breaking news
Fusion Wear Outfit
-
వివాహ వేడుకలో... ఫ్యూజన్ స్టైల్
వివాహ వేడుకలలో సంప్రదాయ పట్టు చీరల రెపరెపలు ఆధునికపు హంగులతో మరింత వైభవంగా వెలిగిపోతున్నాయి. కట్టు, కట్స్, కలర్‌తో కొంగొత్తగా రూపుకడుతున్నాయి. ఫ్యూజన్ స్టైల్స్‌ని ఇష్టపడుతున్న నవతరం ఈ వెడ్డింగ్ సీజన్‌ని అటు సంప్రదాయం ఇటు ఆధునికతల మేళవింపుతో సరికొత్తగా చూపుతోంది.ట్రెడిషన్ – ట్రెండ్ కలయికకంచిపట్టు లెహంగా ధరించి, దానిపైన సీక్వెన్స్ బ్లౌజ్ వేసుకోవడం. అలాగే, క్లాసిక్ ఫ్యాబ్రిక్ శారీ (Classic fabric saree) అయితే మోడ్రన్ కట్ బ్లౌజ్ ధరించడం ఈ స్టైల్ ప్రత్యేకత.ఇండియన్ – వెస్టర్న్లెహంగాకి క్రాప్‌టాప్ లేదా ష్రగ్ వంటి వెస్టర్న్ టాప్స్ ధరించడం. ఇది ట్రెడిషనల్ సిల్హౌట్కి వెస్ట్రన్ టచ్ ఇస్తుంది. షరారా ప్యాంట్స్, జాకెట్ స్టైల్ చోలీలు లేదా అంగరఖా టాప్స్ ఇవి వధువుల రిసెప్షన్ లుక్స్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.పీచ్ టోన్స్గతంలో రెడ్, మెరూన్ వివాహవేడుకలలో ప్రధానంగా కనిపించేవి. ఇప్పుడు పీచ్, రోజ్ గోల్డ్, బీజ్ టోన్స్ ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి సాఫ్ట్ లుక్ (Soft look) ఇవ్వడంతో పాటు అందాన్ని పెంచుతున్నాయి.లెహంగా విత్ కేప్ దుపట్టాట్రెడిషనల్ దుపట్టా స్థానంలో లైట్ షిమ్మర్ కేప్ వాడటం ఈ సీజన్లో హిట్. ఇది లుక్కు రాయల్ టచ్ ఇస్తుంది. ఇవి సంగీత్ వంటి వేడుకలకు హైలైట్‌గా మారాయి. సంప్రదాయ స్టైల్స్‌కి ఆధునికపు హంగులను జోడించడమే నేటి ట్రెండ్. ఫ్యూజన్ స్టైల్‌గా పిలిచే ఈ ఫ్యాషన్‌లో క్రియేటివిటీ ప్రధానంగా చూస్తున్నారు. చదవండి: నాన్నలూ అమ్మలవుతారు.. కుంగిపోతారుసంప్రదాయానికి ఆధునికతను జత చేస్తున్న ఈ ఫ్యూజన్ లుక్స్ ఈ తరం వధువులలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాయి పట్టు బ్లౌజ్‌కి నెటెడ్ స్లీవ్స్, ఆర్గంజా దుపట్టాతో బెనారసీ లెహంగా మ్యాచ్ చేయడం.. వంటివి నేటి ట్రెండ్ టెంపుల్ నెక్లెస్‌కి మరో డైమండ్ పెండెంట్ ఉన్న చైన్ లేదా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని సిల్క్ శారీస్‌తో ధరించడం ఫ్యూజన్ స్టైల్‌గా మారింది సంప్రదాయ ఆభరణాలతో న్యూడ్ మేకప్, లైట్ బీచ్ వేవ్స్ హెయిర్‌స్టైల్స్ ఈ అలంకరణకు బాగా సూట్ అవుతున్నాయి.పేస్టెల్ షేడ్స్ ఎంపికఈ సీజన్ లో పెళ్లి కూతురి లుక్ పూర్తిగా నేటి కాలానికి తగినట్టుగా మారిపోతోంది. వధువు ధరించే సంప్రదాయ పట్టు చీరలకు బదులు ఫ్యూజన్ స్టైల్స్ బాగా హిట్ అవుతున్నాయి. బెనారస్ ఫ్యాబ్రిక్ మోడర్న్ కట్స్, టాప్ టు బాటమ్ ఒకే కలర్‌తో ఉండే మోనోటోన్ లెహెంగాస్ లేదా పేస్టెల్ షేడ్స్ లో శారీస్ ఇవే ఇప్పుడు నూతన వధువుల ఎంపిక అవుతుంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సీక్విన్ వర్క్, పెర్ల్ డీటైలింగ్ వంటివి వధువు లుక్‌కి రాయల్ టచ్ ఇస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు లైట్‌వెయిట్ చీరలు (light weight saree) లేదా జామెట్రిక్ ప్యాటర్న్స్‌తో కూడిన లెహెంగాస్ను ఇష్టపడుతున్నారు. ఇవి ఫొటోలలో చాలా బ్రైట్‌గా కనిపిస్తాయి. వధువులే కాదు, వధువు తరపున వేడుకలో పాల్గొనబోయే అమ్మాయిలు కూడా పేస్టెల్ కలర్స్, ఫ్లోరల్ ప్రింట్స్ తో తమదైన స్టేట్మెంట్ని సృష్టిస్తున్నారు. మొత్తానికి, ఈ సంవత్సరం వధూవరుల ఫ్యాషన్ అనేది ‘ట్రెడిషన్ మీట్స్ మోడర్నిటీ‘ అని చెప్పొచ్చు.– చంద్రిక కంచెర్ల, ఫ్యాషన్ డిజైనర్ -
హెయిర్‌ని అటు ఇటు తిప్పేస్తున్న యాంకర్ రష్మి (ఫొటోలు)


