breaking news
Frying pan
-
పైన నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్.. పక్కనే కెటిల్.. ధర రూ.5,212!
ఈ రోజుల్లో సమయాన్ని ఆదా చేసే గాడ్జెట్స్‌కి మార్కెట్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. సమయంతో పాటు స్థలం కూడా ఆదా అయితే మరీ మంచిదంటున్నారు వినియోగదారులు. అలాంటి వారికోసమే ఈ డివైజ్. ఇందులో చక్కగా మూడు వెరైటీలను ఒకేసారి తయారుచేసుకోవచ్చు. 8 లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవెన్‌తో పాటు పైన నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్‌ను, పక్కనే కెటిల్‌ను ఒకే సమయంలో వినియోగించుకోవచ్చు. ఓవెన్లో పిజ్జాలు, బర్గర్లు, పఫ్స్.. గ్రిల్ ఐటమ్స్.. ఇలా ఎన్నో తయారు చేసుకోవడంతో పాటు పైన ఉన్న పాన్‌లో ఆమ్లెట్స్, పాన్ కేక్స్ వంటివి రెడీ చేసుకోవచ్చు. ఇక కుడివైపు టీ లేదా కాఫీ లేదా వేడినీళ్ల కోసం కెటిల్ డివైజ్ కనెక్టర్ ఉంటుంది. దాన్ని అవసరం లేకుంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. దాంతో స్థలం కలిసి వస్తుంది. కుడివైపు కెటిల్ డివైజ్‌కి ప్రత్యేకమైన హ్యాండిల్ ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు అదే హ్యాండిల్ స్టాండ్‌లా ఉపయోగపడుతుంది. దీన్ని వినియోగించడానికి డివైజ్ ముందువైపు టైమింగ్, టెంపరేచర్‌కి సంబంధించిన 2 రెగ్యులేటర్స్, ఆన్, ఆఫ్ బటన్స్ ఉంటాయి. ధర- 68 డాలర్లు(రూ.5,212) చదవండి: Trendy Toaster: ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్ చేసుకోవచ్చు.. ధర రూ.3,733! -
అనుమానంతో కొట్టి చంపాడు
ఢిల్లీ: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను దారుణంగా కొట్టి చంపేశాడో ఓ భర్త. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో అమానుషం చోటు చేసుకుంది. షరాఫత్(33) భార్య కవిత(32) పై అనుమానంతో నిత్యం వేధించేవాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. అది తీవ్ర వాగ్వాదంగా మారటంతో ఆగ్రహంతో షరాఫత్ చేతికందిన పెనం(తవా) తీసుకుని భార్యపై దాడి చేశాడు. ముఖంపైన, తలపైన విచక్షణా రహితంగా కొట్టాడు. అంతే ఆమె రక్తమడుగులో కుప్పకూలిపోయింది. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, మంచం కింద ఉండే సొరుగులో కుక్కేసాడు. అనంతరం తన ముగ్గురు పిల్లలతో సహా సొంత ఊరికి ఉడాయించాడు. పొరుగు వారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు షరాఫత్‌ను విచారించగా, అతగాడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడి అరెస్ట్ చేసి, భార్య ప్రాణాలు తీసేందుకు వాడిన పెనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి షరాఫత్‌ను తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.