breaking news
Gaurang Shah
-
వస్త్రమే చిత్రము!
ప్రాచీన నిర్మాణాలను చూసినప్పుడు వాటిలోని కళాత్మకత మన చూపును తిప్పుకోనివ్వదు. అలాంటి సమయాల్లో గత కాలపు వైభవం గొప్పదనాన్ని చర్చించుకోకుండా ఉండలేం. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో డిజైనర్ గౌరంగ్ షా టెక్ట్స్‌టైల్ మ్యూజియం సందర్శిస్తే మనకు అలాంటి అనుభవమే ఎదురవుతుంది. దేశంలోని హస్త కళాకారుల సృజనను ఒక చోట చేర్చి మనకు అందించడంలో ఈ డిజైనర్ చేసిన కృషిని అభినందించకుండా ఉండలేం.డిజైనర్ స్టూడియోలకు వెళ్లినప్పుడు మన చూపు మొదట గోడ మీదుగానే వెళుతుంది. గౌరంగ్ షా టెక్ట్స్‌టైల్ మ్యూజియంకు వెళ్లినప్పుడు అక్కడ పసుపు, కుంకుమ కలిపినట్టుగా ఉండే గోడలు కొన్నిచోట్ల, తెలుపు, ముదురు గోధుమ రంగుతో రూపుకట్టిన కళాత్మకత, పెయింట్‌లా కనిపించే ఫ్యాబ్రిక్ వర్క్స్ .. ఒక్కొక్కటి కథ చెబుతున్నట్టుగా కళాకారుల లోకంలోకి తీసుకెళుతుంది. మూడు అంతస్తులలో ఉన్న ఈ మ్యూజియం ప్రతి అంతస్తులో వాల్ ఆర్ట్, వస్త్రాలను ప్రతినెలా మార్చుతూ ఉంటారు. ఇందులో భాగంగా ఒక నెల కలంకారి, మరొక నెల పటోలా తరువాత జమ్దానీ.. ఇలా పూర్తిగా ఒక థెరపీ భావన మనలో కలుగుతుంది. గత సంవత్సరం ప్రవేశపెట్టిన ఈ కళాత్మక సంపద గురించి గౌరంగ్ షా మాట్లాడుతూ... ‘‘ప్రాతికేళ్లుగా దేశమంతా చేనేతలతోనూ, హస్తకళాకారులతోనూ కలిసి పనిచేశాను. ఎక్కడెక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న కళాకారులను కలుసుకున్నాను. కనుమరుగవుతున్న కళలకు రూపం ఇవ్వాలని ప్రయత్నించాను. అందుకు నా ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఉపయోగపడింది. ఫ్యాషన్ షోలలో మన తెలుగు రాష్ట్రాలలోని చేనేతలతో ప్రాటు దేశవ్యాప్త చేనేతలను ప్రదర్శించాను. కొత్త డిజైన్స్, ఫ్యాబ్రిక్ మిక్సింగ్, డిజైనింగ్స్‌లో మార్పులు తీసుకువచ్చాను. వాటిలో షిబోరి డైయింగ్, బాతిక్ నమూనాలు, కలంకారి హ్యాండ్–పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ వంటి క్రాఫ్ట్ టెక్నిక్స్ అన్నింటినీ ఇప్పుడు ఒకేచోట పొందుపరిచాను. దేశంలోని పేరొందిన హస్తకళలు కలంకారీ, జమ్దానీ, గోటాపట్టీ, ,.. మొదలైన పెయింటింగ్, డైయింగ్, ఎంబ్రాయిడరీ వర్క్స్‌తో ఒక థీమ్‌గా తీసుకువచ్చాం. రాబోయేది వివాహ వేడుకల సీజన్ కాబట్టి ఇప్పుడు కంచి పట్టు థీమ్ తీసుకున్నాం.గోడలు మాట్లాడతాయి...ఇక్కడకు వచ్చినవారు .. చికంకారి, కాంత.. వంటి ఎంబ్రాయిడరీ శైలులతో ప్రాటు జమ్దానీ నేత, డైయింగ్ పద్ధతులతో ప్రకృతిలోని వివిధ రకాల పూల సొగసు, రేఖాగణిత నమూనాలు చూడచ్చు. లేత రంగుల్లో బెడ్ఫర్నిషింగ్, టేబుల్ రన్నర్స్, నేలపైన పరుచుకున్న కార్పెట్లు, లాంప్ షేడ్స్.. ఇవన్నీ టెక్స్టైల్ ఆర్ట్‌లో ఒక భాగమే. ఇక్కడకు వచ్చినవారు ‘మ్యూజియంలు గత కాలపు గుర్తులను ప్రదర్శిస్తాయి. కానీ, ఇక్కడ ఉన్నవాటిని ఈ రోజులకు ఎలా అన్వయిస్తున్నారు?’ అని అడుగుతుంటారు. మన చుట్టూ ఉన్న అందాలకు మరిన్ని మెరుగులు దిద్ది మరింత ఆసక్తికరంగా చూపిస్తే అది అన్ని కాలాలకు ఎవర్‌గ్రీన్‌గానే నిలుస్తుంది. ప్రతి ఫ్రేమ్‌కు పక్కనే ఆ వర్క్‌కి సంబంధించిన నోట్ కూడా ఉంటుంది. ఈ వివరాలు తెలుసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఇక్కడకు వస్తుంటారు.కాలానికి అతీతమైన కళాత్మకతకలంకారీ ఆర్ట్‌కు సంబంధించి 57 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో ఒక ΄్యానెల్ తయారు చేయించాం. రెండు గోడలను ఆక్రమించుకున్న ఈ డిజైనింగ్‌లో మహాభారతం, రామాయణం, భాగవతాన్ని అందంగా చిత్రీకరించారు. డిజైనర్ తిరుపతి క్లస్టర్లో రెండు సంవత్సరాలకు పైగా ఒకే కళాకారుడు దీనిని తయారు చేశాడు. ఇది సహజ రంగుల అద్భుతమైన వస్త్రం. వంద అడుగుల పొడవుతో ఉన్న ఒకే వస్త్రంపైన పూర్తి రామాయణం చిత్రిస్తున్నారు. అది త్వరలో రాబోతోంది. గోడలకు పెట్టిన ఫ్రేమ్స్‌లో తంజావూరు, గుజరాత్ మోచి కుట్టు, పంజాబ్ ఫుల్కారీలు, బెంగాలీల కథా వంటివి తీసుకున్నాం. ఇక తొమ్మిది అడుగుల ఎత్తు నుండి వేలాడదీసిన ప్రాతికపైగా చీరలది ఒక థీమ్. ఒక్కో నెల ఒక్కో థీమ్ చీరలను ఇక్కడ ఉంచుతాం. రాబోయే వివాహ వేడుకల కోసం కంచిపట్టు థీమ్ తీసుకున్నాం. ఆ పక్కనే జైపూర్ నుండి చేతితో చిత్రించిన టైల్స్, ఇతర ఫర్నిషింగ్ ఉంటుంది. ఇక రెండవ అంతస్తులో మహిళల కోసం రెడీ టు వేర్, మూడవ అంతస్తులో పురుషుల డ్రెస్సులు ఉంటాయి. ఇవే కాకుండా కాశ్మీర్ నుండి ఆంధ్ర వరకు ఉన్న నేత నైపుణ్యాలను ఇక్కడకు తీసుకువచ్చాం. ఈ కళ మూలంలో మొఘల్, కాకతీయ తోరణాలు, ఆలయ శిల్పాలు, పక్షులు, అటవీ సంపదను గుర్తుకు తెస్తాయి. అదంతా నేతలో సున్నితమైన అందాన్ని కళాకారులు తీసుకువచ్చారు. ఈ చేతిపనులన్నీ కళావశేషాలు కావు, సజీవ భాష. కళ్లు చెదిరే కళాఖండాలుకృష్ణలీలల ఫ్రేమ్స్‌లో ప్రాటన్ పటోలా, పటచిత్ర, తంజావూరు వంటి విభిన్న పద్ధతులలో రూపొందాయి. ఆరి ఎంబ్రాయిడరీ, అహ్మదాబాద్‌లో రూపొందిన గణేశ కాన్వాస్‌లో మోగా సిల్క్, ఆర్గాంజా, మొఘల్ ఆర్కిటెక్చర్‌ను ఒకే ΄్యానెల్లో వచ్చేలా చూశాం. ఉ΄్పాడ, వెంకటగిరి, ప్రార్సీ గారా, పైథాని వరకు నేత పనితోప్రాటు దేశవ్యాప్తంగా ఏడు వేలకి పైగా కళాకారుల కుటుంబాలతో కలిసి పనిచేస్తున్నాం. ఇది మన సామూహిక జీవన కళా చైతన్యానికి వారధి’’ అని తెలియజేశారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధిఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
హస్త వర్ణాలు
ఆ చేతులు కదిలితే ప్రపంచం చేతులెత్తి జై కొడుతోంది. ఆ చేతలే చే‘నేత’లై ఫ్యాషన్ ధోరణుల్ని తిరగరాస్తున్నాయి. కొమ్ములు తిరిగిన డిజైనర్లు సైతం సొమ్ములు కావాలంటే తమను ఆశ్రయించాల్సిందే అని శాసిస్తూ... అద్భుతాలను అలవోకగా ఆవిష్కరిస్తూ... హస్తవర్ణాల శోభితమై కొత్త కాంతులీనుతున్నాయి. ఆ చేతులకూ... ఆ చేతలకూ... మన చేనేతల ఘనతకూ ఇవి కొన్ని మెచ్చు తునకలు మాత్రమే... మన చేనేతలు ప్రపంచానికే ప్రత్యేకం సంప్రదాయ చేనేతల గొప్పదనాన్ని వెలికితీయడమే నా ఉద్దేశ్యం. ఇటీవల ‘కౌసల్యం’ పేరుతో హైదరాబాద్‌లో జరిగిన ఫ్యాషన్ షో లో ప్రదర్శించిన వస్త్ర శైలులు ఇవి. దాదాపు 700కు పైగా చేనేతకారుల నైపుణ్యాలు ఈ డిజైనరీ దుస్తులలో ప్రతిఫలిస్తాయి. జమదాని చేనేత పనితనం ఇక్కడే కాదు దేశం మొత్తం మీద, ఇతర దేశాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంది. ఇటీవల జరిగిన లాక్మేఫ్యాషన్ వీక్‌లోనూ, బెర్లిన్‌లో జరిగిన లవేరా ఎకో ఫ్యాషన్ వీక్‌లోనూ చేనేతలు తమ ప్రత్యేకతను నిలుపుకున్నాయి. ఫ్యాషన్ ప్రపంచానికి ఓ ఐకాన్‌గా గుర్తింపును సాధిస్తున్నాయి మన హ్లాండ్లూమ్స్! - గౌరంగ్ షా, ఫ్యాషన్ డిజైనర్ బంగారు జరీ అంచు.. ఆకట్టుకునే రంగులతో రూపొందించిన లెహంగా ఛోలీ ప్రతి వేడుకను దేదీప్యం చేస్తుంది. కాటన్ హ్యాండ్లూమ్ శారీ మీద సన్నని ప్రింట్. నేటి మహళను హుందాగా నిలపడంలో ఎప్పుడూ ముందుంచే ‘కళ’నేత. చూపులను కట్టడి చేసే రంగుల కాంబినేషన్, ఎంబ్రాయిడరీ పనితనం పెళ్లికూతురు సింగారంలో హైలైట్‌గా నిలుపుతాయి. బ్రైడల్ కలెక్షన్లో భాగంగా లెహంగా చోళీతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. సంప్రదాయకట్టు, పాశ్చాత్య కట్... ఇంపైన నిండుతనాన్ని కలిగించే చేనేతలు ప్రతి వేడుకలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటాయి. డిజైనర్ల సృష్టికి జోహార్లు చెబుతాయి.


