breaking news
gattu mandal villages
-
గట్టులో టీచర్లను నియమించండి
సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న కొన్ని పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేడని, మండలానికి 218 పోస్టులను మంజూరు చేయగా కేవలం 54 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని చెప్పారు. -
గట్టు మండలం గ్రామస్తులకు ఊరట
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలం గ్రామస్తులకు హైకోర్టులో ఊరట లభించింది. సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం గట్టు మండలంలోని దాదాపు ఆరు గ్రామాలకు చెందిన 6 వేల ఎకరాల భూమి స్వాధీనం కోసం ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మార్వోపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరు వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి జూన్ 3వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కాగా గట్టు మండలం కాలూర్‌తిమ్మన్‌దొడ్డి, కుచినేర్ల, మల్లాపురం, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామాల శివారుల్లోని సుమారు 5,600 ఎకరాల్లోని అసైన్డ్ భూముల్లో వెయ్యి మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆ భూములను చాలాకాలంగా రైతులు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు నోటీసులు అందటంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు.