breaking news
Girlish baby
-
అయ్యో ‘పాపం’!
ఆళ్లగడ్డ: భారమనుకున్నారో.. భరించలేమనుకున్నారో.. చేసిన తప్పుకు సాక్షిగా నిలుస్తుందునుకున్నారో తెలియదు కాని అభం శుభం తెలియని బంగారు తల్లిని వదిలించుకున్నారు. సరిగ్గా కళ్లు కూడా తెరవని ఆడ శిశువును ముళ్ల పొదల్లో పడేసి చేతులు దులుపుకున్నారు. ప్రాణముండగానే చీమలు పట్టి ఆ బాధను భరించలేక.. ఏడవడానికి శక్తి లేక .. మూలుగుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని కొందరు గమనించి అక్కున చేర్చుకున్నారు. అందరిని కలచి వేసిన ఈ ఘటన సర్వనరసింహస్వామి ఆలయ సమీపంలో జరిగింది. శిరివెళ్ల మండలంలోని సర్వనరసింహస్వామి ఆలయ సమీపంలోని ఓ పుట్ట వద్ద ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కొన్ని కోతులు గుంపుగా ఉన్నాయి. అక్కడి నుంచి చిన్నగా పసిపాప మూలిగుతున్న శబ్దం వస్తోంది. చాలాసేపు ఈ శబ్దం రావడంతో అక్కడే టెంకాయలు విక్రయించుకునే ఓ మహిళ అక్కడున్న కోతులను పారదోలింది. కోతులు పక్కకు పోయినా పసిపాప మూలిగే శబ్దం ఆగక పోవడంతో అనుమానం వచ్చిన ఆ మహిళ మరో ఇద్దరిని తోడు తీసుకుని అటుగా వెళ్లింది. దగ్గరికి వెళ్లే సరికి చీమలు పట్టి ఏడవడానికి శక్తిలేక చిన్నగా మూలుగుతున్న ఓ పసిపాప కనిపించడంతో కంగుతిన్నారు. వెంటనే పసిపాపను ఎత్తుకుని చీమలు విదిలించి.. వంటినిండా ఉన్న బురదను కడిగారు. ఈ విషయం దేవాలయం ప్రాంగణంలో చర్చనీయాంశమవడంతో అక్కడికి పూజకు వచ్చిన గాజులపల్లికి చెందిన వాణి అనే మహిళ తమకు పిల్లలు లేరని ఈ పాపను తాము సాక్కుకుంటామని అక్కున చేర్చుకుంది. అంతలో ఈ విషయం పోలీసులకు తెలియడంతో మహనంది ఎస్ఐ తులసీ నాగప్రసాద్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఆళ్లగడ్డ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పాపను స్వాధీనం చేసుకుని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు..వయస్సు వారం నుంచి 10 రోజుల లోపు ఉంటుందని నీరసంగా ఉండటంతో ఐసీయూలో ఉంచామని మరో వారం వరకు ఎటువంటి విషయం చెప్పలేమన్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. పాప కోలుకున్న వెంటనే కర్నూలు బాలసదనం తరలించి..ఆరునెలలు సంరక్షిస్తామన్నారు. అంతలోపు పాప తల్లిదండ్రులు తగిన ఆధారలతో వస్తే అప్పగిస్తామని చెప్పారు. లేదంటే నిబంధనల ప్రకారం దత్తత తీసుకుంటామని దరఖాస్తు చేసుకున్నవారికి అప్పగిస్తామని తెలిపారు. -
బరువైన పేగు బంధం!
అక్కడకు చేరిన వారంతా అయ్యో పాపం అన్నారు. అయితే ఆ పాపం ఆ పసిపాపదు కాదు. కర్కశంగా తుప్పలపై విసిరేసిన వారిది. ఆ పాపం అమ్మదే కాదు...అమ్మకు ఆ దుర్గతి పట్టించిన ఈ సమాజానిది. నిర్దయగా పాపను వదిలించుకున్న వారి చేష్టలను చూసి నిశిరాత్రి సైతం భయపడి ఉంటుంది. వారి పైశాచికాన్ని కని పిశాచాలు సైతం నివ్వెరపోయి ఉంటాయి. ఆ పాషాణ గుండెలను వీక్షించి బండలు మరింత బిగుసుకుపోయి ఉంటాయి. అయితే మానవత్వం ఇంకా మిగిలే ఉందని జరజాపు పేట ప్రజలు నిరూపించారు. పాపను బతికించేందుకు కృషి చేశారు. జరజాపుపేట (నెల్లిమర్ల), విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: అర్ధరాత్రి పూట చంపేస్తున్న చలిగాలుల మధ్య ఆ పసిపాప ఎంతగా ఏడ్చిందో. అమ్మ స్పర్శ కోసం ఎంతగా తపించిపోయిందో. రాళ్లు, ముళ్లు ఒంటిని చీరేస్తుంటే ఎంతగా బాధపడిందో. ఆకలి తీరే దారి తెలీక, అమ్మ పాలు లేక ఎంత నరకయాతన అనుభవించిందో. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో వెచ్చగా తలదాచుకున్న ఆ శిశువుకు కన్నులు తెరవకముందే కష్టాలు మొదలయ్యాయి. మమకారానికి అర్థం తెలియని ఆ తల్లి కడుపులో పుట్టడం ఈ పాపకు శాపమైంది. లక్ష్మీదేవి లాంటి ఆడపిల్లను ఆ తల్లి పాడుపడిన బావిలో పడేసింది. అన్నెంపున్నెం ఎరుగని పసిపాపను అర్ధరాత్రి పూట వదిలించుకుంది. ఆఆడపిల్ల ఏడు పువిన్న స్థానికులు పాపను ఆస్పత్రికి తరలించా రు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు స్థానికులకు సోమవారం లభ్యమైంది. స్థానిక ఎరుబోతువీధి సమీపంలో పంట పొలాల్లో నీరులేని ఓ పా డుపడిన బావిలో ఈచిన్నారి దొరికింది. ఉదయం పొలాల వైపు వెళుతున్న ఓ వృద్ధురాలికి చిన్నారి ఏడుపు వినిపించింది. ఆమె స్థానికులకు సమాచా రం అందించడంతో వారంతా ఆశ్చర్యపోయి చు ట్టుపక్కల పరిశీలించగా బొడ్డుతాడు కూడా కోయ ని ఆడశిశువు బావిలో కనిపించింది. శిశువు శరీరమంతా చిన్నచిన్న దెబ్బలతో నిండిపోయింది. వీ రు గమనించడం ఏమాత్రం ఆలస్యమైనా చిన్నారి చనిపోయేదే. ఈ విషయం గ్రామమంతా పాకిపోవడంతో శిశువును చూసేందుకు జనం ఎగబడ్డా రు. చిన్నారి ఒళ్లంతా గాయాలైన వైనాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బొడ్డుతాడు కూడా కోయకుండా చిన్నారిని బావిలోకి విసిరేసిన వారిని, అంతా శాపనార్థాలు పెట్టారు. అనంతరం స్థానికులు అవనాపు సత్యనారాయణ, అవనాపు జీవనరావు, అతని తల్లి అవనాపు పాపయ్యమ్మ, పల్లా అప్పారావు మాక్సీ ఆటోలో శిశువును ఘోషాఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో చేర్పిం చా రు. అలాగే నెల్లిమర్ల సీడీపీఓ రమణాదేవికి స మాచారం అందించారు. ప్రస్తుతం చిన్నారి విజ యనగరంలోని ఘోషాఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శిశువు పరిస్థితి కాస్తంత విషమంగా ఉంద ని వైద్యులు చెప్పారు. బావిలో లభించిన శిశువు తమగ్రామానికి చెందినది కాదని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు, బాలిక సంరక్షణ విభాగం అధికారులు ఘోషా ఆస్పత్రికి చేరుకుని శిశువు పరిస్థితి ఆరాతీశారు. శిశువుకు అవసరమైన రక్షణ కల్పిస్తామని చైల్డ్‌లైన్ 1098 సంస్థ కోఆర్డినేటర్ రాజారావు, డీసీపీయూ పీఓ నాగరాజు తెలిపారు. విషమంగా ఉంది శిశువును నూతిలో పడేయడంతో తలకు, శరీరంపై గా యాలయ్యాయి. పల్స్‌రేటు చాలా తక్కువుగా ఉంది. ఆస్పత్రికి 9:30గంటల సమయంలో తీసుకుని వచ్చా రు. వచ్చిన వెంటనే వైద్యం చేశాం. బొడ్డు కోయకపోవడంవల్ల రక్తస్రావం అధికంగా అయింది. అవసరమై న వైద్యంచేశాం. ప్రస్తుతానికి శిశువు పరిస్థితి విషమంగానే ఉంది. -బి.రవీంద్రబాబు, ఎస్ఎన్సీయూ డాక్టర్