రెండో రోజు ఐదు | less response for local body elections nominations | Sakshi
Sakshi News home page

రెండో రోజు ఐదు

Apr 4 2014 12:44 AM | Updated on Sep 2 2017 5:32 AM

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం రెండో రోజైన గురువారం మందకొడిగా సాగింది. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం రెండో రోజైన గురువారం మందకొడిగా సాగింది. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అసెంబ్లీ స్థానాలకు ఐదు నామినేషన్లు దాఖలు అయ్యాయి. సిర్పూర్ అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి పాల్వాయి రాజ్యలక్ష్మీ, పాల్వాయి హరీష్‌బాబు నామినేషన్లు వేశారు. వీరిద్దరు స్వతంత్య్ర అభ్యర్థులుగా కూడా అదే అసెంబ్లీ స్థానానికి మరో రెండు నామినేషన్ వేశారు. కాగా, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్య్ర అభ్యర్థిగా ఉట్ల నర్సింలు నామినేషన్ దాఖలు చేశారు. మిగతా ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. కాగా, మొదటి రోజైన బుధవారం ఐదు నామినేషన్లు దాఖలైన విష యం విధితమే. ఎంపీ స్థానానికి రెండు, ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి రెండు, ఆసిఫాబాద్‌కు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. బుధ, గురువారాల్లో కలిపి పది నామినేషన్లు దాఖలు అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement