breaking news
gelatin sticks explosion
-
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం.. బ్లాస్టింగ్‌కు ప్లాన్?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. 20 కిలోలకు పైగా బరువున్న జిలెటిన్ స్టిక్స్ ప్యాకెట్లు బయటపడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎర్రకోట పేలుడు, ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం సమీపంలో 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత తాజాగా ఇలా పేలుడు పదార్ధాలు లభ్యంచడంతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా సుల్త్ ప్రాంతంలోని దబారా గ్రామంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల సమీపంలో 161 శక్తివంతమైన పేలుడు పదార్థమైన జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల సమీపంలో పిల్లలు ఆడుకుంటుండగా సమీపంలోని పొదల్లో అనుమానాస్పద వస్తువును గుర్తించారు. దీంతో, స్కూల్ ప్రిన్సిపాల్.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి వారిని అలర్ట్ చేసింది. బాంబు నిర్వీర్య బృందం, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. పరిసర ప్రాంతాల్లో గాలించాయి. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని.. నమూనాలను సేకరించాయి. అనంతరం, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.#WATCH | Almora, Uttrakhand | On recovery of gelatin sticks near a school, Almora SSP Devendra Pincha says, "...In the Dabra village, around 161 gelatin sticks were found in the bushes near the school. The local police arrived at the scene and the BDS team was also called in. The… pic.twitter.com/xdGv0hqAsA— ANI (@ANI) November 22, 2025ఈ సందర్బంగా అల్మోరా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) దేవేంద్ర పించా మీడియాతో మాట్లాడుతూ.. పేలుడు పదార్థాల స్వాధీనంపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ధృవీకరించబడిన సమాచారాన్ని వివరిస్తామని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. జిలెటిన్ స్టిక్స్‌ను సాధారణంగా నిర్మాణాలు, మైనింగ్ పనుల్లో రాళ్లను పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్‌ను ఉపయోగిస్తారు. అయితే, ఇంత భారీ మొత్తంలో వీటిని గ్రామానికి ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి వివరించారు. ఈ ఘటనపై పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1908, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేశారు. లోతైన విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్పి వెల్లడించారు. -
వైఎస్ఆర్ జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు
-
కర్ణాటక: చిక్ బళ్లాపూర్ జిల్లా హిరెనాగవేలిలో పేలుడు
-
బిస్కెట్ అనుకొని జిలెటిన్ స్టిక్ తిని..
చెన్నై: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. తిరుచిరాపల్లి జిల్లా అలగారై గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు విష్ణుదేవ్ చేపలు పట్టడానికి ఉపయోగించే జిలెటిన్ స్టిక్(పేలుడు పదార్థం)ను బిస్కెట్ అనుకొని తినడంతో ఒక్కసారిగా ఆ స్టిక్ పేలిపోయింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ బాలుడి తండ్రి, సోదరుడు చేపలు పడుతూ జీవనం సాగిస్తారు. అయితే విష్ణు సోదరుడు గంగతరానా, అతని స్నేహితులు మోహన్ రాజ్, తమిళ సరన్‌లు చేపల పట్టడానికి మూడు జిలెటిన్ స్టిక్‌లను మంగళవారం తీసుకొచ్చారు. కాగా వారు తెచ్చిన మూడు జిలెటిన్ స్టిక్‌లను చేపలు పట్టడానికి తీసుకెళ్లగా.. మిగిలిన ఒక స్టిక్‌ను ఇంట్లో పెట్టి వెళ్లారు. ఇంట్లోనే ఉన్న విష్ణుదేవ్ జిలెటిన్ స్టిక్‌ను బిస్కెట్ అని పొరపాటున తినడానికి నోట్లో పెట్టగానే అది పేలిపోవడంతో మృతి చెందాడు. ఈ సంఘటన విచారణలో భాగంగా విష్ణు సోదరుడు గంగతరానా, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
హంద్రీనీవా పనుల్లో అపశృతి
-జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరికి గాయాలు వి.కోట: హంద్రీనీవా పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. చిత్తూరు జిల్లా వి.కోట మండలం పత్తేర్లమాకులపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. హంద్రీనీవా కాలువలో అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్‌తో పేలుళ్లు జరిపారు. దీంతో బండ రాళ్ల ముక్కలు ఎగిరి సమీపంలోని రైతుల ఇళ్లపై పడ్డాయి. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం(55), నరేంద్ర (16)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఆగ్రహంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. .


