమిషంలో) తలా ఒక గోల్ కొట్టారు. పంజాబ్ తరఫున ఇజెక్వెల్ విడాల్ (62వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. ప్రస్తుతం ఈస్ట్ బెంగాల్ జట్టు 24 పాయింట్లతో పట్టిక తొమ్మిదో స్థానంలో ఉండగా... పంజాబ్ అన్నే పాయింట్లతో 11వ స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో మోహన్ బగాన్‌తో ఒడిషా ఫుట్‌బాల్ క్లబ్ తలపడుతుంది. -
హైదరాబాద్ ఎఫ్‌సీ ‘హ్యాట్రిక్’
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం సొంత మైదానం జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 1–0 గోల్ తేడాతో గోవా ఎఫ్‌సీని ఓడించింది. హైదరాబాద్ తరఫున ఏకైక గోల్‌ను సివెరియో 11వ నిమిషంలో నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన హైదరాబాద్ తర్వాతి మూడు మ్యాచ్‌లలో గెలిచింది. చదవండి: T20 WC 2022: పాకిస్తాన్ - నెదర్లాండ్స్ మ్యాచ్.. కామెంటేటర్‌గా మిథాలీ రాజ్ -
గోవా ఎఫ్సీకి రూ.50 లక్షల జరిమానా
న్యూఢిల్లీ:ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా గతేడాది డిసెంబర్లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించిన గోవా ఎఫ్‌సీ జట్టుకు రూ.50లక్షల జరిమానా విధించారు. ఆనాటి తుదిపోరులో గోవా ఎఫ్‌సీ 2-3 తేడాతో చెన్నైయిన్పై ఓటమి పాలైంది. దీంతో మ్యాచ్ తరువాత నిర్వహించే అవార్డుల కార్యక్రమానికి గోవా జట్టు హజరుకాకుండా బాయ్ కాట్ చేసింది. మరోవైపు ఆ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ ఆరోపణలకు దిగింది. దీంతో ఫుట్ బాల్ క్రమశిక్షణా కమిటీతో సుదీర్ఘంగా చర్చించిన తరువాత ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏఐఎఫ్ఎఫ్ ఆర్టికల్ 53 ప్రకారం ఇలా చేయడం క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు రావడంతో గోవా జట్టుకు భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జరిమానాను 10 రోజుల వ్యవధిలో చెల్లించాలని ఏఐఎఫ్ఎఫ్ స్పష్టం చేసింది. ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే ఎఫ్‌సీ గోవా సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు, అధికారులు ఎక్విప్మెంట్ మేనేజర్ రాజేశ్ మాల్గి ఆధ్వర్యంలో రిఫరీని చుట్టుముట్టి భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే దీనిపై వివరణ ఇవ్వాలని గోవా ఎఫ్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయడం కూడా నిబంధనలకు వ్యతిరేకం కావడంతో గోవా జట్టుకు జరిమానా విధిస్తూ ఏఐఎఫ్ఎఫ్ తాజాగా నిర్ణయం తీసుకుంది.