breaking news
Galaxy On Nxt
-
శాంసంగ్ ఆన్ నెక్ట్స్ కొత్త వేరియంట్...డిస్కౌంట్ ధరలో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ సిరీస్‌లో ని శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్ లో కొత్త వేరియంట్ (16జీబీ)ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.10,999గా నిర్ణయించింది. అయితే ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 3 -5 మధ్య బొనాంజా సేల్స్‌లో విక్రయించనుంది. ఈ పరిమిత కాల ఆఫర్లో రూ.9,999కే అందిస్తోంది. కాగా 2016లో గెలాక్సీ ఆన్ నెక్ట్స్ 32జీబీ వెర్షన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఆన్ నెక్ట్స్ ఫీచర్స్ 5.5 అంగుళాల డిస్ప్లే 2.5డి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1.5 ఆక్టాకోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 256దాకా విస్తరించుకునే సదుపాయం 13 మెగా పిక్సెల్ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
గెలాక్సీ ఫోన్ల ధరలు తగ్గించిన ఫ్లిప్ కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ శాంసంగ్ మొబైల్స్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. తన పోర్టల్ పై 'శాంసంగ్ మొబైల్స్ ఫెస్ట్' ను నిర్వహిస్తున్న ఈ ఈ-కామర్స్ దిగ్గజం పలు ఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఫెస్ట్ కింద శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్, శాంసంగ్ గెలాక్సీ ఆన్8, శాంసంగ్ గెలాక్సీ ఆన్7, శాంసంగ్ గెలాక్సీ ఆన్5, శాంసంగ్ గెలాక్సీ జే5(2016), శాంసంగ్ గెలాక్సీ ఏ9 ప్రొ, గెలాక్సీ సీ9 ప్రొల తక్కువ ధరకు లభించనున్నాయి. గెలాక్సీ ఆన్5పై ఈ దిగ్గజం రూ.2860 వరకు ధరను తగ్గించింది.రూ.9850గా ఉన్న ఈ ఫోన్ ప్రస్తుతం రూ.6990కు అందుబాటులో ఉంచింది. గెలాక్సీ ఆన్ నెక్ట్స్ పై కూడా రూ.2590 ధరను తగ్గించి, బ్లాక్, గోల్డ్ వేరియంట్లు రూ.15,900 కొనుక్కునే విధంగా ఫ్లిప్ కార్ట్ అవకాశం కల్పిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.18,490. ఈ ఫెస్ట్ కింద రూ.15,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఐడియా సబ్ స్క్రైబర్లు 1జీబీ రీఛార్జ్ తో 14జీబీ పొందనున్నారు. ధర తగ్గిన మిగతా గెలాక్సీ ఫోన్ల వివరాలు గెలాక్సీ జే5(2016) ధర రూ.2300 తగ్గింపు, ప్రస్తుతం బ్లాక్, గోల్డ్ వేరియంట్లు రూ.10,990కు అందుబాటు(ఎలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండదు). గెలాక్సీ ఆన్8 పై రూ.2000 తగ్గింపు, గెలాక్సీ ఆన్7పై రూ.1700 తగ్గింపు గెలాక్సీ ఆన్8పై రూ.13వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటు గెలాక్సీ ఆన్8, గెలాక్సీ ఆన్7 ఏది కొన్నా ఐడియా 1జీబీ రీఛార్జ్ తో 14జీబీ డేటా పొందవచ్చు. గెలాక్సీ ఆన్9 ప్రొ, గెలాక్సీ సీ9 ప్రొలపై ధరలు తగ్గించనప్పటికీ, భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఎక్స్చేంజ్ లో కొన్నవారికి రూ.16వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. ఈ ఫోన్ల ధర రూ.29,900, రూ.36,900గా ఉన్నాయి.