జీహెచ్ఎంసీ డీఈ అదృశ్యం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ సర్కిల్ -4 కార్యాలయంలో డీఈగా పనిచేస్తున్న డి.బి. సత్యనారాయణరావు ( 53) అదృశ్యమైన సంఘటన సైదాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సైదాబాద్ కాలనీలో నివసిస్తున్న ఆయన గత నెల 30న విధులకు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు.
దీంతో ఆయన కుటుంబ సభ్యులు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్యనారాయణ వెంట సెల్ ఫోను, ఐడీ కార్డు కూడా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.