breaking news
Global Health Care Summit
-
గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ 2023
-
గ్లోబల్ హెల్త్ సమ్మిట్ లో భాగంగా వాకథాన్
-
విశాఖపట్నంలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్
-
ఏపీలో సామాన్యుడికి ఆధునిక వైద్యం
-
విశాఖలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్
మహారాణిపేట (విశాఖ దక్షిణ) : ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి విశాఖలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ జరగనుంది. నోవాటెల్ హోటల్లో మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి 450 మంది వైద్య నిపుణులు పాల్గొంటున్నారు. తొలిరోజు సదస్సులో సీఎం వైఎస్ జగన్ వర్చువల్గా ప్రసంగిస్తారు. వైద్య సేవలను మరింత మెరుగు పరచడంతోపాటు వైద్య విజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం, మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ, మాతా శిశు మరణాల నివారణ, పౌష్టికాహారం తదితర అంశాలపై సదస్సులో చర్చిస్తారు. రెండోరోజైన శనివారంనాడు ఏపీ, తెలంగాణ గవర్నర్లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. 8న ఆర్.కె.బీచ్లో హెల్త్ కేర్ వాక్ ఉంటుందని చెప్పారు.