breaking news
gangabhavani
-
నిజామాబాద్లో రెండు దొంగతనాలు
నిజామాబాద్జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో బుధవారం రాత్రి రెండిళ్లలో దొంగతనాలు జరిగాయి. గ్రామానికి చెందిన వేముల గంగాభవానీ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఊరికి వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.5వేల నగదుతోపాటు ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. అలాగే, ఆ పక్కనే ఉన్న చింతం రాములు ఇంట్లో ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న వారిపై మత్తు మందు చల్లి తాపీగా ఇంట్లో వస్తువులను చిందరవందర చేశారు. దాచి ఉంచిన రూ.24వేల నగదుతోపాటు రాములు కోడలు అనిత మెడలోని బంగారు గొలుసు సహా 5 తులాల బంగారు ఆభరణాలను, 5 తులాల వెండి ఆభరణాలను పట్టుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై అంజయ్య సంఘటన స్థలిని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. -
స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి
దమ్ముగూడ: స్కూలు బస్సు చక్రాల కిందపడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మండవల్లి మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు... స్ధానిక మణుగూరు సాంబయ్య గూడకు చెందిన గంగాభవానీ(4) దమ్ముగూడలోని అమ్మమ్మ దగ్గర ఉంటోంది. ఈ రోజు ఉదయం చిన్నారి అమ్మమ్మ తన కొడుకు పిల్లలను స్కూలు బస్సు ఎక్కించేందుకు వెళ్లింది. అమ్మమ్మతో పాటు వెళ్లిన గంగాభవానీ ఆడుకుంటూ బస్సు వెనుక చక్రాల కింద పడింది. అది గమనించని డ్రైవర్ బస్సు ముందుగా పోనివ్వడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.