gin
-
వరల్డ్ బెస్ట్ ఇండియన్ మద్యం బ్రాండ్.. ఫుల్లు రూ. 2వేలే!
భారతీయులు స్వభావ సిద్ధంగా బలమైన, గాఢమైన రుచులను రంగులను ఇష్టపడతారు అందుకేనేమో మన దేశంలో మద్యం వినియోగంలో విస్కీ, బ్రాండీ, రమ్, బీర్ లకే ఎక్కువ డిమాండ్. అయితే విస్కీ, బ్రాందీ, రమ్లకు బ్రిటిష్ పాలన నాటి నుంచే ఆదరణ బాగా ఉంది. ముఖ్యంగా విస్కీ,ఎప్పటి నుంచో మద్యం ప్రియులకు ప్రధాన ఎంపికగా నిలిచింది. రమ్ బ్రాందీ విస్కీలు అందరికీ అందుబాటు ధరలలో సులభంగా లభించే మద్యం రకాలుగా మారాయి.వోడ్కా కూడా ఇటీవలి కాలంలో పుంజుకుంటుండగా. వీటన్నింటి తర్వాత స్థానం వైన్‌కు దక్కింది. అయితే మన దేశంలోని మద్యపాన ప్రియుల్లో అనేకమంది దాదాపుగా మర్చిపోయిన ఒక మద్యం వెరైటీ ఒకటి ఉంది అది జిన్. లైట్ కలర్లో, సున్నితమైన రుచులతో ఉండటంతో, భారతీయ అభి‘రుచుల’ను అది అంతగా సంతృప్తి పరచలేకపోయింది. అంతేకాకుండా జిన్ గురించి ప్రచారం కూడా తక్కువే. అందుకే చాలా మందిలో జిన్ ను ఎలా తాగాలో, ఏ కాక్టెయిల్స్లో ఉపయోగించాలో అవగాహన లేకపోయింది. దాంతో పెద్దగా ఎవరూ పట్టించుకోని రకంగా జిన్ మిగిలిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న గ్లోబల్ కాక్టెయిల్ కల్చర్ జిన్ వినియోగానికి ఊపునిస్తోంది. తరచుగా కాక్టెయిల్స్లో కలుపుకుని జిన్ను సేవించడం ఓ ప్రత్యేకమైన వెస్ట్రన్ డ్రింకింగ్ కల్చర్. ఇలాంటి శైలి ఇప్పుడ మను నగరాల్లో మాత్రమే క్రమంగా అభివృద్ధి చెందుతోంది. గ్రేటర్ దాన్, హాపుసా వంటి భారతీయ క్రాఫ్ట్ జిన్ల ఆవిర్భావంతో, నగరాల్లో యువత, ప్రయోగాలకు వెరవని ఆల్కహాల్ ప్రియుల వల్ల జిన్ కు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే మన దేశానికి చెందిన ఒక జిన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్‌గా నిలిచింది. సాధారణంగా మన దేశీయ మద్యం రకాలు ప్రపంచ పోటీలో నిలవడం అరుదు. అలాంటిది ఏకంగా విజేతగా గెలుపొందడం చెప్పుకోదగిన విషయమే. భారతదేశంలో తయారైన జిన్ బ్రాండ్ ’జిన్ జిజి’ ఇటీవల లండన్‌లో నిర్వహించిన పోటీల్లో ’స్పిరిట్ ఆఫ్ ది ఇయర్ 2025’ అనే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ పురస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ మద్యం ఉత్పత్తులకు ఇస్తారు. జిన్ జిజి గోవాలో తయారవుతుంది. ఇది హిమాలయ జునిపర్, తులసి, దార్జిలింగ్ టీ, క్యామొమైల్ వంటి భారతీయ సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారు చేస్తారు. ఈ ప్రత్యేకమైన సుగంధాలు దీనికి ప్రత్యేకతను అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ మద్యం బ్రాండ్లకు గుర్తింపు తీసుకువచ్చిన జిన్ జిజి... ధర రూ.2వేల దగ్గర్లోనే ఉండడం కూడా మరో విశేషం. సాధారణంగా ఇలా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మద్యం బ్రాండ్స్ ధర కనీసం రూ.5వేల పైమాటే ఉంటుంది. అయితే జిన్ చోటా మోటా వైన్ షాప్స్‌లో దొరకకపోవచ్చు. డ్రింక్స్.ఇన్ వంటి వెబ్సైట్లలో ఇది అందుబాటులో ఉంది కాబట్టి ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. అలాగే ప్రీమియం మద్యం దుకాణాల్లో కూడా లభించవచ్చు. -
కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ‘జిన్’ పోరు
లండన్: బ్రిటన్‌లోని ప్రముఖ యూనివర్సిటీలు కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్‌లు తమ సంప్రదాయ వైరాన్ని మర్చిపోలేదు. తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తన సొంత బ్రాండ్ జిన్ క్యూరేటర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆక్స్‌ఫర్డ్‌తో మరో పోటీకి తెరతీసింది. గత ఏడాది ఆక్స్ఫర్డ్ వర్సిటీ తన సొంత ఫిజిక్ బ్రాండ్ జిన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. వర్సిటీ గార్డెన్‌లోని చెట్లు, మొక్కల నుంచి రూపొందించిన ఈ జిన్ ధర 35 పౌండ్లుగా నిర్ణయించింది. అయితే, ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఇసాక్ న్యూటన్ సాపేక్ష సిద్ధాంతం కనుగొనేందుకు కారణమైన యాపిల్స్ నుంచి తాము క్యూరేటర్ జిన్ తయారు చేస్తున్నట్లు కేంబ్రిడ్జ్ తెలిపింది. దీనిని తమ బొటానికల్ గార్డెన్స్‌లోని యాపిల్స్ నుంచి రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ జిన్ ధర 40 పౌండ్లుగా తెలిపింది. ఇప్పటికే యూనివర్సిటీలోని దాదాపు 12 కళాశాలలకు ఈ జిన్ను అందజేస్తున్నట్లు తెలిపింది. తాజాగా, ఇదే కోవలోకి లీసెస్టర్ యూనివర్సిటీ కూడా వచ్చి చేరింది. తమ వర్సిటీ బొటానిక్ గార్డెన్‌లోని మొక్కల నుంచి జిన్ తయారు చేసేందుకు ఇటీవలే తమ విద్యార్థులకు అనుమతినిచ్చింది. -
యవ్వనత్వాన్ని పెంచే కొత్తరకం 'జిన్'
సౌందర్య ప్రేమికుల కోసం ఓ కొత్త ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. వృద్ధాప్యాన్ని తగ్గించి యవ్వనంగా కనిపించేందుకు కొల్లాజిన్ కలిసిన మద్యపానీయాన్నిప్రపంచంలోనే మొట్ట మొదటిసారి బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ కనిపెట్టింది. యాంటే ఏ జిన్ పేరిట మార్కెట్లోకి విడుదల చేసింది. సౌందర్య ప్రేమికులు, యవ్వన ప్రియులు వృద్ధాప్యాన్ని అధిగమించేందుకు ఈ నూతన మద్యం ఎంతగానో ఉపయోగపడుతుందని తయారీదారులు చెప్తున్నారు. బ్రిటన్ కు చెందిన బోంపాస్ అండ్ పార్ కంపెనీ 'యాంటే ఏ జిన్' నూతన మద్యాన్ని ఆవిష్కరించింది. చిన్న వయసులోనే వయసు మీదపడినట్లు కనిపించేవారు, వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనుకునే వారికి ఈ కొత్తరకం మద్యం వరమేనని సృష్టికర్తలు చెప్తున్నారు. కొత్తగా కనుగొన్న ఈ సౌందర్యసాధనం ఒక బాటిల్ ఖరీదు సుమారు 35 పౌండ్ల వరకూ ఉంటుందని చెప్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉండే సాధారణ కొల్లాజిన్ గుళికలకు బదులుగా ఈ కొత్తరకం మద్యం తీసుకొని సౌందర్యాన్ని పెంచుకోవచ్చని, యవ్వనాన్ని నిలుపుకోవచ్చని వెల్లడించారు. ఈ జిన్నును తాగడం వల్ల చర్మం ముడతలు పడుకుండా కాపాడుతుందని, యవ్వన వయస్కులుగా కనిపిస్తారని ఉత్పత్తిదారులు భరోసా ఇస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి బ్రిటన్ కు చెందిన బోంపాస్ అండ్ పార్ సంస్థ 'యాంటీ ఏ జిన్' పానీయాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఆహార పానీయంలో ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతోపాటు, 40శాతం ఛమోమైల్, టీ సువాసనలతో కలసిన స్పిరిట్ ఉంటుందని తెలిపారు. అంతేకాక ఇతర రంగులతోపాటు దురదగొండి, కొత్తిమీర, జునిపెర్ వంటి సుగంధ మొక్కల వేళ్ళను కూడ ఈ పానీయం తయారీలో వినియోగించారు. ఈ సరికొత్త ఉత్పత్తి శరీరంపై మచ్చలను నిరోధించి, చర్మాన్ని మృదువుగా ఉండేందుకు సహాయపడటంతోపాటు.. పునరుత్తేజాన్ని కలిగిస్తుందని ఉత్పత్తిదారులు వార్నర్ లీజర్ హోటల్స్ తమ వెబ్ సైట్ లో వివరించారు. శరీరంలో కొల్లాజిన్ సహజంగానే ఉత్పత్తి అయినప్పటికీ తమ ఉత్పత్తి.. వయసును తగ్గించి యవ్వనాన్ని కలిగిస్తుందని సూచించారు. కొల్లాజిన్ ఉత్పత్తులను తీసుకోవడం లేదా అటువంటి బ్యూటీ ఉత్పత్తులను వాడటంవల్ల చర్మం ముడుతలు రాకుండా చేసి, అకాల వృద్ధాప్య సమస్యలను నివారించవచ్చని యాంటీ ఏ జిన్ ఉత్పత్తిదారులు చెప్తున్నారు.