breaking news
gippy
-
హ్యాపీగా టాయ్‌లెట్స్ కడిగేవాడిని, బాగా డబ్బులొచ్చేవి: నటుడు
పంజాబీ ఇండస్ట్రీలో ఇటీవలే ఇరవయ్యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు గిప్పీ గ్రీవల్. సింగర్‌గా, నటుడిగా రాణిస్తున్న ఆయన కెరీర్ ఏమీ పూలపాన్పు కాదు. డబ్బుల కోసం టాయ్‌లెట్స్ కడిగే స్థాయి నుంచి సినిమాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే లెవల్‌కు వెళ్లాడీ హీరో. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. 'ఇండియాలో టాయ్‌లెట్స్ క్లీన్ చేసేవాళ్లను చిన్నచూపు చూస్తారు. నిజంగా అది మన దురదృష్టం. కెనడాలో ఉన్నప్పుడు నేను కూడా ఆ పని చేశాను. నేల తుడవడమే కాకుండా బాత్రూమ్స్ కూడా శుభ్రం చేసేవాడిని. అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు. పైగా అలా టాయ్‌లెట్స్ క్లీన్ చేయడం వల్ల నాకు ఎక్కువ డబ్బులొచ్చేవి. కాబట్టి సంతోషంగా ఆ పని చేసేవాడిని. అంతేకాక నేను, నా భార్య రవ్నీత్ వేకువజామున నాలుగన్నర గంటలకే నిద్ర లేచి వార్తాపత్రికలు పంచేవాళ్లం. దెయ్యాలకోటలా ఉన్న ఇండ్లలోకి న్యూస్‌పేపర్స్ ఇవ్వాలంటే తను ఎంతో భయపడేది. కానీ తప్పదు కాబట్టి సమయానికి వెళ్లి పేపర్ వేసేవాళ్లం' అని చెప్పుకొచ్చాడు. కాగా గిప్పీ 2002లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతడు గాయకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు. గిప్పీ నటించిన హనీమూన్ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. అమర్ ప్రీత్ ఛాబ్రా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జాస్మిన్ భాసిన్ హీరోయిన్. చదవండి: నేను ఎలా ఉన్నా అందగత్తెనే, సినిమాలు వాటంతటవే వస్తాయి బిగ్‌బాస్ నామినేషన్స్: ఆ జంట మధ్య బిగ్ ఫైట్ -
ఆ చలిలో జిప్పీ లేకపోతే...
సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమవుతున్న టీనా ఆహూజా తన తొలి సినిమా షూటింగ్లో మాంచి బిజీగా ఉంది. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. సినిమా హీరో జిప్పీ గ్రేవాల్ తనకు బాగా సహకరిస్తున్నాడని, అతడు లేకపోతే యాక్టింగ్ వదిలేసి ఎప్పుడో ఇంటికి వెళ్లిపోయేదాన్నని చెప్పుకొస్తోంది. బాగా చలిగా ఉన్న ప్రదేశంలో ఒక రొమాంటిక్ సీన్లో నటించాల్సి వచ్చినపుడు చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. ఇక నా వల్లకాదు.. పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో జిప్పీ తన కోటు ఇచ్చి రక్షించాడని తెలిపింది. గడ్డ కట్టుకుపోయే చలిలో రొమాంటిక్ సీన్లను పండించడం అంత ఈజీ కాదంటోంది. ఆ చలికి వణికిపోతూ ఇబ్బంది పడుతోంటే జిప్పీ ఇచ్చిన జాకెట్ తనను కాపాడిందంటోంది. మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా.. ఇదంతా నటనలో భాగమని అర్థమయ్యాక పెద్ద కష్టమనిపించలేదని పేర్కొంది. ఎలాగైతేనే చివరికి ఆ సీన్ పూర్తి చేశాం... ఇట్ వజ్ ఫన్ అంటూ ముగించింది. కాగా స్మీప్ కాంగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ధర్మేంద్ర కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కాగా, హీరోయిన్ టీనా అహూజా కూడా.. మరో ప్రముఖ హీరో గోవిందా కూతురు.