breaking news
frienshipday
-
మీదీ ఇదే కథా... ఇంకోసారి గుర్తుచేసుకొని ముసిముసిగా మురిసిపొండి!
సాక్షి, హైదరాబాద్: స్నేహితుల దినోత్సవం అంటే అందరికీ పండగే. చిన్ననాటి స్నేహితులు, టీనేజ్ ఫ్రెండ్షిప్ అన్నీ అలలు అలలుగా మన కళ్లముందు కదులుతాయి. ఈ అనుభూతి ఏ ఒక్కరికో మాత్రమే సొంతం కాదు. కుల,మత, పేద, ధనిక ప్రాంత, లింగ భేదం లేకుండా అందరిలోనూ, అందిరికీ కలిగే మధురమైన అద్భుతమైన అనుభూతి స్నేహం. ఇదీ అని వర్ణించలేం. ఎవరి ప్రత్యేకత వారిదే.. అందరికీ ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు!! Happy friendship day. pic.twitter.com/eotbUSQFdB — Charan (@charan_tweetz) August 7, 2022 మన దేశంలో ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకోవడం ఆనవాయితీ. ఫ్రెండ్షిప్ డే అనగానే శుభాకాంక్షలు చెప్పుకోవడం, పార్టీలు చేసుకోవడం చాలా కామన్. ఈ సందర్భంగా అనేక హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే , కొటేషన్లు, విషెస్ , వీడియోలు హల్ చల్ చేస్తుంటాయి. ఈ సందర్భంగా అలాంటి ఫన్నీ వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి! అభిప్రాయ బేధాలు వచ్చినా.. కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. ఎండ్ ఆఫ్ ద డే.. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్. #HappyFriendshipDay pic.twitter.com/hs3ESASVRO — Harish M (@27stories_) August 7, 2022 A good friend multiplies our happiness and divides our sorrow. Grateful to all the wonderful friends in my life ❤! Happy Friendship Day!#friendsforever #friendshipday #friendshipday2022 #happyfriendshipday❤️ #friends #manjulaghattamaneni pic.twitter.com/wBIPbsbYol — Manjula Ghattamaneni (@ManjulaOfficial) August 7, 2022 Friends fight but don't hurt ........💝 #HappyFriendshipDay #FriendshipDay #FriendshipDay2022 pic.twitter.com/vRYa2UnPuq — Suchitra Das (@Suchitra_Dass) August 7, 2022 #FriendshipDay Friends fight but don't hurt ........💝 #CaseTohBantaHai#HappyFriendshipDay #FriendshipDay2022 pic.twitter.com/Kegrh2RALW — Sanju Singh (@Iamsanjusingh1) August 7, 2022 -
ఖయ్యూమ్ ఏదైనా ఇట్టే పసిగట్టేస్తాడు..
ఎప్పుడో.. అనుకోకుండా కలిసిన ఓ స్పర్శ.. అనంతరం ఆత్మీయ మనసై మనవెంట వస్తుంది. బాధలో ఓదారుస్తుంది. పడిపోతుంటే చేయందిస్తుంది. మనసెరిగి మసలుకుంటుంది. అదే స్నేహం. జీవిత ఎత్తుపల్లాలను తనవిగా భావించి మనసున మనసై చిరకాలం నిలిచిన స్నేహితుడు అల్లరి నరేష్ తమ స్నేహాన్ని ఇలా ఆవిష్కరించారు. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో చెన్నైలో నాన్న దగ్గరకు వెళ్లా. అప్పుడు ఆయన ‘ఏవండీ ఆవిడొచ్చింది’ సినిమా తీస్తున్నారు. షూటింగ్లో పరిచయమయ్యాడు హాస్య నటుడు అలీ సోదరుడు ఖయ్యూమ్. ఆ సినిమాల్లో మేము కలిసి నటించాం కూడా. అలా ఆర్టిస్టులుగా ఏర్పడ్డ మా పరిచయం ఆత్మీయ స్నేహమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఉన్న ఆప్త మిత్రుడు ఖయ్యూమ్. మేము హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన రోజుల్లోనే అలీ కుటుంబం కూడా ఇక్కడకు వచ్చేసింది. అప్పటి నుంచి రెగ్యులర్‌గా కలుసుకుంటూనే ఉన్నాం. ఖయ్యూమ్ నిష్కల్మశమైన వ్యక్తి. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. నా ప్రతి ఫీలింగ్‌ను ఇట్టే పసిగట్టేస్తాడు. నా మనసులోని భావనలు బయటకు కనిపించకుండా ప్రయత్నిస్తాను. కానీ కయ్యూమ్కు మాత్రం తెలిసిపోతాయి. ప్రతి రోజూ కాకపోయినా అవకాశం ఉన్న ప్రతిసారి కలుస్తాం. మా మధ్య సినిమాల కంటే లెటెస్ట్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు వంటివే ఎక్కువ చర్చనీయాంశాలవుతాయి. ఇద్దరం కలిసి కాఫీషాప్లకు వెళ్తాం. కలిసి సినిమాలు చూస్తాం. చాలా హ్యాపీగా గడిపేస్తాం. - అల్లరి నరేష్, సినీనటుడు