breaking news
future hope
-
RC Bhargava: భవిష్యత్ భారత్‌దే
న్యూఢిల్లీ: భవిష్యత్ వృద్ధికి సంబంధించి మిగతా దేశాలన్నింటితో పోలిస్తే భారత్ అత్యంత మెరుగైన స్థితిలో ఉందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. భారత్ ముందుకు సాగాలంటే కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలు, విధానాలను వదిలించుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు.. వృద్ధి సాధన గురించి ఇథమిత్థంగా అంచనా వేయలేని నిర్దిష్ట స్థాయికి చేరాయని భార్గవ చెప్పారు. అక్కడి ప్రజలు మరింత విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నప్పటికీ పని చేయాలన్న స్ఫూర్తి తగ్గిందని ఆయన తెలిపారు. మరోవైపు, మన వారు తమ భవిష్యత్తుతో పాటు తమ కుటుంబాలు, పిల్లల భవిష్యత్తును కూడా గణనీయంగా మెరుగుపర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారని భార్గవ చెప్పారు. ఇదే కసి భారత్‌ను ముందుకు తీసుకెడుతోందని ఆయన వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదా అనే ప్రశ్నకు స్పందిస్తూ మనం కాలం చెల్లిన విధానాలన్నింటినీ వదిలించుకోవాల్సి ఉందన్నారు. ఇక, తమ సంస్థ ముందు నుంచి పొదుపుగా వ్యవహరిస్తూ వస్తోందని, అందుకే వ్యాపార విస్తరణ కోసం ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా అంతర్గత నిధులనే వినియోగించుకుంటున్నామని భార్గవ చెప్పారు. చిన్న పట్టణాల్లో నెక్సా సరీ్వస్ మారుతీ సుజుకీ చిన్న పట్టణాల్లో సరీ్వస్ కేంద్రాలను విస్తరిస్తోంది. ఇందుకోసం 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కాంపాక్ట్ నెక్సా సరీ్వస్ వర్క్‌షాప్స్ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని నిర్మల్సహా హర్యానా, పశి్చమ బెంగాల్, గుజరాత్, తమిళనాడులో మొత్తం ఆరు కేంద్రాలను ప్రారంభించింది. 2025 మార్చి నాటి కి దేశవ్యాప్తంగా ఇటువంటి 100 వర్క్‌షాప్స్‌ను నెలకొల్పాలన్నది లక్ష్యమని మారుతీ సుజుకీ ఇండి యా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెక్సా షోరూంల ద్వారా జరుగుతున్న మొత్తం కార్ల విక్రయాల్లో నగరాలకు వెలుపల ఉన్న ప్రాంతాల వాటా 30 శాతం ఉందని చెప్పారు. -
రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి జగన్
వై.ఎస్. మరణం తర్వాత ఈ రాష్ట్రం దిక్కులేనిదై పోయిందనడానికి ప్రస్తుత రాజకీయ పరిణామాలే నిదర్శనం. అసలు వీటన్నిటికీ నాంది... కాంగ్రెస్ అధిష్ఠానం జగన్ ఓదార్పుయాత్రను అడ్డుకోవడం. ప్రజలు ఆయన్ని కేవలం వై.ఎస్. తనయుడిగా మాత్రమే చూడడం లేదనీ, ఆయన్ని తమ ఆశాజ్యోతిగా భావిస్తున్నారనీ సోనియా గ్రహించలేకపోయారు. ఆమెకు తెలియజెప్పేవారు లేకపోయారు. జగన్ అంటే రాజశేఖరరెడ్డిగారి సదాశయాలు, ఆదర్శాలు నెరవేర్చగల యువనాయకుడని రాష్ట్ర ప్రజలందరి ఏకాభిప్రాయం. ఓ విద్యార్థిని కదిపి చూడండి... ‘వై.ఎస్.ఆర్.గారు బతికుంటే మాకు గవర్నమెంట్ టెక్నో స్కూల్స్ వచ్చి వుండేవి’ అంటాడు. రైతులను కదపండి... ‘రాజన్న ఉండి వుంటే మా బతుకులిలా బుగ్గి కాకపోయుండె’ అంటారు. ఈ అప్పుల తిప్పలు తప్పి రారాజులుగా బతికేవాళ్లం అని ఆవేదన చేస్తారు. ‘‘మారాజు ఉండి ఉంటే ప్రాజెక్టులు మొదలయ్యేవి, కొన్ని పూర్తయ్యేవి, వేల ఎకరాలు సాగులోకి వచ్చేవి’’ అంటారు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ‘‘మమ్మల్ని బానిసలుగా చూసిన గత ప్రభుత్వాలు మాచేత వెట్టిచాకిరీ చేయిస్తే, వై.ఎస్.గారు ఎంతో గౌరవించి మా వేతనాలు పెంచారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాకుండా బ్యాన్ పెడితే వై.ఎస్.గారు గ్రామస్థాయి వి.ఆర్.ఓ. పోస్టుల నుంచి, పైస్థాయి ఆఫీసర్ పోస్టుల వరకు భర్తీ చేశారు. మూతపడిన ప్రభుత్వ సంస్థలను పునరుద్ధరించి వేలసంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించారు. కానీ ఆయన మరణానంతరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వై.ఎస్.గారి ఆశయాలను అనుసరిస్తామని చెబుతూనే ఆయన ప్రతిపాదించిన ప్రాజెక్టులను రద్దు చేస్తూ ప్రజల జీవనోపాధికి సమాధి కడుతోంది. లక్షల ఉద్యోగాలంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నారు. కానీ ఇవాళ కనీసం సచివాలయానికి కూడా వెళ్లికుండా తప్పించుకు తిరుగుతున్నారు. అరవై ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఇలాగే ప్రజల్ని వంచిస్తూ నిరుద్యోగాన్ని పెంచుకుంటూ పోతుంటే, రాజశేఖరరెడ్డిగారు ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధిగా పనిచేశారు. పారిశ్రామికవేత్తల కొమ్ము కాసి స్వార్థ ప్రయోజనాలు చేకూర్చిన గత ప్రభుత్వాల కన్నా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వై.ఎస్.ఆర్. మహానాయకుడే కదా. రాజన్న హయాంలో మహిళలు ఏనాడూ ఇప్పుడు పడుతున్నన్ని ఇబ్బందులు పడలేదు. గ్యాస్ ధర పెరగలేదు. విద్యుత్ ఛార్జీలు పెరగలేదు. ఎంత ఖర్చున్నా నెల చివర ఆదాయంలో కొంత మిగులు కనిపించేది. అటువంటి నాయకుడి బిడ్డగా ఇవాళ జగన్‌గారు తన తండ్రి ఆదర్శాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంటే, ఆయనకెక్కడ క్రెడిట్ దక్కుతుందోనని ఈ కాంగ్రెస్ నాయకులు అవరోధాలు కల్పించారు. అవినీతి ఆరోపణలు చేశారు. చివరికి జైలుకు పంపించారు. రాష్ట్రప్రజలకు తిరిగి రాజన్న రాజ్యం అందుబాటులోకి రావాలంటే జగనన్న బయటికి రావాలి. ఇదే ప్రజలందరి ఆకాంక్ష. - పద్మావతి, సంస్కృతి టౌన్షిప్, అన్నోజిగూడ