breaking news
gadde ruthvika Shivani
-
ఫైనల్లో రుత్విక
పుణే: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో రుత్విక శివాని 16–21, 21–14, 21–12తో తెలంగాణకే చెందిన సామియా ఇమాద్ ఫారూఖిపై విజ యం సాధించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ తర్వాత గాయాల బారిన పడిన రుతి్వక ఇటీవలే కోలుకొని మళ్లీ రాకెట్ పట్టింది. ఈ టోర్నీ క్వాలిఫయింగ్‌లో పాల్గొన్న ఆమె విజేతగా నిలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. నేడు జరిగే ఫైనల్లో శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)తో రుత్విక తలపడుతుంది. -
రన్నరప్ రుత్విక, రాహుల్
వల్సాడ్ (గుజరాత్): అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, రాహుల్ యాదవల్కు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో రుత్విక... పురుషుల సింగిల్స్ విభాగంలో రాహుల్ రన్నరప్‌లుగా నిలిచారు. మహిళల ఫైనల్లో ఐదో సీడ్ రుత్విక 21-12, 17-21, 5-21తో పీసీ తులసీ (కేరళ) చేతిలో ఓటమి చవిచూడగా... పురుషుల ఫైనల్లో 15వ సీడ్ రాహుల్ 10-21, 13-21తో రెండో సీడ్ శ్రేయాన్ష్ జైస్వాల్ (ఎయిరిండియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.హేమనాగేంద్ర బాబు మిక్స్డ్ డబుల్స్‌లో, పురుషుల డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. మిక్స్డ్ ఫైనల్లో హేమనాగేంద్ర బాబు-పూర్వీషా ద్వయం 22-24, 17-21తో అరుణ్ విష్ణు-అపర్ణ జంట చేతిలో... పురుషుల డబుల్స్ ఫైనల్లో హేమనాగేంద్ర బాబు-దిజు జంట 10-21, 14-21తో జిష్ణు సాన్యాల్-శివమ్ శర్మ జోడీ చేతిలో ఓడిపోయాయి.