breaking news
gas accident
-
విషాదం నింపిన ‘బిర్యానీ’!
రంగారెడ్డి జిల్లా: బిర్యానీ తినాలనే కోరిక ఆ కుటుంబంలో విషాదం నింపింది. బిర్యానీ అయిపోయిందని స్టౌను ఆఫ్ చేయకముందే రెగ్యులేటర్‌ను తొలగించడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో ఓ మహిళ తీవ్ర గాయాలకు గురి కాగా ఆమెను కాపాడేందుకు వెళ్లిన కూతురు, కుమారుడు కూడా గాయపడ్డారు. రాజేంద్రనగర్ పోలీసు సమాచారం మేరకు... ఉప్పర్‌పల్లిలో హరి సింగ్ కుటుంబ నివసిస్తుంది. ఇతని కూతురు మాధవి ఠాకూర్(55) తన కుమారుడు, కుమార్తెతో కలిసి తండ్రి వద్దే ఉంటుంది. ఆదివారం మాధవి ఠాకూర్ ఇంట్లో బిర్యానీ చేసేందుకు స్టౌను వెలిగించి బిర్యానీ పూర్తి చేసింది. బిర్యానీ పూర్తయిన అనంతరం స్టౌను ఆఫ్ చేయకముందే రెగ్యులేటర్‌ను తీసి మరో స్టౌకు పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో మాధవి ఠాకూర్ తీవ్ర గాయాలకు గురైంది. వంట గదిలోని సామాగ్రి మొత్తం దగ్ధమైంది. మాధవి ఠాకూర్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన కూతురు, కుమారుడు సైతం స్వల్ప గాయాలకు గురయ్యారు. తీవ్ర గాయాలకు గురైన మాధవి ఠాకూర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వంట చేస్తుండగా పేలిన సిలిండర్
-
గ్యాస్ సిలిండర్ లీకై భార్య భర్తలు మృతి
గ్యాస్ సిలిండర్ లీకై ఇంట్లో మంటలు చెలరేగిన ఘటనలో భార్యాభర్తలు మృతిచెందారు. ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ లీకవడంతో.. మంటలు చెలరేగాయి.. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో బాణాసంచా సామాగ్రి ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గిరిజాల పంచాయతి వేమగొట్టిపాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తికి తీవ్రగాయాలు
గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి గ్యాస్ వెలిగించడానికి ప్రయత్నిస్తుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు కాగా.. ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి త రలించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.


