breaking news
General election nominations
-
బోణీ కొట్టలేదు
సాక్షి, ఒంగోలు సిటీ: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తొలిరోజైన సోమవారం జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఉదయం ఒంగోలు పార్లమెంట్‌కు రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్ వినయ్‌చంద్, బాపట్ల పార్లమెంట్‌కు రిటర్నింగ్ అధికారి అయిన సంయుక్త కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి నోటిఫికేషన్లు జారీ చేశారు. నోటీసు బోర్డులో నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా వివరాలు ఉంచారు. ఎన్నికల సంఘానికి సమాచారమిచ్చారు. అలాగే జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని కేంద్రాల్లో ఎన్నికల కంట్రోల్ రూంలను ప్రారంభించారు. ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసి సమయం ముగిసేంత వరకు ఆర్వోలు ఉన్నారు. అయితే, జిల్లాలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఒంగోలు ప్రకాశం భవన్లో ప్రారంభించిన ప్రత్యేక కేంద్రం నుంచి నామినేషన్ ఫారాలను ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరిట, బాపట్ల నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఫారాలను తీసుకెళ్లారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ప్రారంభించారు. భారీగా ఆర్వో కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్వో కేంద్రానికి వంద మీటర్ల వద్ద చేసిన మార్కింగ్‌లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా కెమేరాలతో పాటు ఆర్వోల వద్ద వీడియో గ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. -
వైఎస్సార్ సీపీలోకి పార్థసారథి, వేదవ్యాస్
భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికిన జగన్ సమాంధ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్న నేతలు హైదరాబాద్: సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన రోజు కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వలసల వరద కొనసాగింది. కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి కె.పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్థసారథి ఇటీవలి వరకూ రాష్ట్ర ప్రభుత్వంలో పాఠశాల విద్యా శాఖమంత్రిగా కొనసాగారు. అలాగే 2009 నుంచీ పీఆర్పీలో ఉన్న వేదవ్యాస్ ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత అందులో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామాలిచ్చిన ఈ ఇద్దరు నేతలు శనివారం పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి వచ్చి పార్టీలో చేరారు. పార్థసారథి ఇంతకుమునుపే జగన్‌ను కలిసి తన అభీష్టాన్ని వెల్లడించారు. అందుకు అనుగుణంగా శనివారం వేదవ్యాస్‌తో కలిసి వ చ్చారు. వీరిద్దరికీ జగన్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ నివాసం పరిసరాలన్నీ కృష్ణాజిల్లా కార్యకర్తలతో కిటకిటలాడాయి. ‘జై జగన్...’ నినాదాలతో మారుమోగాయి. తనను కలుసుకోవడానికి ఉబలాటపడిన యువకులను నిరాశ పర్చకుండా జగన్ బయటకు వచ్చి వందలాది మందితో కరచాలనం చేసి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కృష్ణాజిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గోవాడ అనిల్‌కుమార్, ఉయ్యూరు, కంకిపాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు గోన మదన్, సాదిక్, ఉయ్యూరు చెరకు అభివృద్ధి మండలి చైర్మన్ నెర్సు సతీశ్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో ఉన్నారు. ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు: పార్థసారథి రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని, ఆయన సారథ్యంలోనే పేదల కష్టాలు తీరతాయని విశ్వసిస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి పార్థసారథి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్ర ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి జరగాల్సి ఉందని, అది ఒక్క జగన్ నేతృత్వంలోనే సాధ్యమని అన్నారు. అందుకే తాను, తన అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. 2014 ఎన్నికల తరువాత రాష్ట్రంలో జగన్ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలి: వేదవ్యాస్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని, తాను కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నానని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. సీమాంధ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ ప్రజలకు అవసరమన్నారు. వైఎస్ పథకాల అమలు చేయగలిగిన వ్యక్తి జగనేనన్నార -
రెండో రోజు ఐదు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం రెండో రోజైన గురువారం మందకొడిగా సాగింది. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అసెంబ్లీ స్థానాలకు ఐదు నామినేషన్లు దాఖలు అయ్యాయి. సిర్పూర్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి పాల్వాయి రాజ్యలక్ష్మీ, పాల్వాయి హరీష్‌బాబు నామినేషన్లు వేశారు. వీరిద్దరు స్వతంత్య్ర అభ్యర్థులుగా కూడా అదే అసెంబ్లీ స్థానానికి మరో రెండు నామినేషన్ వేశారు. కాగా, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్య్ర అభ్యర్థిగా ఉట్ల నర్సింలు నామినేషన్ దాఖలు చేశారు. మిగతా ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. కాగా, మొదటి రోజైన బుధవారం ఐదు నామినేషన్లు దాఖలైన విష యం విధితమే. ఎంపీ స్థానానికి రెండు, ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి రెండు, ఆసిఫాబాద్‌కు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. బుధ, గురువారాల్లో కలిపి పది నామినేషన్లు దాఖలు అయ్యాయి.